14/04/2026
ఈరోజు డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఫిరంగిపురం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో, ఫిరంగిపురంలోని ఎస్సీ హాస్టల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే పవన్ కుమార్ రావడం జరిగింది. అలాగే ఇందులో పాలుపంచుకున్న 40 మంది విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే పవన్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో మహు లో రాంజీ సక్పాల్ , భీమబయి జన్మించారు. చిన్నతనం నుండే కుల వివక్షతకు గురైన , అనేక కష్ట సమయాల్లో కూడా బలహీన పడకుండా , పోరాట స్ఫూర్తితో ముందుకు సాగారు. బాంబే యూనివర్సిటీలో డిగ్రీ, కొలంబియా యూనివర్సిటీలో m.a, p.h.d , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డీఎస్సీ , లండన్ లో బారిష్టర్ గా న్యాయవిద్యను అభ్యసించారు. ఆ కాలంలో విదేశాలకు వెళ్లి అంత పెద్ద విద్యను అభ్యసించడం , చాలా పెద్ద విషయమని , ఒక దళితుడిగా వివక్షను ఎదిరిస్తూ , ప్రపంచ మేధావిగా ఎదగడం మనందరికీ ఆదర్శం . 1947లో రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు , స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆయన న్యాయ మరియు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అనేక సామాజిక పోరాటాలు ఉద్యమాల్లో గణనీయమైన పాత్ర పోషించారు. ఆయన చరిత్రలో ఒక గొంతుక మాత్రమే కాదు గర్జన. ఆయన చివరి దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించి 1956 డిసెంబర్ 6 న ఢిల్లీలో మరణించడం జరిగింది. అంబేద్కర్ గారు ఎంత పెద్ద చదువు చదివేరన్నది కాదు , చదువుకొని సంపాదించిన జ్ఞానాన్ని దళితుల వివక్షతకు సామాజిక న్యాయం కొరకు ఉపయోగించారు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కొరకు బలమైన వాదనను చేశారు అని మాట్లాడారు.