A S Dinesh kumar IAS

A S Dinesh kumar IAS working as Joint collector Rythubharosa & Revenue

18/12/2021

రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ
జేసీ దినేష్ కుమార్

రైతు భరోసా కేంద్రం సిబ్బంది పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు శనివారం మంగళగిరి నియోజకవర్గంలో పంట పొలాలను ఆయన పరిశీలిచారు. రైతుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జేసీకి వివరించారు. రైతులు తమ అవసరాల కోసం ముందస్తుగా తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారని ఆయన తెలిపారు. దీంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. పంట నాణ్యత గురించి రైతు భరోసా కేంద్ర సిబ్బంది రైతులకు వివరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి 21 రోజుల్లో రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. పంట వ్యర్ధాలను పొలంలో తగలబెడితే మిత్ర పురుగులు చనిపోతాయని తెలిపారు.

3.25 lakh MT paddy to be procured in Guntur districtFor ‘A’ grade varieties, the government is paying `1,960 For common ...
18/12/2021

3.25 lakh MT paddy to be procured in Guntur district
For ‘A’ grade varieties, the government is paying `1,960 For common varieties `1,940 per quintal is the rateThe amount will be paid to farmers within 21 days of purchase
www.thehansindia.com

Late post ఇది క‌దా అస‌లైన దీపావ‌ళిదాతృత్వం చాటుకున్న జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్‌గుంటూరు యానాది కాల‌నీలో చిన్నారులు...
05/12/2021

Late post

ఇది క‌దా అస‌లైన దీపావ‌ళి
దాతృత్వం చాటుకున్న జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్‌
గుంటూరు యానాది కాల‌నీలో చిన్నారులు, మ‌హిళ‌ల‌కు దుస్తులు, స్వీట్లు పంపిణీ
రూ.50 వేలు సొంత ఖ‌ర్చులు వెచ్చించిన జేసీ
పేద‌ల త‌మ జీవితాల్లో వెలుగులు నింపార‌న్న నిరుపేద‌లు

అది గుంటూరులోని శ్రీ‌న‌గ‌ర్లో యానాది కాల‌నీ. అక్క‌డ నిత్యం ఆక‌లి పేగుల‌పై ప‌స్తుల డ‌ప్పులు మోగుతుంటాయి. అభివృద్ధి ఆన‌వాళ్లు కాల‌నీకి దూరంగా విసిరివేయ‌బడ‌తాయి. సంక్షేమ ఫ‌లాలు వారి గుమ్మం వ‌ద్దే ఆగి వారి బ‌తుకుల‌ను వెక్కిరించాయి. అక్ష‌రాలు దిద్దాల్సిన చిట్టి చేతులు చిత్తు కాగితాల లెక్క‌ల్లో ప‌డి నిర‌క్ష‌రాస్య‌త పులుముకున్నాయి. వారి శ‌రీరాన్ని అంటుకుని ఉన్న చిరిగిన దుస్తులు ఛిద్ర‌మైన వారి జీవితాల‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి.. స‌మాజంలోనే ఉన్నాస‌మాజానికి దూరంగా స‌మ‌స్య‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వారి బ‌తుకులు నిత్యం పేద‌రిక‌పు చీక‌ట్లో మ‌గ్గుతున్నాయి. ఇలాంటి నిరుపేద‌ల కుటుంబాల్లో్కి చీక‌ట్ల‌ను చీల్చేందుకు వెలుగు ర‌వ్వై ముందుచ్చారు జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్‌.

ఎండిన డొక్క‌ల‌కు గంజి నీళ్లు కూడా దిక్కులేని వీరికి రేషన్ కార్డు కూడా లేద‌నే విష‌యం తెలుసుకుని చ‌లించిపోయారు. నిలువ నీడ కూడా లేని వారి నిస్స‌హాయ‌త‌ను చూసి సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌ర‌త్నాలు వారి ఇంట ప్ర‌కాశింప‌జేసేందుకు కంకణం క‌ట్టుకున్నారు. ఇక‌పై వారి జీవితాల్లో ఒక్క పూట కూడా ప‌స్తుల‌నే మాట వినిపించ‌కూడ‌ద‌ని నిశ్చ‌యించుకున్నారు. కాల‌నీలోని 40 కుటుంబాల వారి వివ‌రాల‌ను తెప్పించుకున్నారు. అర్హులైన అంద‌రికీ రేష‌న్ కార్డులు మంజూరు చేయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వారి న‌ట్టింట తిష్ట వేసిన ఆక‌లిని త‌రిమికొట్టారు. గూడులేని వారి గోడును మ‌న‌సుతో ఆల‌కించి అర్హులైన 40 కుటుంబాల‌కు జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కం కింద ఇళ్ల ప‌ట్టాలు ఇప్పించారు. ఇప్పుడా ప‌ట్టా భూమిలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఇళ్ల నిర్మాణానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌తి ఏటా దీపావ‌ళి పండుగ‌నాడు ఆకాశానికి ఎగిరే వెలుగు ర‌వ్వ‌ల‌ను చూసి చ‌ప్ప‌ట్లు కొట్టి ఆనందించే వారి క‌ళ్ల‌లో ఈ సారి దీపాల కాంతులు చూడాల‌ని ఆకాంక్షించారు.
ప్ర‌తి మోములోనూ దీపాల కాంతులు..
గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు యానాది కాల‌నీలోకి అడుగు పెట్టారు. వ‌స్తూవ‌స్తూనే చిరున‌వ్వుల చిచ్చుబుడ్లు వెలిగించారు.
అంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రించి వారి బాగోగులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుపేద‌ల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు నిత్యం కృషి చేస్తుంద‌ని, సంక్షేమాన్ని మీ ముంగిట‌కే తీసుకొస్తుంద‌ని వారికి ధైర్యం చెప్పారు. రేష‌న్ స‌రుకులు స‌మ‌యానికి వ‌స్తున్నాయా ? తిన‌డానికి వీలుగా ఉంటున్నాయా ? అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఒక పూరి పాక‌లోకి వెళ్లి అక్క‌డ ఉన్న వారితో మాట్లాడారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. అనంత‌రం త‌న వెంట తీసుకొచ్చిన నూత‌న దుస్తులను ఒక్కొక్క‌రి పంపిణీ చేశారు. ఐదేళ్ల చిన్నారుల నుంచి 15 ఏళ్ల పిల్ల‌ల వ‌ర‌కు సుమారు 50 మందికి నూత‌న దుస్తులు బ‌హూక‌రించారు. ఆ కాల‌నీలో ఉన్న నిరుపేద 30 మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేశారు. నూతన దుస్తుల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్ త‌న సొంత నిధులు రూ.50 వేల‌తో కొనుగోలు చేసి తీసుకొచ్చారు.
నూత‌న దుస్తుల్లో చిన్నారుల సంబ‌రం..
నూత‌న దుస్తులు అందుకున్న చిన్నారులు వాటిని ధ‌రించి ఉత్సాహంగా మ‌ళ్లీ జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఆ చిన్నారుల మోముల్లో సంతోషాల తారాజువ్వ‌లు ఆకాశాన్ని తాకాయి. క‌ల్మ‌షంలేని ఆ మ‌హిళల‌ న‌వ్వుల్లో మ‌తాబుల వెలుగు క‌నిపించాయి. నాది ఎరుపు గౌను అని ఒక‌రు, నాది కొత్త డిజైన్ అని మ‌రొక‌రు చిన్నారుల ఆనందంగా చెప్పుకుంటుంటే జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్ వారిని చూసి మురిసిపోయారు. అనంత‌రం వారికి స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌ అందించి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. నూతన దుస్తుల్లో మెరుపులు.. అంత‌కు మించి వారి క‌ళ్ల‌లో జిలుగులు.. పేదోళ్ల గుండె గుడిసెలో వెలిగిన ఆనందాల దీపాల‌ను చూసి ఇది క‌దా అస‌లైన దీపావ‌ళి అని జేసీ దినేష్‌కుమార్ సంబ‌ర‌ప‌డ్డారు.ఈ కార్యక్రమం లో గుంటూరు తూర్పు తాసిల్దార్ శ్రీకాంత్ ,భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ఆనంద‌మే జీవితంపాజిటివ్ చిన్నారుల‌కు జేసీ దినేష్‌కుమార్ భ‌రోసాత‌న సొంత నిధుల‌తో  నూత‌న దుస్తులు అంద‌జేత‌500 మందికి భోజ‌నా...
04/12/2021

ఆనంద‌మే జీవితం

పాజిటివ్ చిన్నారుల‌కు జేసీ దినేష్‌కుమార్ భ‌రోసా
త‌న సొంత నిధుల‌తో నూత‌న దుస్తులు అంద‌జేత‌
500 మందికి భోజ‌నాల ఏర్పాటు
ఆనందం వ్య‌క్తం చేసిన చిన్నారులు
ఆకాశంలో ఎగిరే ప‌క్షుల రెక్క‌ల చ‌ప్పుళ్ల‌కు వారి గుండెచ‌ప్పుళ్లు జత‌చేసి గంతులేసే నిర్మ‌ల‌మైన మ‌నసున్న చిన్నారులు వారు.. శ‌రీరంలో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చిపోయే అనారోగ్యపు నీలినీడ‌లు ఎందుకొస్తున్నాయో కూడా తెలుసుకోలేని అమాయ‌కులు వారు.. స‌మాజ‌పు జాలిచూపుల మ‌ర్మ‌మేమిటో గుర్తించ‌లేని అభాగ్యులు వారు.. త‌మ త‌ల్లిదండ్రుల ఆవేశ‌పు క్ష‌ణాల శాపానికి గురైన ప‌సిత‌న‌ము వీడ‌ని వాడిన కుసుమాలు వారు.. అలాంటి నిర్భాగ్యుల‌కు నిండు చంద‌మామ‌లా ఆనందాల వెన్నెల‌లు కురిపించారు జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్‌. బుధ‌వారం అంత‌ర్జాతీయ ఎయిడ్స్ దినోత్స‌వం సంద‌ర్భంగా గుంటూరులోని రెవెన్యూ క‌ల్యాణ మండ‌పంలో ఎయిడ్స్ బాధిత చిన్నారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన సుమారు మూడు వంద‌ల మంది చిన్నారులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. తొలుత పాజిటివ్ చిన్నారుల‌తో నృత్యాలు చేయించి ఉత్తేజ‌ప‌రిచారు. పాట‌ల పోటీలు ఏర్పాటు చేసి వారి జీవితాల్లో సుస్వ‌రాలు ప‌లికించేందుకు ప్ర‌య‌త్నించారు. అనంత‌రం ప్ర‌త్యేకంగా వంట‌కాలు త‌యారు చేయించి చిన్నారుల‌కు అందించారు. వారు తృప్తిగా ఆహారం తీసుకుంటుంటే జాయింట్ క‌లెక్ట‌ర్ దినేష్‌కుమార్ తాను క‌డుపు నిండినంత సంబ‌ర‌ప‌డ్డారు. జిల్లా వైద్యాధికారి యాస్మిన్, ఫుడ్ సేఫ్టీ అధికారి గౌస్‌ చిన్నారుల‌కు కొస‌రికొస‌రి వ‌డ్డించారు.
నూత‌న దుస్తులు, నిత్యావ‌స‌రాల పంపిణీ
జాయింట్ క‌లెక్ట‌ర్ త‌న సొంత నిధుల‌తో 200 మంది చిన్నారుల‌కు, వారి కేర్‌టేక‌ర్లు 200 మందికి నూతన దుస్తులు తెప్పించారు. వారందరికీ ఆ దుస్తులు త‌న చేతులమీదుగా అందించారు. నూత‌న దుస్తులు తీసుకున్న చిన్నారులు వాటి రంగులు, డిజైన్లు మురిసిపోయారు. అనంత‌రం అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు. పాజిటివ్ ఉన్న వారెవ‌రూ అధైర్య ప‌డొద్ద‌ని, ప్ర‌స్తుతం ఆరోగ్య‌వంతులకు మాదిరిగానే జీవిత కాలం ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారం తీసుకోవాల‌ని సూచించారు. చిన్నారుల‌కు ఎలాంటి అవ‌స‌ర‌మొచ్చినా తాను ముందుంటానని భ‌రోసా ఇచ్చారు.

https://youtu.be/fznhuQM_WsI
29/11/2021

https://youtu.be/fznhuQM_WsI

26-11-2021.Joint Collector, Guntur,flag off the vehicle at S.R Sankaran Conference Hall, Collectorate,carrying essential commodities for the flood victims ...

18/08/2021

Millions of migrant workers are anticipated to be left unemployed in India due to the lockdown and subsequent fear of recession. Many of the migrant workers have returned to their villages, lockdowns and social distancing measures are drying up jobs and incomes, whereas they are likely to disrupt agricultural production, transportation systems, and supply chains on the other.

In these circumstances ,shifting of migrant workers played a vital role .

Joint collector sir interacting with survey team and villagers in resurvey programme in pedakakani mandalThe works for J...
26/07/2021

Joint collector sir interacting with survey team and villagers in resurvey programme in pedakakani mandal

The works for Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Raksha survey programme are progressing at a slow pace due to COVID-19 situation and the joint collector sir instructed the officials to expedite the works and complete them within stipulated time. Once the survey is completed, clear titles will be given and there will no chance for land disputes

Address

Guntur
522001

Telephone

+917382490491

Website

Alerts

Be the first to know and let us send you an email when A S Dinesh kumar IAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share