Amaravathi

Amaravathi Amaravati is the legislative capital and the de facto seat of government of the Indian state of Andhra Pradesh.

The city is located on the banks of river Krishna in Guntur District.

26/11/2025

రాజధాని అమరావతి పరిధిలోని కురగల్లు గ్రామంలో భారీ మోసం వెలుగుచూసింది. రైతులను మోసం చేసి సహకార సంస్థ ఉద్యోగి సుమ...

ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్ లో జల్సాలు చేస్తున్న జగన్
29/09/2022

ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్ లో జల్సాలు చేస్తున్న జగన్

31/12/2016
ఏపీ నూతన రాజధాని అమరావతిపై ఎన్నో అంచనాలు.. మరెన్నో నమ్మకాలు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్...
19/05/2016

ఏపీ నూతన రాజధాని అమరావతిపై ఎన్నో అంచనాలు.. మరెన్నో నమ్మకాలు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి ప్రజల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల కంటే కూడా రాజధాని కోసం త్యాగాలు చేసిన అమరావతి ప్రజలకు మరింత మేలు చేయాలని తలపోస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన వారికి వచ్చే పదేళ్ల వరకు ఎలాంటి కష్టం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలకు ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. కోరిందే తడవుగా 34 వేల ఎకరాలు ఇచ్చిన ప్రజల కోసం ఏమైనా చేస్తానంటూ ముఖ్యమంత్రి వారికోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో సీఆర్డీయే అధికారులు అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి వాసుల సమగ్రాభివృద్ధికి చంద్రబాబు సూచనలతో ప్రణాళికలు రెడీ అవుతున్నాయి.

ముఖ్యంగా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే 29 గ్రామాల్లోని యువతను గుర్తించి వారకి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు.

మరోవైపు విద్య అవసరాన్ని గుర్తించి అమరావతి ప్రాంతంలో పదేళ్ల పాటు ఉచిత విద్యను అమలు చేస్తున్నారు. పదో తరగతి - ఇంటర్ - ఢిగ్రీతో పాటు పాలిటెక్నిక్ - ఇంజినీరింగ్ వంటి కోర్సులన్నీ ఉచితంగాచదువుకునేలా ఈ ఏడాది నుంచి విధానం అమల్లోకి వస్తోంది. ఇది కాకుండా సీఆర్డీయే పరిధిలోని 29 గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్యం అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చేసింది. ప్రభుత్వ - ప్రయివేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించారు. ఇక్కడి ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కాకుండా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీయే పక్కా ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాలకు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని గ్రామాలను కలిపేలా రోడ్లను నిర్మిస్తున్నారు. ఎల్ ఈడీ వీధి దీపాలు - పక్కా డ్రైనేజి వ్యవస్థ వంటివాటితో స్థానికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు.

Happy
24/12/2015

Happy

06/11/2015

Amaravathi Aerial Shots

   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నేటితో ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చే...
19/10/2015


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నేటితో ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శంకుస్థాపన ప్రాంగణం దగ్గర భద్రతను భారీగా పెంచుతున్నారు. ఈనెల 22న జరుగనున్న అమరావతి శంకుస్థాపన పనుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది.

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పట్లు చివరి దశకు చేరుకున్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. శంకుస్థాపనకు తరలివచ్చే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు రైతులు, ఇతరులు ఉత్సాహం చూపుతున్నారు.

నేరుగా సభా ప్రాంగణంలోనే డబ్బులు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. దీంతో సభా ప్రాంగణంలో మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రులు నిర్ణయించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమైన యజ్ఞశాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే ప్రధాని మోదీ కరకట్టల ఆవరలో ఉన్న హెలీప్యాడ్ నుంచి యాగశాలలోకి ప్రవేశించనున్నారు.

యాగశాలలో పూజలు నిర్వహించి సీఎంతో పాటు రాజధానికి శంకుస్థాన చేసి ఆయన వేదికపైకి చేరుకుంటారు. యాగశాలలో 21 నుంచి పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. శంకుస్థాపన ప్రాంగణం దగ్గర భద్రతను భారీగా పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్న పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 11వేల మంది పోలీసులతో భద్రతను చేపడుతున్నట్లు హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు పనులను పరిశీలించారు.

అడిషనల్ డీజీ సురేంద్రబాబు ట్రాఫిక్ మళ్లింపు గురించి మంత్రులకు వివరించారు. పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. శంకుస్థాపన మహోత్సవానికి దాదాపు ఏడు వేల మంది వీఐపీలు, వీవీఐపీలు ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. అతిథుల కోసం పూర్ణం, బూరెలు, చెక్కర పొంగలి, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు సహా ఆంధ్రా పిండివంటలను, స్పెషల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. రైతులకు, ప్రజలకు ప్రత్యేకంగా మరో మెను.

దాదాపు 15వేల మంది రైతులు, లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రజలు శంకుస్థానకు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి పులిహోరా, దద్దోజనం, చెక్కెరపొంగలి, అరటిపండు, తాపేశ్వరం కాజా, మూడు మంచినీళ్ల ప్యాకెట్లను మరో ప్యాకెట్లో పెట్టి ఇవ్వాలని నిర్ణయించారు. 22న విజయదశమి రోజు ప్రధాని మోదీ ఉపవాస దీక్షను ముగిస్తే ఆంధ్రా వంటకాలతో భోజనం చేస్తారని లేకపోతే తేనె కలిపిన నిమ్మరం మాత్రమే తాగుతారని పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రధాని మెనూలో ఉలవచారును కూడా చేర్చాలని అధికారులు నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా రాజధాని కోసం తరలించిన మట్టిని, నీటిని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భద్రపరుస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి రాజధాని కోసం తరలిస్తున్న మట్టి, నీటి కళశాలకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించి పూజలు నిర్వహిస్తున్నారు.

For more latest hot and happening news subscribe @ https://www.youtube.com/user/ABNtelugutv?sub_confirmation=1 Follow us @ https://facebook.com/abntelugutv, ...

17/10/2015

తాడికొండ: నవ్య రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఉద్దండ్రాయునిపాలెం వద్ద మహా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన వేదిక, దానికి ఇరువైపులా మరో రెండు వేదికలు సిద్ధమౌతోంది. అదేవిధంగా యాగశాలను రెల్లుగడ్డితో నూతక్కికి చెందిన వర్కర్లు నిర్మిస్తున్నారు. వీవీఐపీల రాక కోసం మూడు హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం కరకట్ట దిగువన మరో ఐదు హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సభికుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలపై రెయిన్‌ ప్రూఫ్‌ కప్పు వేస్తున్నారు. ఈ పనులన్నీ ఆదివారం సాయంత్రానికి పూర్తి కానున్నాయి. శంకుస్థాపన, సభా ఏర్పాట్లను తిలకించేందుకు రాజధాని పరిసర గ్రామా లు, ఇతర జిల్లాల నుంచి అనేక మంది వస్తుండడంతో సభాస్థలిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భద్రత, సభా ఏర్పాట్లపై అదనపు డీజీపీ సురేంద్రబాబు, ఐజీ సంజయ్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. ఏర్పాట్లపై కలెక్టర్‌ దండే, జేసీ శ్రీధర్‌ అధికారులకు సూచనలిచ్చారు.
భారీగా జన సమీకరణ

రాజధాని శంకు స్థాపనకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ఉన్న తాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు ఒక్కొక్క జిల్లా నుంచి 60 నుంచి 70 వేల మందిని శంకుస్థాపన స్థలానికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాకు రెండు వేల బస్సులు కేటాయించనున్నట్లు సమాచారం. రెండు జిల్లాల్లోని పలు గ్రామాల నుంచి ఈ బస్సులు ప్రజలను శంకు స్థాపనకు తీసుకొస్తాయని ఓ సీనియర్‌ అధికారి తెలి పారు. శంకుస్థాపనకు విమానంలో వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం 60 ఓల్వో బస్సులతో పాటు 40 ఇన్నోవా కార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజున వచ్చే మోస్ట్‌ ఇంపార్టెంట్‌ పర్సన్‌(ఎంఐపీ)ల కోసం మరో 40 స్పెషల్‌ కార్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పెషల్‌ కార్ల కోసం తొలుత బీఎండబ్ల్యూ, ఆడి కార్లను తీసుకురావాలని భావించారు. అయితే పెద్ద సంఖ్యలో అద్దెకు తేవాల్సి రావడం, ఒక్కొక్క కారుకు రోజుకు అద్దె రూ.40 వేలు కావడంతో జిల్లాకు రూ. 32 లక్షల బడ్జెట్‌ కేవలం కార్లకే అయిపోతుందని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఎంఐపీలను తీసుకొచ్చేందుకు ఘనమైన కార్లనే తీసుకొచ్చే ఆలోచనలో ఇరు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. వీవీఐపీ, వీఐపీల బస కోసం విజయవాడ నగరంలో 19 హోటళ్లను పూర్తిగా బుక్‌ చేశారు. ఈ హోటళ్లన్నింటి నుంచి శంకుస్థాపన రోజు ఉదయం ఒక ఏసీ బస్సును ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ, వీఐపీలకు విడివిడిగా కార్లను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే సమస్యతో పాటుగా బడ్జెట్‌ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 32 మంది వరకు సరిపోయే ఏసీ ఓల్వో మినీబస్‌లను 19 హోటళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌, ఆయా ముఖ్య కూడళ్లకు చేరే వారిని శంకుస్థాపన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు మరో 600 మినీ బస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ఏయే రూట్లలో వెళ్లాల్సి ఉంటుందో వారివారి స్థాయిని బట్టి ముందుగానే రూట్‌ మ్యాప్‌ను అం దజేస్తున్నారు.

నా ఇటుక - నా అమరావతి వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గురువారం ఉదయం సీఎం కార్యాలయంలో రాజధాని...
15/10/2015

నా ఇటుక - నా అమరావతి వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గురువారం ఉదయం సీఎం కార్యాలయంలో రాజధాని నిర్మాణం కోసం ఇటుకలు ఇవ్వాలని... లేని పక్షంలో దానికి సమానమైన విలువను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మై బ్రిక్‌-మై అమరావతి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రపంచ నలుమూలల ఉండే తెలుగువారందరూ రాజధాని నిర్మాణం కోసం రూ. 10లు విలువ చేసే ఇటుక గానీ లేనిపక్షంలో రూ. 10 విలువగల విరాళం ఈ వెబ్‌సైట్‌ ద్వారా పంపవచ్చునని పేర్కొన్నారు.

ఈ వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభించాలని మొదట భావించారు. అయితే ముందుగా ప్రారంభించి దీనికి వచ్చిన రస్పాన్స్‌ (ఆదరణ)ను మోదీకి చూపిస్తే బాగుంటుందని ఆలోచన చేసిన చంద్రబాబు ఈ రోజు ఉదయం మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సైట్‌ ప్రారంభించిన వెంటనే ఎన్నారైలు ఇబ్బడిముబ్బడిగా డొనేషన్స్‌ పంపడం ప్రారంభించారు. రాజధాని శంకుస్థాపన మహోత్సవం కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కొంతమంది దుష్ర్పాచారం చేస్తున్నారని, ఇది అవాస్తమని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందని వారు వెల్లడించారు. హెలీకాఫ్టర్లు, విమానాలు కూడా పారిశ్రామిక వేత్తలు స్వచ్చంధంగా ఇస్తున్నారని వారు చెప్పారు.

10/10/2015

MaaMangalagiri

Mangalagiri is one of the oldest Vaishnavite Temples in South India. Sri Lakshmi Narasimha Swamy is the deity in this holy place.

Address

Amaravathi
Guntur
522020

Website

Alerts

Be the first to know and let us send you an email when Amaravathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share