CPI Hanumakonda

CPI Hanumakonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPI Hanumakonda, Public Service, Hanamkonda.

 #హనుమకొండలో జరుగుతున్న ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (AIPSO) హనుమకొండ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ...
23/08/2026

#హనుమకొండలో జరుగుతున్న ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (AIPSO) హనుమకొండ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తున్న CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు...

22/08/2026

మాజీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ పార్లమెంట్ మాజీ #కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి #మొదటి వర్థంతి సందర్భంగా CPI నాయకులు సురవరం గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతున్న CPI హనుమకొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు & మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్...

 #స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుల మహత్తర పాత్ర                         #లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం*       #...
15/08/2026

#స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుల మహత్తర పాత్ర

#లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం*

#సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

సిపిఐ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

#హనుమకొండ : దేశ స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుల మహత్తర పాత్ర ఉందని, అందరి త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్య భారతంలో లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని, చరిత్రను దొంగలించేందుకు ఆర్ఎస్ఎస్, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టులు మహత్తర పాత్ర పోషించారని,ఆ పోరాటంలో అమరులైన మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయుల చరిత్రను నేటి తరానికి అంద చేయవల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మత రాజ్యాంగంగా మార్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని, దేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నదని, ఈ ప్రయత్నాన్ని లౌకిక, ప్రజాస్వామిక వాదులు, కమ్యూనిస్టులు సమిష్టిగా ఎదుర్కొని రాజ్యాంగ ప్రాధమిక లక్షణమైన సెక్యులర్, ఫెడరల్, సమానత్వ, సామ్యవాద విధానాలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్ఎ స్టాలిన్, మునిగాల బిక్షపతి, ఎదునూరి వెంకట్రాజం, కొట్టేపాక రవి, బాషబోయిన సంతోష్, మాలోత్ శంకర్ నాయక్, శనిగరపు రాజు కుమార్, గుంటీ రాజేందర్, ఉట్కూరి ప్రణీత్ గౌడ్, అలువాల రాజు, పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, కోడెపాక బాబు, మామునూరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

 #తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ #సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ #కాళోజీ కళాక్షేత్రంను సందర్శించిన...
14/08/2026

#తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ

#సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ

#కాళోజీ కళాక్షేత్రంను సందర్శించిన సిపిఐ నేత నారాయణ

#హనుమకొండ: తన కాలంతో తెలంగాణ గొంతుకై నిలిచిన ప్రజాకవి, ధిక్కార స్వరం కాళోజీ అని, దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం - ప్రాంతం వాడే దోపిడి చేస్తే పాతర వేస్తం అనే కాళోజీ కవితలను నిజం చేసి పాలకుల పని తీరును గమనించి అధికార మార్పిడి చేసిన తెలంగాణ ప్రజలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు.శుక్రవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంను సందర్శించిన సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా కాళోజీ దుస్తులను, వారు రాసిన కవితల పుస్తకాలను, కళా కళాక్షేత్రంను పరిశీలించి, కాళోజీ విగ్రహం కు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు కేంద్ర బిజెపి ప్రభుత్వంకు వ్యతిరేకంగా సిపిఐ పాదయాత్రలు చేస్తుందని, శుక్రవారం వరంగల్ సిపిఐ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి రావడం జరిగిందని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా హనుమకొండ (వరంగల్ ట్రై-సిటీ ప్రాంతం)లో నిర్మించిన బహుళ ప్రయోజన సాంస్కృతిక కేంద్రమని అన్నారు. తాను వరంగల్ వచ్చిన సందర్భంగా కాళోజీ కళాక్షేత్రను చూడాలని అనిపించిందని తెలుపుతూ 2014 సంవత్సరంలో కాళోజీ ఆడిటోరియంకు శిలాఫలకం వేసినప్పుడు తాను రావడం జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు కేసీఆర్ పునాది వేసి నత్తనడకన కూడా దీనిని పూర్తి చేయలేక పోయాడని 2024 కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కాళోజీ కవితల్లో ప్రధానమైన కవితల్లో ఒకటి "దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం-ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం - దోస్తుగా ఉండే వారితో మేమును దోస్తే చేస్తం - ప్రాణమిస్తం ఎంతకు అంత అన్న ధోరణితో బ్రతుకును సాగిస్తం" అనే కవితను ప్రస్తావిస్తూ తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుతో 2014 అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోవడం, ముఖ్యంగా తెలంగాణ కవుల్లో ముఖ్యుడైన కాళోజీ నారాయణ రావు కళాక్షేత్రంకు శిలాఫలకం వేసి మరిచిపోవడం దారుణమని, ప్రజాకంఠక పాలన కొనసాగించడం ద్వారా అధికారం కోల్పోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కళాక్షేత్రంను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి, పంజాల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ ఎ స్టాలిన్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ల్యాదల్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.

09/08/2026
 #కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న కేంద్ర మోడీ సర్కార్ #ప్రజా సమస్యలను గాలికొదిలిన బిజెపి ప్రభుత్వం #సిపిఐ రాష్ట్ర సహ...
09/08/2026

#కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్న కేంద్ర మోడీ సర్కార్

#ప్రజా సమస్యలను గాలికొదిలిన బిజెపి ప్రభుత్వం

#సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

#పరకాలలో సిపిఐ ప్రచార జాత పాదయాత్రలో తక్కలపల్లి

పరకాల : కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6న కాజీపేటలో ప్రారంభమైన సిపిఐ ప్రచార జాత యాత్ర ఆదివారం 4వరోజున పరకాలకు చేరుకొని స్థానిక బస్ డిపో నుండి ప్రచార జాత పాదయాత్ర పరకాల పుర వీధుల మీదగా అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సాహపూరితంగా సాగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ సీనియర్ నాయకులు తాటిపాముల వెంకట్రాములు తో కలిసి అంబేద్కర్ విగ్రహంకు పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే పరకాల అమరధామం వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మండ సదాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర సహాయ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తూ ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ను పరుస్తూ లక్షల కోట్ల రూపాయలను రాయితీలు ఇస్తూ ప్రజల సంక్షేమం మరిచి ప్రజాస్వామ్య గొంతును, ప్రజల గొంతుకను అణిచివేస్తూ కేంద్రం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కుతున్నదన్నారు. ప్రజలపై వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిరంతరం పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడే కమ్యూనిస్టులుగా తాము ప్రజాసమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పాదయాత్రలు ఆగస్టు 6 నుండి ప్రారంభమైన ఈ దేశవ్యాప్త పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, ఈ జాత ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజా సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తూ మార్పు రావాలి మోడీ ప్రభుత్వం దిగాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన ఛలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 6వ తేదీ నుండి 11వ తేది వరకు జరిగే సిపిఐ ప్రచార జాత పాదయాత్రలను, సెప్టెంబర్ 1 తేదీన డిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబో బద్లావ్ జరూరిహై ర్యాలీతో ముగుస్తాయని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో డిల్లీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు తాటికపాముల వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, వంగపల్లి సర్పంచ్ నకీర్త రాజు, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, ఎన్ ఎ స్టాలిన్, మునిగాల బిక్షపతి, నకిర్త ఓదెలు, జక్క రాజు గౌడ్, కొట్టెపాక రవి, శనిగరపు రాజ్ కుమార్, రాసమల్ల దీనా, గుంటి రాజేందర్, ధర్ముల రాంమూర్తి, మండల కార్యదర్శి దుప్పటి సాంబయ్య, నాయకులు లంకదాసరి అశోక్, మదాసి ఉమా, మండల నాయకులు ఎండీ అమీనా, తుమ్మల రమా, ఎండీ నైమా, కోగిల శంకర్, శ్రీపతి రాజయ్య, దొడ్డ పోచయ్య, ఒంటెరు సుధాకర్, నిమ్మల మాలతి, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు గడ్డం రాజనర్సు, రోంటాల శ్యామ్, తాటికంటి మమత, మాలోత్ మంగ తదితరులు పాల్గొన్నారు.

 #బీజేపీ పాలనలో ప్రజల అవస్థలు #మోడీని గద్దె దింపే వరకు సిపిఐ పోరు #సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి...
07/08/2026

#బీజేపీ పాలనలో ప్రజల అవస్థలు

#మోడీని గద్దె దింపే వరకు సిపిఐ పోరు

#సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

#ముల్కనూర్ లో సిపిఐ పాదయాత్రలో చాడ

#బీమదేవరపల్లి/ముల్కనూర్ : దేశంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తుందని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే దాని పతనానికి దారి తీస్తుందని, దేశంలో మార్పు కోసం సిపిఐ పోరాటం సాగిస్తోందని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సిపిఐ ప్రచార జాత పాదయాత్ర 2వ రోజు ముల్కనూర్ లో ప్రచార జాత పాదయాత్ర సహకార బ్యాంకు నుండి కొత్తపల్లి వరకు ఉత్సాహపూరితంగా సాగింది. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అంబేద్కర్ విగ్రహంకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన ఒక మంచి పని అయిందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీస్తుందని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని, రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని, రైతు సంక్షేమాన్ని దెబ్బతీశారని అన్నారు. సహజ వనరులను కార్పొరేట్ మిత్రులు అదానీ, అంబానీ లకు కట్టబెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, విద్య, ఆరోగ్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, దళితులపై, మహిళలపై అకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంకై ఆగస్టు 6 నుండి దేశవ్యాప్తంగా సిపిఐ పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో దేశంలో మార్పు కోసం మహా ర్యాలీతో ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సిపిఐ పోరు ప్రచార జాత పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, ఎన్ ఎ స్టాలిన్, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, కొట్టెపాక రవి, మాలోతు శంకర్, శనిగరపు రాజ్ కుమార్, రాసమల్ల దీనా, గుంటి రాజేందర్, బీమదేవరపల్లి మండల కార్యదర్శి అదరి రమేష్, మండల నాయకులు కొంగల రామచంద్ర రెడ్డి, కంవంపల్లి కిషన్, రాగుల చంద్రయ్య, చిలక శ్రీను, నిమ్మల మనోహర్, మాలోతు మంగ, మమత, కుడి స్వామి తదితరులు పాల్గొన్నారు.

 #ప్రజల సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయం #బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ పాదయాత్ర #సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బి...
06/08/2026

#ప్రజల సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయం

#బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ పాదయాత్ర

#సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి

#ధర్మసాగర్: ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటమే కమ్యూనిస్టుల జీవన విధానమని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని, బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ పాదయాత్ర చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు. గురువారం ధర్మసాగర్ లో సిపిఐ పాదయాత్ర కొనసాగుతూ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన సభ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని, సాధారణ పౌరులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని అన్నారు. ఆగస్టు 6 నుండి ప్రారంభమైన ఈ దేశవ్యాప్త పాదయాత్రలు వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల గుండా సాగుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కానుందని తెలిపారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని, రైతు సంక్షేమాన్ని దెబ్బతీశారని అన్నారు. మోదీ పాలనలో పెరుగుతున్న నియంతృత్వ ధోరణులలో భాగంగా రాజకీయ వ్యతిరేకులను అణచివేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమంగా నిర్వీర్యం చేయడం జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్న సిపిఐ పోరు యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్ ఎ స్టాలిన్, ఉట్కూరి రాములు, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, వేల్పుల సారంగపాణి, మాలోతు శంకర్, శనిగరపు రాజ్ కుమార్, రాసమల్ల దీనా, గుంటి రాజేందర్, ధర్మసాగర్ మండల కార్యదర్శి కొట్టె వెంకటేశ్, మండల నాయకులు సింగారపు కొమురయ్య, బొట్టు బిక్షపతి, కొట్టే లింగయ్య, వల్లపు సారయ్య, బండి రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

06/08/2026

హనుమకొండ జిల్లా కాజీపేటలో CPI పాదయాత్ర ప్రచార జాతను ఉద్దేశించి మాట్లాడుతున్న CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు...

Address

Hanamkonda

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI Hanumakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category