Warangal Police Commissionerate

Warangal Police Commissionerate Warangal Police Commissionerate
(1)

ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్సామాజిక మాధ్యమాల్లో వ...
05/08/2026

ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి పెట్టుబడులు పెట్టి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ ప్రజలకు సూచించారు.
జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు" రాష్ట్రవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో కాజీపేట నిట్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
మోసగాళ్లు "100% గ్యారంటీ రిటర్న్స, "డైలీ ప్రాఫిట్", "ఇన్‌సైడర్ టిప్స్", "ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు" వంటి తప్పుడు హామీలతో అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రారంభంలో నకిలీ లాభాలను చూపించి, అనంతరం మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి, చివరకు క్యాష్ అవుట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, అప్‌గ్రేడేషన్ ఛార్జీలు వంటి పేర్లతో అదనపు డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
అదేవిధంగా, నకిలీ ఆర్థిక సలహాదారులు, నకిలీ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, చట్టబద్ధమైన అనుమతులు లేని సంస్థల ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేస్తూ, అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడి అవకాశాన్ని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సూచనలను విశ్వసించవద్దని, వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వ్యక్తులను నమ్మరాదని పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టే ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ సైబర్ నేరాలపై రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామని విద్యార్థులు, అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో నిట్ కళాశాల డైరెక్టర్ డా. ప్రొఫెసర్ సుబుధి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, రిజిస్ట్రార్ సునీల్ మెహతా, ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్‌స్పెక్టర్లు శ్యామ్ సుందర్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలి– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్భవిష్యత్తులో సైబర...
05/08/2026

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలి
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

భవిష్యత్తులో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా విద్యార్థులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ పేర్కొన్నారు.
"సురక్షా కా తిరంగా" కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్‌కు సైబర్ విభాగం అధికారులు స్వాగతం పలికారు.
ముందుగా సైబర్ క్రైమ్ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల విధానాలు, నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులు, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సైబర్ నేరాలపై చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజల కష్టార్జిత ధనాన్ని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాల ద్వారా దోచుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాల గురించి అవగాహన ఉన్నప్పటికీ అత్యాశ, భయం, అత్యవసరం వంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం సెల్‌ఫోన్ వినియోగం విస్తృతంగా పెరగడంతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, ఫోటోలు లేదా ఫైళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో గోప్యత (Privacy) సెట్టింగ్‌లను తప్పనిసరిగా సరిచేసుకోవాలని, వ్యక్తిగత సమాచారం, కుటుంబ వివరాలు, ఫోటోలు వంటి వాటిని సామాజిక మాధ్యమాల్లో విచక్షణారహితంగా పంచుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
పిల్లలకు చిన్నప్పటి నుంచే వ్యక్తిగత జీవితం (Private Life), బహిరంగ జీవితం (Public Life) మధ్య తేడాను తెలియజేయడంతో పాటు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం ఉపాధ్యాయులతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సైబర్ నేరాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, విద్యాశాఖ సీఎంఓ సుమ, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, ఎస్‌బీ ఏసీపీ జాన్ నర్సింహులు, ఇన్‌స్పెక్టర్లు రజినీత్, శివకుమార్, రవికుమార్, అశోక్, ప్రవీణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

"సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" పోస్టర్‌ను ఆవిష్కరించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్తెలంగాణ సైబర్...
04/08/2026

"సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" పోస్టర్‌ను ఆవిష్కరించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆగస్టు-2026 స్వాతంత్య్ర మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ" సైబర్ అవగాహన ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత,ఐపీఎస్ మంగళవారం నాడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆగస్టు నెల పొడవునా సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలు, ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు వంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"సురక్ష కా తిరంగా" ప్రచార సందేశమైన "ఆగు – ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు" అనే మూడు అంశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సీపీ పిలుపునిచ్చారు.

జాతీయ సైబర్ జాగృక్తా దివస్ సందర్భంగా 05.08.2026 నుంచి వరంగల్ కమిషనరేట్ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు మరియు సాధారణ ప్రజల భాగస్వామ్యంతో నెల పొడవునా సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ అవగాహన కలిగిన, సైబర్ సురక్షితమైన, సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏసీపీ వెంకటరమణ, ఇన్స్ స్పెక్టర్ అశోక్, ఎస్. ఐ చరణ్ పాల్గొన్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీల  నివారణకై  వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్,  ప్రజలను అప్ర...
04/08/2026

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్, ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
1. వాహనాన్ని ఎల్లప్పుడూ స్టీరింగ్ లాక్, హ్యాండిల్ లాక్ మరియు అవసరమైతే డిస్క్ లాక్ / చైన్ లాక్ వేసి పార్క్ చేయండి.
2. రాత్రి వేళల్లో లేదా ఎక్కువ సమయం పాటు వాహనాన్ని సీసీ కెమెరాలు ఉన్న, వెలుతురు బాగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేయండి.
3. వాహనంలో తాళం చెవి ఉంచి వెళ్లవద్దు. స్పేర్ కీని కూడా వాహనంలో దాచి పెట్టకండి.
4. వాహనానికి GPS ట్రాకింగ్ పరికరం లేదా యాంటీ-థెప్ట్ అలారం అమర్చుకోవడం మంచిది.
5. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ వంటి వివరాలను భద్రంగా ఉంచుకోవాలి.
6. అనుమానాస్పదంగా వాహనాల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100 / 112 కు సమాచారం ఇవ్వండి.
7. వాహనం చోరీకి గురైనట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.
8. సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసే ముందు వాహనం పత్రాలు, యాజమాన్య వివరాలు మరియు పోలీసు రికార్డులను తప్పనిసరిగా పరిశీలించండి.

ప్రజలకు విజ్ఞప్తి :
వాహన భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా వాహన చోరికి కారణమవుతుంది. కాబట్టి పై సూచనలు తప్పనిసరిగా పాటించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించి, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించండి.

-వరంగల్ పోలీస్ కమిషనర్

04/08/2026
సైబర్ నేరాల దర్యాప్తు, ఆర్థిక సైబర్ నేరాల విచారణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, వివిధ సైబర్ పోర్టల్ల వినియోగం పై వరంగల్ పోలీస...
04/08/2026

సైబర్ నేరాల దర్యాప్తు, ఆర్థిక సైబర్ నేరాల విచారణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, వివిధ సైబర్ పోర్టల్ల వినియోగం పై వరంగల్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరిగింది.

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్న వరంగల్ CCS మరియు KUC పోలీసులు.మొత్తం 28 మోటార్ సైకిళ్...
04/08/2026

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్న వరంగల్ CCS మరియు KUC పోలీసులు.

మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్న వరంగల్ CCS మరియు KUC పోలీసులు.మొత్తం 28 మోటార్ సైకిళ్...
03/08/2026

వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకున్న వరంగల్ CCS మరియు KUC పోలీసులు.

మొత్తం 28 మోటార్ సైకిళ్ల స్వాధీనం, విలువ రూ. 25 లక్షలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా, బైక్ చోరీలు చైన్ స్నాచింగ్ కేసులకు కూడా దారి తీస్తుండటంతో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌లను నియమించాము. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రత్యేక దృష్టి సారించి నేర విచారణ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా జరిగిన నేరాలను విశ్లేషణ చేయగా, ఈ రోజు ఉదయం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా బైక్ చోరీలకు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

1) దొంతుల ప్రశాంత్ కుమార్ (20), నివాసం: పి.కె. రాజయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టీపీసీ, మంచిర్యాల మరియు 2) దుర్గం సాయి కార్తీక్ (21), నివాసం: వేలాల గ్రామం, జైపూర్ మండలం, మంచిర్యాల జిల్లా. వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

వాహన తనిఖీల సందర్భంగా నిందితులు ప్రయాణిస్తున్న అనుమానాస్పద పల్సర్ మోటార్ సైకిల్ No. AP 36 AY 4700 గల దానిని పోలీస్ టీమ్ స్వాధీనం చేసుకుని విచారించగా, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల గురించి సమాచారం అందించారు. వారి చూపిన మేరకు KUC PS మునిపల్లి గ్రామ శివారు మరియు ఎలుకతుర్తి సమీపంలోని ప్రాంతాల నుండి మొత్తం 28 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాము.

స్వాధీనం చేసుకున్న వాహనాల్లో హోండా షైన్, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో గ్లామర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్, హోండా హార్నెట్ తదితర మోడళ్లకు చెందిన ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అవి వరంగల్ కమిషనరేట్‌లో - 8, కరీంనగర్ కమిషనరేట్‌లో - 9, రామగుండం కమిషనరేట్ (పెద్దపల్లి)లో - 3, సిద్దిపేట కమిషనరేట్‌లో - 2, హైదరాబాద్ కమిషనరేట్‌లో - 3, రాచకొండ కమిషనరేట్‌లో - 1 మరియు భూపాలపల్లి జిల్లాలో - 2, మొత్తం 28 మోటార్ సైకిళ్ల దొంగతనాలు చేసినారు. వీటికి సంబంధించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితులపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. స్వాధీనం చేసుకున్న వాహనాల అసలు యజమానులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నాము.

ప్రజలు తమ వాహనాలను భద్రంగా పార్కింగ్ చేసి, స్టీరింగ్/వీల్ లాక్స్ వంటి అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

పై వరుస వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CCS ఇన్‌స్పెక్టర్లు A. రాఘవేందర్, E. హరికృష్ణ, K. రామకృష్ణ గార్లను, KUC ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ గారిని, CCS SI శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ అహ్మీద్, రవిప్రసాద్, జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్‌లను, IT Core Team AO Md. సల్మాన్ పాషా మరియు కానిస్టేబుల్ నగేష్, KUC క్రైమ్ కానిస్టేబుళ్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

ఈ మీడియా సమావేశంలో హనుమకొండ, CCS ఏసీపీలు నర్సింహారావు, సదయ్య పాల్గొన్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్.

సంగెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎ...
01/08/2026

సంగెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్
వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్,

శనివారం ఈస్ట్ జోన్ పరిధిలోని సంగెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సంగెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్, సంగెం ఎస్‌ఐ వంశీ కృష్ణ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

తదనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మామిడి మొక్కను నాటి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే స్టేషన్ సిబ్బందికి వ్యక్తిగతంగా మంజూరైన కిట్‌లను (పోలీస్ శాఖ అందజేసిన సామగ్రి), స్టేషన్ రికార్డులు, స్టోర్ గదులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై శాఖాపరమైన అంశాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల స్వభావం, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై స్టేషన్ ఎస్‌ఐను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు, బాధితునితో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, విధుల నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఉండకూడదని, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

అలాగే డయల్-100 కాల్స్‌పై వెంటనే స్పందించి, సంఘటన స్థలానికి త్వరగా చేరుకొని బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సిబ్బందికి వ్యక్తిగతంగా లేదా విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా తన దృష్టికి తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

ఈ తనిఖీలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం, పర్వతగిరి, ఐనవోలు ఎస్‌ఐలు వంశీ కృష్ణ, ప్రవీణ్, అశోక్ కుమార్, అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ఆపరేషన్ ముస్కాన్-XII...
01/08/2026

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ వివరాలు వెల్లడిస్తూ, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి జూలై 31 వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్-XII కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను రక్షించగా, వారిలో 269 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, ఇటుక బట్టీలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకోసం కమిషనరేట్ పరిధిలోని 9 సబ్‌డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక ఎస్‌ఐను ఇన్‌చార్జిగా నియమించి, మొత్తం 9 మంది ఎస్‌ఐలు, 36 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బందితో పాటు వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, కార్మిక శాఖ అధికారులు, అలాగే షేర్ (SHARE), స్కోప్ (SCOPE), FMM SSS స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు.

ఈ సంయుక్త చర్యల్లో భాగంగా 226 మంది బాల కార్మికులను, 85 మంది పాఠశాల మానేసిన (డ్రాప్‌అవుట్) చిన్నారులను గుర్తించి రక్షించారు. అనంతరం వారిని వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచి, పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కమిటీ ఆదేశాల మేరకు అప్పగించినట్లు తెలిపారు.

రక్షించబడిన చిన్నారుల్లో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 130 మంది చిన్నారులు కూడా ఉన్నారని కమిషనర్ వెల్లడించారు.

చిన్నారులతో అక్రమంగా పని చేయిస్తున్న యజమానులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 55 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 92 ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు (Inspection Reports) కార్మిక శాఖ అధికారులు నమోదు చేశారని, వివిధ పోలీస్ స్టేషన్ల జనరల్ డైరీల్లో 118 మంది చిన్నారుల వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, "పిల్లలు బడిలో ఉండాలి కానీ పనిలో కాదు. బాల్యానికి అండగా నిలవడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశ్యం. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవు," అని హెచ్చరించారు.

చిన్నారుల హక్కుల పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (WCD), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), కార్మిక శాఖ, విద్యాశాఖ, షేర్ (SHARE), స్కోప్ (SCOPE), FMM SSS స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు పాల్గొని విజయవంతం చేసినట్లు కమిషనర్ తెలిపారు.

Address

Hanumakonda
506001

Telephone

+918702567107

Website

Alerts

Be the first to know and let us send you an email when Warangal Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Warangal Police Commissionerate:

Shortcuts

Share