02/06/2026
అన్ని వనరులున్న సామాజిక తెలంగాణ సాధనే మా లక్ష్యం! ✊🚩
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు హయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.
సిపిఐ లెక్చరర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు బొంగు అరుణ్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను, సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ రాములు గారు ఎర్రజెండాను సగర్వంగా ఆవిష్కరించారు.
వేలాది మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో.. వనరులున్నా ఇంకా అట్టడుగు వర్గాలకు పూర్తి స్థాయి ఫలాలు అందడం లేదని ఈ సందర్భంగా కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు దక్కే నిజమైన 'సామాజిక తెలంగాణ' సాధన కోసం.. పేదల పక్షాన సీపీఐ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సామిడి వంశి వర్ధన్ రెడ్డి, హైకోర్టు కాలనీ డివిజన్ కార్యదర్శి చెంది వెంకట్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు మండల కార్యదర్శి కొప్పుల సరిత, ఏఐటీయూసీ మండల కార్యదర్శి పట్టేటి శేఖర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు వెంకన్న, డిహెచ్పిఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి పాల్వాయి సురేందర్, డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి ఆదిలక్ష్మి, గిరిజన సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి జైపాల్, బీసీ సంఘం మండల కార్యదర్శి బాలరాజు, బి ఓ సి నాయకులు వీరస్వామి, రామకృష్ణ, వివిధ శాఖ కార్యదర్శులు సౌజన్య, యమున, సుమతి, సౌజన్య, రజిత, శివ జ్యోతి, కృష్ణ లీల, పద్మ, సుజాత, జ్యోతి, శిరీష, కవిత, చెంది రాములు, ముత్తయ్య తోపాటు పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..💐💐
సాధిద్దాం.... అమరవీరుల ఆశయాలను.... ✊🚩