Hindupur Municipality

Hindupur Municipality Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hindupur Municipality, Public & Government Service, 4-4-74, Bypass Road, Hindupur.

28/07/2026
23/07/2026

వర్షపు నీటిని సంరక్షిద్దాం – నీటి భవిష్యత్తును కాపాడుదాం

**హిందూపురం పుర పాలక సంఘం** ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని వృథా కాకుండా సంరక్షించేందుకు బాధ్యతగా ముందుకు రావాలి. వర్షపు నీటి సేకరణ (Rain Water Harvesting) ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చు, భవిష్యత్‌లో నీటి కొరతను నివారించవచ్చు. అందువల్ల ప్రతి ఇంటి వద్ద, ప్రతి భవనం వద్ద వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంపొందించేలా చర్యలు తీసుకుందాం.

**“వర్షపు నీటిని ఒడిసిపట్టుకుందాం… నీటి వనరులను కాపాడుకుందాం… మన భవిష్యత్తును భద్రపరుచుకుందాం.”**

**– హిందూపురం పుర పాలక సంఘం**

23/07/2026

Commissioner and Director of Municipal Administration Nandamuri Balakrishna
💧 "క్యాచ్ ది రైన్" – వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం! 🌧️
ప్రతి నీటి బొట్టు... మన భవిష్యత్తుకు బంగారు బాట! 💙🌿

🗳️ హిందూపూర్ పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తిప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారం (EF) తప్ప...
09/07/2026

🗳️ హిందూపూర్ పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారం (EF) తప్పనిసరిగా జూలై 14వ తేదీలోపు మీ సంబంధిత BLOకు సమర్పించండి

✅ మీ ఓటు హక్కును పరిరక్షించుకోండి.
✅ చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే ఫారం సమర్పించండి.
✅ మీ కుటుంబ సభ్యులందరూ తమ EF ఫారాలను తప్పనిసరిగా సమర్పించేలా చూడండి.
మీ ఓటు – మీ హక్కు – మీ బాధ్యత

హిందూపూర్ మున్సిపాలిటీ
AERO & మున్సిపల్ కమిషనర్
Nandamuri Balakrishna Municipal Administration & Urban Development , AP Dr. Ponguru Narayana Election Commission of India

Sanitation activities inspected by Municipal commissioner sir V Mallikarjuna garuSwachha Andhra Corporation Swachh Bhara...
30/06/2026

Sanitation activities inspected by Municipal commissioner sir V Mallikarjuna garu
Swachha Andhra Corporation Swachh Bharat Mission - Urban Municipal Administration & Urban Development , AP Nandamuri Balakrishna Dr. Ponguru Narayana Andhra Pradesh CM Ministry of Housing and Urban Affairs

Dated : 30.06.2026 Municipal commissioner Sri V mallikarjuna garu inspected the Chinna market anna canteen Commissioner ...
30/06/2026

Dated : 30.06.2026 Municipal commissioner Sri V mallikarjuna garu inspected the Chinna market anna canteen
Commissioner and Director of Municipal Administration & Urban Development , AP Swachha Andhra Corporation Nandamuri Balakrishna Dr. Ponguru Narayana Andhra Pradesh CM

హిందూపూర్ మున్సిపాలిటీలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణహిందూపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 21 జూన్ 2026న 12వ అంతర్జ...
21/06/2026

హిందూపూర్ మున్సిపాలిటీలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
హిందూపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 21 జూన్ 2026న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వి మల్లికార్జున గారు మాట్లాడుతూ యోగా మన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే గొప్ప భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని తెలిపారు. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ "Yoga for Healthy Ageing (ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా)" అని వివరించి, అన్ని వయస్సుల వారూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో యోగా నిపుణుల మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యాన సాధనలు నిర్వహించారు. అనంతరం యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మున్సిపల్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

            నినాదం:*" #స్వచ్ఛ  #హిందూపూర్ # –  #స్వర్ణ  #హిందూపూర్ #, పరిశుభ్రతే ప్రగతికి పునాది #."*హిందూపూర్ మున్సిపాల...
20/06/2026


నినాదం:
*" #స్వచ్ఛ #హిందూపూర్ # – #స్వర్ణ #హిందూపూర్ #, పరిశుభ్రతే ప్రగతికి పునాది #."*

హిందూపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర (SASA) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రతపై అవగాహన కల్పించబడింది. SASA కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో ఒకటి.

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధులు ఐన వాల్మీకి సర్కిల్ నందు మరియు ప్రజా ప్రదేశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి చెత్తను తొలగించారు. ప్రజలకు చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి ఇవ్వాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని సూచించారు.
అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రజా మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ పరిశుభ్రమైన హిందూపూర్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని ప్రతిజ్ఞ చేశారు.

హిందూపురం పట్టణ ప్రజలకు తెలియజేయునదేమనగా, గౌరవ హిందూపురం శాసనసభ్యులు శ్రీ. నందమూరి బాలకృష్ణ వారి ఆదేశాలమేరకు పట్టణంలో ట్...
12/06/2026

హిందూపురం పట్టణ ప్రజలకు తెలియజేయునదేమనగా, గౌరవ హిందూపురం శాసనసభ్యులు శ్రీ. నందమూరి బాలకృష్ణ వారి ఆదేశాలమేరకు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు రహదారి భద్రతను మెరుగుపరచే ఉద్దేశ్యంతో ఈ క్రింది మూడు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబడినవి.
అవి:
1. బీఎస్టీ పెట్రోల్ బంక్ సర్కిల్
2. అంబేద్కర్ సర్కిల్
3. రహమత్‌పూర్ సర్కిల్
పై ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక వారంలోపు పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నవి. కావున వాహనదారులు, పాదచారులు మరియు ప్రజలందరూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా గమనించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించవలసిందిగా కోరడమైనది.

ట్రాఫిక్ సిగ్నల్స్ అమలులోకి వచ్చిన అనంతరం వాటిని ఉల్లంఘించిన వారిపై ప్రజాభద్రతకొరకు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించబడతాయని తెలియజేయడమైనది.

Andhra Pradesh Police Nandamuri Balakrishna పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించడం, రహదారి ప్రమాదాలను నివారించడం...
12/06/2026

Andhra Pradesh Police
Nandamuri Balakrishna
పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించడం, రహదారి ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హిందూపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముఖ్య కూడళ్ల వద్ద ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబడినవి.
ప్రజలందరూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవిస్తూ ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ లైట్ల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాము. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం మరియు అతివేగంగా ప్రయాణించకపోవడం వంటి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించడంతో పాటు సురక్షితమైన, క్రమబద్ధమైన హిందూపూర్ పట్టణ నిర్మాణానికి ప్రతి పౌరుడు సహకరించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు ప్రజల భద్రత కోసమేనని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హిందూపూర్ మున్సిపాలిటీ విజ్ఞప్తి చేస్తోంది.

“మీ భద్రత – మా బాధ్యత”

వి. మల్లికార్జున
మున్సిపల్ కమిషనర్
హిందూపూర్ మున్సిపాలిటీ

Address

4-4-74, Bypass Road
Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when Hindupur Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share