19/07/2026
కపిలవాయి దిలీప్ కుమార్ విలేకరుల సమావేశం
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెప్టెంబర్ 26న జరగనున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని అభ్యర్థుల విద్యార్హతలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ద్వారా జారీ చేసిన కొన్ని డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లపై విచారణ జరిపించాలని కోరారు.విచారణలో నకిలీ లేదా చెల్లని సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలితే, సంబంధిత అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో పారదర్శకత, నిష్పాక్షికత ఉండాలని, నిజమైన పట్టభద్రుల ఓటు హక్కును కాపాడాలని ఆయన పేర్కొన్నారు.
Rashtriya Lok Dal-राष्ट्रीय लोक दल Telangana Rashtriya lokdal party