14/04/2026
*ఎడ్యుకేట్ కాదు …అగిటేట్ కూడా కావాలి!: మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ*
ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాదిగ స్టూడెంట్ యూనియన్ స్టేట్ కో-ఆర్డినేటర్ బొర్ర శాంతి కుమార్ మాదిగ గారి ఆధ్యర్యంలో నిర్వహించిన భారత రత్న,రాజ్యాంగ నిర్మాత *ప్రపంచ మేధావి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి *135 వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథి గా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ* గారు పాల్గొని పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించారు.అనంతరం టపాకాయలతో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొని, ఆర్ట్స్ కాలేజీ నుండి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ
నిర్వహించారు,అనంతరం ట్యాంక్ బండ్ లో గల అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల తో నివాళి అర్పించారు …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు సాధారణ రోజు కాదు!
ఈ రోజు చరిత్రను మళ్లీ గుర్తు చేసుకునే రోజు...చరిత్రను మళ్లీ రాసే సంకల్పం తీసుకునే రోజు!ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ శిల్పి,సమానత్వానికి ప్రతీక అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సభలో మీతో పాటు పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది!అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు…ఆయన ఒక విప్లవం ఆయన ఒక సిద్ధాంతం!ఆయన ఒక యుద్ధం! రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది .ఆయన మనకు చెప్పినది ఒక్కటే —
“Educate, Agitate, Organize”
కానీ మనం అడగాలి…
ఈ రోజు మన సమాజం ఎక్కడ ఉంది?మాదిగల హక్కులు ఎక్కడ ఉన్నాయి?సమానత్వం ఎక్కడ ఉంది?ఇప్పటికీ మాదిగలకు న్యాయం జరగలేదు!ఇప్పటికీ మాదిగలు దోపిడీకి గురవుతున్నారు!ఇప్పటికీ మన హక్కులను ఎవరో దోచుకుంటున్నారు!మేము ఇక మౌనం పాటించం! మాదిగల కు రావలసిన sc సబ్ ప్లాన్ నిధులను మళ్లించకుండా వారి సంక్షేమం కోసమే వాడాలి. మాదిగల హక్కుల కోసం వీధుల్లోనైనా… యూనివర్సిటీల్లోనైనా… అసెంబ్లీల ముందు అయినా పోరాటం చేస్తాం!విద్యార్థులారా…
మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది!
మీరు చదవాలి…కానీ చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు చదువు ఒక ఆయుధం సమాజాన్ని మార్చే శక్తి!మీరు ప్రశ్నించాలి!మీరు ఎదిరించాలి!
మీరు వ్యవస్థను కదిలించాలి అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రాజ్యాంగం పుస్తకాలలో ఉండటానికి కాదు…ప్రజల జీవితాల్లో అమలు కావడానికి!
కానీ ఈ దేశంలో…అంబేద్కర్ పేరు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు…ఆయన ఆలోచనలు అమలు చేసే వాళ్లు ఎంత మంది?
ఇది మిమ్మల్ని ఆలోచింప చేయాలి!
ఇది మిమ్మల్ని కదిలిలించాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాసమ్ పల్లి అరుణ్ కుమార్ గారు,ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ,మరియు విద్యార్థులు నితిన్ మాదిగ ,శశి కుమార్ మాదిగ,మల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు