03/08/2026
ఆగస్టు 6న
సామాజిక తెలంగాణ సంకల్ప సభ జయప్రదం చేయండి: మేడి నరేష్
నకిరేకల్ నియోజకవర్గం న్యూస్: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత తలపెట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కార్యక్రమం ఆగస్టు 6న రంగారెడ్డి జిల్లా లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుండి జరుగుతుంది. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని నకిరేకల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి నరేష్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్ మాట్లాడుతూ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అగ్రవర్ణాల పేదలకు నిజమైన సామాజిక తెలంగాణ సాధ్యపడాలంటే అది కల్వకుంట్ల కవిత తోటే జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, మహిళలను, నిరుద్యోగ యువతను, రైతులను హక్కున చేర్చుకొని కల్వకుంట్ల కవిత కాపాడుకుంటుందని మేడి నరేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఏం మార్పు వచ్చిందని, సకల జనులంతా ఏమి కోల్పోయారని , ఏం చేస్తే స్వరాష్ట్ర స్వచ్ఛమైన పాలనలో సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వస్తాయని తెలిపేందుకే ఈ సభ కార్యక్రమం ఉంటుందని అన్నారు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చి నేటికి 80 ఏళ్లు పూర్తయిన విద్య, వైద్యం వ్యాపారం గానే కొనసాగుతుంది, రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ లేకుండా శాపంగా మారింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తమ హక్కుల కోసం కొట్లాడేందుకు ప్రభుత్వంపై పోరాడేందుకు ఈ సభను విజయవంతం చేయాలని నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ మేడి నరేష్ విజ్ఞప్తి చేశారు. ఈయొక్క కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ తెలంగాణ మాధవక్క, మండల నాయకులు ప్రేమ్, గిరి ప్రసాద్, సతీష్ నేత, నల్ల రేణుక, జ్యోతి, స్వప్న, నాగరాజు, రమేష్, ఆంజనేయులు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.