TRS YOUTH WING

TRS YOUTH WING TRS YOUTH WING

ఉద్యమ కాంక్షలు సాకారం6 తెలంగాణ ఆరు దశాబ్దాలకల. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే ఆందోళనను పక్కకునెట్టి ...
09/03/2023

ఉద్యమ కాంక్షలు సాకారం

6 తెలంగాణ ఆరు దశాబ్దాలకల. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే ఆందోళనను పక్కకునెట్టి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. అరవై ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసి, తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దేనికోసమైతే.. ప్రాణాలకు తెగించి కొట్లాడామో.. ఆ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. స్వరాష్ట్రంలో మన భాష, సంస్కృతి, దేవాలయాలు, పండుగలకు ఎనలేని ప్రాధాన్యం చేకూరింది.

సాదించుకున్న తెలంగాణ పాలనా పగ్గాలను పరుల చేతికిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదన్న మేధావులు, నిపుణులు, విశ్రాంత ఉన్నతాధికారుల కోరిక మేరకు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. నేడు దేశంలో పంటలు పండించడంలో తెలంగాణ టాప్, ఆదర్శ గ్రామాల్లో టాప్, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో టాప్, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సహా అనేక అంశాల్లో ఎన్నో ఏండ్ల కింద ఏర్ప డిన పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందువరుసలో ఉన్నది.

ఇప్పుడు దేశంలో తెలంగాణ మాడల్ జన బాహుళ్యంలో ఉన్నది. ఈ కృషి కారణజన్ముడైన సీఎం కేసీఆర్. ఆయన రాత్రికి రాత్రే మంత్రాలతో మ్యాజిక్ చేయలేదు. ఆయన తెలం గాణ మౌలిక అవసరాలను గుర్తించారు. ఉద్యమకాలం నుంచే రాష్ట్ర వెనుకబాటుతనాన్ని కండ్లారా చూసి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించారు. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంలో మొదటిదైన నీటి పారుదల ప్రాజెక్టులపై దృష్టిసా రించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కాళేశ్వరం భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తిచేసి కోటి ఎకరాల నూగాణాన్ని నీటితో తడిపారు. గోదావరి నీటిని ఎత్తుకు ప్రవ హింపజేసి నదికి నడకనేర్చారు. అందుకే కేసీఆర్ను అపరభగీ రథుడంటారు, పట్టుదల, కార్యసాధనలో కేసీఆర్ భగీరథుడి కంటే ఎక్కువే!

నిధుల విషయానికొస్తే 'సంపద పెంచు, పేదలకు పంచు' అనే నినాదంతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనా, అవతరించి దశాబ్దకాలం కూడా పూర్తికాకున్నా కేసీఆర్ ముందుచూపు, పరి పాలనాదక్షత, కార్యదీక్షతో అనేక అంశాల్లో తెలంగాణ దేశం లోనే నెంబర్వన్ గా నిలుస్తున్నది. తెలంగాణ జీడీపీ దేశ జీడీ దీని మించిపోయింది. రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా బాగా పెరుగుతుండటం రాష్ట్ర ప్రజల సగటు ఆదాయా న్ని తెలియజేస్తున్నది. రాష్ట్రం మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా నిలిచింది. ఎగుమతుల్లో వృద్ధిరేటు పరుగులు తీస్తున్నది తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్,సాగునీరు, పంటకు పెట్టుబడి ఇవ్వడంతో రైతుల ఆదాయం పెరిగింది. రైతుబంధు, దళితబంధు, చేపపిల్లల పంపిణీ, గొర పంపిణీ తదితర పథకాలు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశాయి. ధాన్యం దిగుబడిలో తెలంగాణ పంజాబ్ను దాటి మొదటిస్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్ర రైతులు ప్రతి సీజన్లో కోట్ల రూపాయల విలువైన ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నారు

నియామకాల్లోనూ తెలంగాణ మిగతా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే ఎంతో ముందున్నది. ప్రస్తుతం లక్ష ఉద్యో గాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. మరో వైపు తెలంగాణకు వరదలా వస్తున్న ప్రైవేటు కంపెనీల పెట్టులు రులతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఇటీవల నాలుగు రోజులు దావోస్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు రావడంలో సఫలీకృతులయ్యారు. ఒక్క టీఎస్ ఐపాస్ ద్వారానే గత ఎనిమిదేండ్లలో 17,43,204 మంది ఉద్యోగాలు పొందారు..ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు అంటే సగటున రాష్ట్రంలో అర్హులైన ప్రతి లక్ష మందిలో 1,643 మందికి కొలువులు వచ్చాయి.

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. మనది గ్రామీణ భారతం కాబట్టి, గ్రామస్థాయి నుంచే అభివృద్ధి జరగాలని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ ఆశించారు. కానీ 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ సాధించలేనిది కేసీఆర్ సాధించి చూపారు. గాంధీజీ ఆశయాన్ని ఆచరణలో పెట్టిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఈ రోజు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెను పలకరించినా, పచ్చదనంతో, పరిశుభ్రతతో, శ్మశాన వాటికలు, పార్కులు, క్రీడా మైదానాలు, రైతు వేదికలతో కళక శలాడుతున్నది. పట్టణాలు, నగరాలు అభివృద్ధి. పథంలో నడుస్తున్నాయి. హైదరాబాద్లో అనేక అత్యాధునిక మౌలిక వసతులు సమకూరాయి. పై ఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి లాంటివీ హైదరాబాద్ కు కొత్త హంగును తీసుకొచ్చాయి.

తెలంగాణకు వరదలా వస్తున్న ప్రైవేటు కంపెనీల పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఇటీవల నాలుగు రోజులు దావోస్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ దాదాపు రూ. 21 వేల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఒక్క టీఎస్ఎస్ఐపాస్ ద్వారానే గత ఎనిమిదేండ్లలో 17,43,204 మంది ఉద్యోగాలు పొందారు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశారు. అంటే సగటున రాష్ట్రంలో అర్హులైన ప్రతి లక్ష మందిలో 1,643 మందికి కొలువులు వచ్చాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కవి, రచయిత, సాహిత్య వేత్త, భావుకుడు. అంతకుమించి పరమ భక్తుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. 'తెలంగాణ' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పరిపా లన మొదలైన తొలినాళ్లలోనే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి, తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.. 'ఆయుత చండీయాగం' ఘనంగా నిర్వహించారు. యాదాద్రి. మహానిర్మాణంతో ప్రపంచ పర్యాటకులంతా తెలంగాణ వైపు చూస్తున్నారు. గత తొమ్మిదేండ్లలో ఎములాడ రాజన్న, కొండ గట్టు అంజన్న, సమ్మక్క సారక్కలు, బాసర సరస్వతి, భద్రాద్రి రాముడి ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక పర్యాటకం కోటి ప్రభలతో వెలుగొందుతున్నది.

తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగ జముని తహ్జిబ్ కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. కులమతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ అమలు పరుస్తూ లౌకిక వాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఫలాలు దేశమంతటికి విస్తరించాలన్న దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చి జాతిని గెలిపించేందుకు నడుం బిగించారు. రైతు సంక్షే మమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందడుగు వేస్తున్నది. ఆ దిశగానే పార్టీ అధినాయకుడు, సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు..

రైతుబంధు, రైతు బీమా పథకాలను జాతీయస్థాయిలో విస్త రిస్తే.. సాధించే ఫలితాలను వివరిస్తూ కేసీఆర్ తన ప్రసంగాలతో దేశ ప్రజలను ఆలోచనలో పడేస్తు న్నారు. బక్కపల్చని మనిషి ఉక్కు సం కల్పంతో రేపు భారత జాతిని ప్రపం దంలో మేటిగా నిలబెట్టగలరని మనం . ఇప్పుడు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ దీక్షా దక్షతలు మనకు తెలుసు కాబట్టి.. ఆయన ప్రజలను గెలిపించి, దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతారనడంలో సందేహం లేదు

(✍️✍️ వ్యాసకర్త: సయ్యద్ నజీం అహ్మద్)
బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి
9032316234

Address

Telangana Bhavan
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS YOUTH WING posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share