ఆంధ్రా వాయిస్

ఆంధ్రా వాయిస్ ఆంధ్రుల గొంతు చప్పుడు - మీమాట మా ఆలోచన

తప్పు చేసినవాడు సొంత పార్టీ కార్యకర్త అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి నిరూపించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గార...
18/07/2026

తప్పు చేసినవాడు సొంత పార్టీ కార్యకర్త అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి నిరూపించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.

గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నట్లుగా, ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వెంటనే సస్పెండ్ చేశారు.

ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ లేదని, తప్పు చేసినవాడు ఎవరైనా, సొంత పార్టీ కార్యకర్త అయినా కఠిన చర్యలు తప్పవని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరోసారి స్పష్టం చేశారు.

మహిళలపై చేయి వేయాలంటే ఇకపై ఎవరైనా భయపడాల్సిందే... చట్టం ముందు అందరూ సమానమే.

ప్రశ్న రావణ్ వెనుక సజ్జల భార్గవ్ - జగన్ PRO పూడి శ్రీ శ్రీహరి .. !!పారిపోవాలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచన .. ...
07/07/2026

ప్రశ్న రావణ్ వెనుక సజ్జల భార్గవ్ - జగన్ PRO పూడి శ్రీ శ్రీహరి .. !!

పారిపోవాలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచన ..

వణుకుతున్న తాడేపల్లి ప్యాలస్ ..

నక్సలైట్లు .. తీవ్రవాదులను అమరజీవులంటూ .. హిందూ మతాన్ని .. హిందూ దేవుళ్ళనీ నీచంగా మాట్లాడిన ప్రశ్న రావణ్ కి స్క్రిప్ట్ అంతా తాడేపల్లి నుండే వచ్చిందా ..!

అవును అనే అంటున్నారు ఇంటెలిజెన్స్ & మీడియా వర్గాలు .. దేశంలో , దాని ద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా సాగిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ..

UAPA ఆక్ట్ కింద రావణ్ నీ అరెస్టు చేసి నెల్లూరు జైలుకి రిమాండ్ కి తరలించారు ..

ఇది ఇలా ఉండగా .. రావణ్ కుట్ర బయటపడటంతో.. తాడేపల్లి ప్యాలస్ లో డొంక కదులుతుంది ..

సహజంగా వ్యక్తిగా ఎవరికి అందుబాటులో లేని జగన్ .. నేడు ఉదయం హుటాహుటిన సజ్జల రామకృష్ణ రెడ్డి .. శ్రీ హరిపుడి .. సజ్జాల భార్గవ్ మరియు సుప్రీం కోర్టులో ఒక్క గంట కేసు వాదించడానికి కోట్లు గడించే ఒక ప్రముఖ లాయర్ .. ఒక రిటైర్డ్ జడ్జి సమావేశం అయ్యారని చెబుతున్నారు ..

రావణ్ తరువాత అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి .. చూద్దాం ఏమి జరుగుతుందో .. దేశ ద్రోహలు చేసిన నేరస్థులకు ఎలాంటి శిక్ష పడుతుంతో ..!!

కులాల కుంపట్లు రాజేస్తున్న సోషల్ మీడియా వెనుక అసలు సూత్రధారులు ఎవరు? యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులో సంచలన నిజాలు !ఇటీవల ఏ...
03/07/2026

కులాల కుంపట్లు రాజేస్తున్న సోషల్ మీడియా వెనుక అసలు సూత్రధారులు ఎవరు? యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులో సంచలన నిజాలు !

ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన, అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన యూట్యూబర్ జోసెఫ్ రావణ్ (ప్రశ్న రావణ్) ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ అరెస్ట్ వెనుక, రాజకీయంగా ఎదుర్కొనేందుకు కొందరు నేతలు నడిపించిన గుట్టుమట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

నెలనెలా ₹3 లక్షల జీతం.. ఎవరి కోసం?
రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడమే పనిగా పెట్టుకున్న జోసెఫ్ రావణ్‌కు ప్రతి నెలా ₹3 లక్షల రూపాయల పారితోషికం అందుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వీడియోలు రూపొందించడానికే ఈ భారీ మొత్తాన్ని వెనుక ఉండి ఒక ప్రత్యేక రాజకీయ వర్గం నడిపించిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రూ. 25 లక్షలతో హైటెక్ వీడియో ఎక్విప్మెంట్!
కొద్దిరోజుల క్రితం జోసెఫ్ రావణ్ సరికొత్త, అధునాతన వీడియో ఎక్విప్మెంట్ (కెమెరాలు, ఎడిటింగ్ సెటప్) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా ₹25 లక్షల రూపాయలను ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఐటీ వింగ్ లేదా దానికి సంబంధించిన కీలక నేతలే సమకూర్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సాధారణ యూట్యూబర్‌కు ఇంతటి భారీ ఆర్థిక సహాయం వెనుక ఉన్న ఆ 'అదృశ్య హస్తం' ఎవరిదనే కోణంలో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు.

సజ్జల భార్గవ్ రెడ్డితో ఉన్న సంబంధం ఏంటి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి చెందిన సోషల్ మీడియా విభాగంలో గతంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సజ్జల భార్గవ్ రెడ్డి కి, ఈ జోసెఫ్ రావణ్‌కు మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. భార్గవ్ రెడ్డి నేతృత్వంలోని సోషల్ మీడియా నెట్‌వర్క్ నుంచే ఈ తరహా కంటెంట్ క్రియేటర్లకు స్క్రిప్ట్‌లు, ఆర్థిక వనరులు మరియు సాంకేతిక సహాయం అందేవని.. అందులో భాగంగానే జోసెఫ్ రావణ్ కూడా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారని జనసేన మరియు కూటమి నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

వాక్ స్వాతంత్ర్యం పేరుతో హద్దులు దాటి చేసే వ్యక్తిగత దూషణల వెనుక ఉన్న ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల నెట్‌వర్క్‌ను, వారి వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు మరియు కూటమి శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.

18/06/2026

ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ఎవరు ఎంత గింజకున్న
ప్రజల మనసులో నుండి అయనని తీసేయలేరు
ప్రజల నాడి మీ ముందుకు 💐💐💐

12/06/2026

అన్న చెల్లెల్ల అనుబంధం 😍

12/06/2026

తిరుపతిలో జరుగుతున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి,
సంక్షేమం సభలో పాల్గొన్న ఐటీ విద్యాశాఖ మంత్రి
లోకేష్ గారు....

ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగ  నియామకం కూడా చేయని జగన్ కి నియామకాలు ఎలా జరుగుతాయో అన్న అవగాహన లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ హ...
05/06/2026

ఐదేళ్ళలో ఒక్క ఉద్యోగ నియామకం కూడా చేయని
జగన్ కి నియామకాలు ఎలా జరుగుతాయో అన్న అవగాహన లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మీద ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వాలని 2023 ఆగష్టు 2వ తేదీన జీవో నెం.77 ఇచ్చిందే జగన్ ప్రభుత్వం. కేవలం రాజకీయం చేయడానికి మెగా డీఎస్సీలో సెలక్ట్ కాని అభ్యర్థులను ముందు పెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు.



15/05/2026

ఇది రాయలసీమ 🔥🔥🔥

రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. రక్షణ సీమ... ఇది భవిష్యత్.. పుట్టపర్తిలో దేశం గర్వించే అత్య...
15/05/2026

రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర.

ఉద్యాన సీమ... ఇది వర్తమానం.
రక్షణ సీమ... ఇది భవిష్యత్..

పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన
ప్రాజెక్టుకు నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌
గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు
భూమి పూజ చేయనున్నారు.








Address

హైదరాబాద్
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when ఆంధ్రా వాయిస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share