25/07/2026
సంకల్ప్ (Sankalp) ప్రాజెక్టుపై సమన్వయ సమావేశం
2027 నాటికి హైదరాబాద్ జిల్లాలో నవజాత శిశు మరణాల రేటు (NMR)ను సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గించడమే లక్ష్యం" అని జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి డా. పుట్ల శ్రీనివాస్ గారు తెలిపారు.
నీలోఫర్ హాస్పిటల్ నాట్కో బిల్డింగ్ ఆడిటోరియంలో నిర్వహించిన సంకల్ప్ ప్రాజెక్టు సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా.పుట్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అధిక ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ, అత్యవసర నవజాత శిశు సంరక్షణ, పుట్టిన గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం, అవసరమైన సందర్భాల్లో సకాలంలో రిఫరల్ సేవలు అందించడం ద్వారా నవజాత శిశు మరణాలను మరింత తగ్గించవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో డా. విజయకుమార్, డా. శ్రీధర్, డా. అనితతో పాటు మెడికల్ సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు ఎస్పిహెచ్ఓ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.