13/08/2024
*ప్రచురణార్థం*:
*13/8/2024*
*నాగర్ కర్నూల్*
*ప్రజాస్వామ్యానికి పాతర వేసే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి*
*వలసవాద చట్టాల ప్రతిరూపాలే ఈ క్రూర చట్టాలు*
*ఏ ఐ వై ఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి డిమాండ్*
మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను 'భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు' అని,ప్రజాస్వామ్యానికి పాతర వేసే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జాతీయ సమితి పిలుపులో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో
*నాగర్ కర్నూల్ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు దేశమున ఆంజనేయులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ*
అధికార దురహంకారంతోనే కేంద్రం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి... బలవంతంగా ఈ చట్టాలను ఆమోదించిందని, ఈ చట్టాల్లో అనేక తిరోగమన నిబంధనలు ఉన్నాయని వారు విమర్శించారు. అర్ధరాత్రి పోలీసు రాజ్యంతో భారతదేశం మేల్కొంటోందని, న్యాయ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలకు ఇది విరుద్ధమని, చాలా విస్తృతమైన పరిణామాలు కలిగి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అనేకమంది న్యాయకోవిదులు, న్యాయవాదులు, విద్యావేత్తలు హడావుడిగా రూపొందించిన మూడు క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. 17వ లోక్ సభ గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుందనగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరో తరుముతున్నట్టు వేగంగా ఆమోదించి జులై 1వ తేదీని అమలులోకి తెచ్చారన్నారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియామ్ (బీఎస్ఏ) లను....ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు బదులు హిందీలో పలికే కొత్తచట్టాలు తెచ్చారన్నారు. ఎలాంటి సంసిద్ధత, చర్చలు జరపకుండా, నిపుణుల న్యాయప్రవీణుల సూచనలుసైతం ఆలకించకుండా నేర న్యాయవ్యవస్థ మొత్తంలో పూర్తి మార్పులు చేశారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ విధానాలపై 18వ లోక్సభ ఎన్నికలపై తీవ్ర కలవరపరిచి భవిష్యత్లో మరింత దెబ్బకొట్టే విధంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఏమీ జరగలేదన్నట్లుగా బ్రిటీష్ పాలన నాటికంటే మరింత క్రూరమైన చట్టాలను మోదీ ప్రభుత్వం ఆమోదించి అమలులోకి తీసుకువచ్చిందన్నారు.. హిందీ భాషలో ఈ చట్టాలకు పేరుపెట్టే సమయంలోనైనా ఎంత మాత్రం చర్చించలేదన్నారు.
స్వాతంత్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన 'రాజద్రోహ' చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసిందన్నారు. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామనీ కేంద్రం నాడు సుప్రీంకోర్టులో తెలిపింది. కానీ, కొత్త చట్టంలో తిరిగి 'రాజ ద్రోహం' చట్టాన్ని 'దేశ ద్రోహం' పేరుతో తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకు ఉన్న హక్కును హరించి వేయటానికే ఈ చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలు ఎంతో కాలంగా ఉన్నాయన్నారు. అరెస్టు సందర్భంగా నిందితుల చేతులకు బేడీలు వేయటాన్ని పునరుద్ధరించటం సరైంది కాదన్నారు. తప్పనిసరిగా బాధితుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐఆర్ నమోదు చేయాలన్న ప్రస్తుత నిబంధనను తొలగించడాన్ని పాతకాలపు పోకడలకు దేశాన్ని వెనక్కు తీసుకెళ్లడమేనని వారు ఉద్ఘటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వాడల బాల పీర్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా నాయకులు ప్రకాష్, నవీను, ప్రవీను, తరుణ్, తదితరులు పాల్గొన్నారు