15/08/2026
*మహబూబ్నగర్ పట్టణంలోని టిడిపి ఆఫీసు ఆవరణలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
*దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు*
*సకల వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు..*
భారతదేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గుర్తుచేసుకుంటూ, దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి ప్రేమ, సౌభ్రాతృత్వం, వివేకం, సహనం, పరోపకారం, త్యాగం వంటి విలువలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని సహజ వనరులు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ సీలింగ్ భూములు, భూదాన్ భూములను పంపిణీ చేయాలని కోరారు.
పూర్వీకులు నిర్మించిన చెరువులు, కుంటలు, పాఠశాలలు, ఇతర ప్రజా వనరులను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సహజ వనరుల్లో కీలకమైన గుట్టలు, కొండలను కాపాడుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, విద్య, మహిళా సాధికారత, అంటరానితనం నిర్మూలన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ‘జన్మభూమి’, ‘ప్రజల వద్దకు పాలన’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు పాలనను చేరువ చేసే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ సభ్యత్వం కలిగి ఉండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో 515 మందికి రూ.10,14,960 ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా, శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ విద్యార్థులకు చేయూత అందించడం జరిగిందన్నారు. 560 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత విద్య అందించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రికి రూ.50 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ సమకూర్చినట్లు తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో శ్రీమతి భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో 23-01-2017న పాడి పశువుల కొనుగోలుకు 179 మందికి రూ.78 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు.
అదేవిధంగా నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో 165 పశువులకు చికిత్స, 106 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సకల వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయంతో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు గారితో పాటుగా ఆర్ బాలప్ప,బుజగౌని సాయన్న గౌడ్,శ్రీ వెంకటయ్య సాగర్,కేశవులు, మురళి,కిట్టు,చెన్నయ్య,యాకూబ్ సాబ్,శ్రీనివాస్ గౌడ్ గారుమొదలగు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది