Kuna Srisailam Goud

Kuna Srisailam Goud Former MLA, Quthbullapur Assembly Constituency, Medchal Malkajgiri District, Telangana Stay Tuned with my activites...
Official Page

*శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*కుత్బుల్లాపూర్: శ్రీకృష్ణ ...
04/09/2026

*శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గణేష్ నగర్ డివిజన్‌లోని చెరుకుపల్లి కాలనీ, పాపయ్య నగర్ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

*చెరుకుపల్లి కాలనీలో శ్రీ వంశీకృష్ణ యాదవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32 సంవత్సరాలు నుండి నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు*. అనంతరం శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదేవిధంగా పాపయ్య యాదవ్ నగర్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లోనూ స్థానిక కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యఅతిథిగా హాజరై శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతియుతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం మరింత బలపడాలని, సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ దైవభక్తి మార్గంలో నడవాలని సూచించారు..

అదేవిధంగా శ్రీకృష్ణుడి రూపంలో వేషధారణ ధరించిన బాలలతో పాటు కూచిపూడి నృత్యాలు ప్రదర్శించిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు..

అనంతరం కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు..

ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, కృష్ణ యాదవ్, వెంకటేష్ యాదవ్, లింగం యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు,ఎంవీ రావు, జెపి కుమార్, కిషోర్,సురేష్ మరియు పాపయ్య నగర్ కమిటీ సభ్యులు రంగనాథ్, వెంకట్ రావు శ్రీనివాస్ రావు, తిరుమల రాజ్, గాజుల శ్రీనివాస్ లతో పాటు భక్తులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

*ఢిల్లీలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవం లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్ర...
02/09/2026

*ఢిల్లీలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవం లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌ గారు*..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్‌లో భాగంగా ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.వి.పి. రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అవార్డులను ప్రతిభావంతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు...

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం ...
02/09/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు* ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.

*కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*కరీంన...
01/09/2026

*కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కోసం మంగళవారం అభిప్రాయ సేకరణ చేపట్టారు.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో, పీసీసీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్ష పదవిని ఆశిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల వివరాలను సేకరించి, ఒక్కొక్కరి అభిప్రాయాలను శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు స్వయంగా తెలుసుకున్నారు..

నూతన అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా ఉండే నాయకులను పిసిసి ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు..

అభిప్రాయ సేకరణ ద్వారా సేకరించిన వివరాలను పీసీసీకి అందజేసి, పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలకు అధ్యక్షులను త్వరలో ప్రకటిస్తామని శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీ ఫక్రుద్దీన్ గారితో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

*ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ శా...
31/08/2026

*ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు సోమవారం షాపూర్ నగర్‌లోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా పలు కాలనీలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అదేవిధంగా రోడ్డమేస్త్రి నగర్ డివిజన్‌కు చెందిన పలువురు మహిళలు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కూన శ్రీశైలం గౌడ్ గారిని కలిసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై చూపుతున్న ప్రేమ, అభిమానం ఇలాగే ఎల్లప్పుడూ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పలువురి వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వది...
31/08/2026

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పలువురి వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అదేవిధంగా బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన Shaya ఇంటీరియర్ డిజైన్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, షోరూమ్ యజమాని మోహిత్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి ఉపాధ్యక్షులు శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు*కుత్బుల్లాపూర్: ఐడిపిఎల్ చౌ...
30/08/2026

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్: ఐడిపిఎల్ చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులస్తులకే పరిమితమైన నాయకుడు కాదని, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అనంతరం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు, స్థానిక కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్దార్ పాపన్న గౌడ్ కమిటీ చైర్మన్ నందనం దివాకర్ గారు, అధ్యక్షులు గంగా శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ గారు, ఆనంద్ గౌడ్ గారు, ప్రభా గౌడ్ గారు, జయ శ్రీ గారు, టీ నర్సింగరావు గౌడ్, బుర్ర మణికంఠ గౌడ్, మీ శ్యామనారాయణ గౌడ్, ప్రభు, సంతోష్, సురేష్ గౌడ్, భూషణం గౌడ్, సంజు గౌడ్, రాజు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, అనిల్, శివ గౌడ కుల పెద్దలు, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.

*దుండిగల్, ఆగస్టు 30: దుండిగల్‌లో శ్రీ రాజరాజేశ్వర పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కుత్బుల్లా...
30/08/2026

*దుండిగల్, ఆగస్టు 30: దుండిగల్‌లో శ్రీ రాజరాజేశ్వర పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌ గారు ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు*.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్‌ గారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్‌ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు DCC ఉప అధ్యక్షులు ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, డివిజన్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, ప్రేమ్, ఉదయ్ గౌడ్ లతొ పాటు భక్తులు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*శ్రీదుర్గా మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన  (చండీ హోమo) కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*కుత్...
29/08/2026

*శ్రీదుర్గా మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన (చండీ హోమo) కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ డివిజన్ (286) పరిధిలోని వినాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీదుర్గా మాత ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి *కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు*. అనంతరం శ్రీదుర్గా మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు నర్సింగరావు (ATM), మురళి, పండు, యాదగిరి, నదీమ్, వెంకటయ్య, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

*హైదరాబాద్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు శనివారం నిజాంపేట్ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాట...
29/08/2026

*హైదరాబాద్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు శనివారం నిజాంపేట్ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన The Skin Atelier ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు*.

మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ వజ్రేష్ యాదవ్ గారి కుమార్తె నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్కిన్ కేర్ సంస్థ ప్రారంభోత్సవానికి హాజరైన కూన శ్రీశైలం గౌడ్ గారు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన చర్మ సంరక్షణ సేవలు అందిస్తూ The Skin Atelier విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు...

ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్, గ్రంధాలయ చైర్మన్ బొంగునూరీ శ్రీనివాస్ రెడ్డి తొ పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Address

Hyderabad
500055

Alerts

Be the first to know and let us send you an email when Kuna Srisailam Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kuna Srisailam Goud:

Shortcuts

Share