Hyderabad Metropolitan Water supply & Sewerage Board

Hyderabad Metropolitan Water supply & Sewerage Board Hyderabad Metro Water Supply and Sewerage Board established in the year 1989 November 1st.

Objective is to supply of drinking water and maintenance of sewerage system in entire GHMC area and also surrounding panchayats.

జ‌ల‌మండ‌లి జ‌ల సంర‌క్ష‌ణకు కేంద్ర ప్ర‌భుత్వ‌ అవార్డు================================న‌గ‌రవాసుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ...
18/11/2025

జ‌ల‌మండ‌లి జ‌ల సంర‌క్ష‌ణకు కేంద్ర ప్ర‌భుత్వ‌ అవార్డు
================================

న‌గ‌రవాసుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా విశేష కృషిచేస్తున్న జ‌ల‌మండ‌లికి మ‌రో అవార్డు ల‌భించింది. జ‌ల సంర‌క్ష‌ణలో జ‌ల‌మండలి చేప‌డుతున్న కృషికి గాను ప్ర‌క‌టించిన అవార్డును జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి నేడు (తేది.18.11..2025, మంగళవారం రోజున‌) న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ 'టాప్ మునిసిపల్ కార్పొరేషన్' కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు ఈఅవార్డ్ అందించారు.

కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ '10 టాప్ మున్సిపల్ కార్పొరేషన్' కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు 'జల్ సంచయ్ జన భాగిదారి 1.0 అవార్డ్ అందించారు.

జల మండలి నీటి భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ మాత్రమే కాకుండా ప్రజల ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించినందుకు, JSJB పరిధిలో కమ్యూనిటీ ఆధారిత నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం ద్వారా “వాటర్ పాజిటివ్ యాక్షన్”ను ప్రేరేపించడమే కాకుండా, నీటి పట్ల కోల్పోయిన గౌరవాన్ని తిరిగి కలిగించిందని ఈ సందర్బంగా మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఈ అవార్డు భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల‌మండలి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జ‌ల సంర‌క్ష‌ణలో అవార్డు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బోర్డు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది స‌మిష్టి కృషి వ‌ల్లే ఈ అవార్డు వ‌చ్చింద‌ని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ‌. రేవంత్ రెడ్డి గారు బోర్డు అధికారుల‌పై న‌మ్మకం ఉంచి ప్రోత్సాహించ‌డం.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ కార్యక్రమం విజ‌య‌వంతం అయిన‌ట్లు తెలిపారు.

రోజురోజుకు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అంత‌కంత‌కు అభివృద్ది చెందు తోంది. దీంతో న‌గ‌రంలో జీవిస్తున్న వారి సంఖ్య దాదాపు కోటిన్నర జ‌నాభాను దాటింది. దీంతో ప్ర‌జ‌ల అవ‌స‌రాల కొర‌కు నీటివినియోగం మ‌రింత‌గా పెరిగింది. జ‌ల‌మండ‌లి వంద‌ల కిలో మీట‌ర్ల నుంచి నీటిని తీసుకువ‌చ్చి స‌ర‌ఫ‌రా చేస్తుంది.

అయినా భూగ‌ర్భ జ‌లాన్ని ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. ఎంతగా అంటే భూమిలోకి ఇంకుతున్న నీటిక‌న్నా న‌గ‌ర‌వాసులు బోర్ల ద్వారా వినియోగిస్తున్న నీరే అధికం. దీంతో భూగ‌ర్భ జ‌లాలు ఆడుగంటి పోతున్నాయి.

లాతూర్‌లో ఎదురైన నీటి క‌ష్టాల అనుభ‌వ దృష్ట్యా అలాంటి ప‌రిస్థితులు హైద‌రాబాద్‌లో రాకుండా ఉండేందుకు సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్‌ 2న సీఎం రేవంత్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతులు మీదుగా ‘ ప్రతి ఇంటా ఇంకుడు గుంత–90 డేస్‌ స్పెషల్‌ డ్రైవ్‌’ పేరిట కార్యాక్రమానికి ప్రారంభింప జేసి నిరంతరం యజ్ఞంగా కొనసాగిస్తూ వస్తున్నారు.

Address

Khairatabad
Hyderabad
500004

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Hyderabad Metropolitan Water supply & Sewerage Board posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share