02/08/2026
దశాబి మహోత్సవాలు!" రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ విద్యత్సభ దశాబ్ది మహోత్సవాల ముఖ్య కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వేద, ధర్మ, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జగద్గురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు, వేద పండితుల ఆశీర్వాదాలు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ M వేణుగోపాల చారి గారు హాజరై కార్యక్రమాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దారు. అలాగే వివిధ రంగాల్లో అపూర్వ ప్రతిభ కనబరిచిన వారికి ఘనంగా సన్మానించి బహుమతులు అందజేయడం అభినందనీయం.
భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, వేద సంప్రదాయాల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న తెలంగాణ విద్యత్సభ సేవలు నిజంగా ప్రశంసనీయం. ఈ దశాబ్ది మహోత్సవాలు సమాజానికి స్ఫూర్తినిచ్చే వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 🙏🌺
బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ మరియు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ SIR ఇంచార్జ్ కోఆర్డినేటర్!"