28/09/2026
ఫిరాయింపుదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు. ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ:
పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.అరవింద్ కుమార్ గౌడ్. సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశము.
రాజకీయాల్లో నిబద్ధత అవసరమని, పార్టీలు మారే సంస్కృతి సరైనది కాదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. గెలిచిన పార్టీ వీడి అధికార పార్టీలోకి మారే నేతలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని, భవిష్యత్తు రాజకీయాలకు ఇదొక స్పష్టమైన హెచ్చరిక అని పేర్కొన్నారు.
సోమవారం ఉదయం 11:30 గంటలకు దోమల్ గూడలోని నగర పార్టీ కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశం సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎం. అరవింద్ కుమార్ గౌడ్ గారు సెంట్రల్ కమిటి అధికార ప్రతినిధి శ్రీమతి జోత్స్న గారు, మాజీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎం.అమర్ నాథ్ బాబు, జివిజి నాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పి.అశోక్, మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నికపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. తెలుగుదేశం పాలనలోనే ఖైరతాబాద్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందని నాయకులు అన్నారు.
అనంతరం పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ: గతంలో తెదేపా హయాంలో మాజీ మంత్రి దివంగత శ్రీ విజయరామారావు నాయకత్వంలో, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఖైరతాబాద్‌ను హైదరాబాద్‌లోనే నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దామని, రోడ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ వసతులు మరియు మౌలిక వసతుల కల్పనలో తెదేపా తెచ్చిన సంస్కరణలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్న ఖైరతాబాద్ ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. సెంట్రల్ కమిటి అధికార ప్రతినిధి శ్రీమతి జోత్స్న గారు మాట్లాడుతూ ఏపార్టీకి లేని బలం తెలుగుదేశం పార్టీకే సొంతమని, అదే నిస్వార్థమైన మరియు పార్టీ పట్ల అంకిత భావం కలిగిన కార్యకర్తలేనని అన్నారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ తప్పక పోటీ చేయాలని స్థానిక నాయకులు, సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా తీర్మానించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలు మరియు ప్రజల అభిప్రాయాలను సేకరించి, రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన అనంతరం నివేదికను పార్టీ అధిష్టానానికి పంపి, అధిష్టాన నిర్ణయానికి లోబడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ ముఖ్య నాయకులు, ఎం.కె బోసు, పరుశురామ్, శ్యామ్ సుందర్, తడక వినోద్, ఓ.వెంకటేష్ చౌదరి, ప్రమీల, భాను ప్రకాష్, కరణం కరణ్, కట్ట రాములు, ఎం.ఎ.సిద్దీఖి, చంద్రమోహన్ గౌడ్, భవాని శ్రీనివాస్, ఎస్.ప్రకాష్, ఎం.నర్సింహులు, ఎం.డి.సలీం, సత్యనారాయణ, పుప్పాల బాలకృష్ణ, పి.వీరబాబు, బి.రాజు, సత్తన్న, రవి, ఆనంద్, అనిల్ లతో పాటు, కార్యకర్తలు నియోజకవర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.