Cyberabad Police Commissionerate

Cyberabad Police Commissionerate The Official page of the Cyberabad Police.
(332)

We are dedicated to serve our people and make Cyberabad Police Commissionerate area a safer place to dwell, work, visit, transit or conduct business.

సైబరాబాద్‌లో 11 వ విడత రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం-సంతోషం వ్యక్తం చేసిన బాధితులుసైబరాబాద్ పోలీస్ కమిషనర్...
16/09/2026

సైబరాబాద్‌లో 11 వ విడత రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం

-సంతోషం వ్యక్తం చేసిన బాధితులు

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ గారి యొక్క ఆదేశాల మేరకు, సైబరాబాద్ పరిధిలో CEIR పోర్టల్ ద్వారా, ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను, 11 వ దశలో 1,218 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి యొక్క విలువ సుమారు 2,43,60,000/- ఈ రికవరీ ప్రక్రియలో సీసీఎస్ కూకట్పల్లి పోలీసులు 410, సీసీఎస్ శేరిలింగంపల్లి పరిధిలో 407 మరియు సీసీఎస్ కుత్బుల్లాపూర్ పరిధిలో 401, మొత్తం 1,218 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఇట్టి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు స్వయంగా అందజేశారు.

సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ గారు మాట్లాడుతూ... ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ (CEIR) ద్వారా ఫోన్లను సులభంగా ట్రాక్ చేస్తున్నామని, ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధికి, వ్యక్తిగత అవసరాలకు కీలక సాధనంగా మారిందని, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి యజమానులకు అప్పగించి వారిలో మళ్లీ ఆనందాన్ని నింపడం పోలీసుల బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అనంతరం సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. ముఖ్యంగా Job Fraud. Betting Apps, మొదలగునవి మరియు మీ యొక్క సెల్ నం. కూడా గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదు అని తెలియజేశారు. రద్దీ ఉన్న ప్రాంతాలలో అనగా మార్కెట్స్, బస్ స్టాప్స్, ఉత్సవాలు జరిగే ప్రదేశాలలో తమ వస్తువుల పై నిఘా ఉంచి జాగ్రతగా ఉండాలని సూచనలు ఇచ్చారు. అదేవిదంగా ఇళ్ళల్లో జరిగే దొంగతనాలు గురించి కూడా తగు సూచనలు ఇచ్చారు, ఎవరైనా దూర ప్రాంతాలకు, విహార యాత్రలకు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఎట్టి పరిస్తితి లో కూడా Social Media లో షేర్ చేయకూడదు అని సూచించారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన CCS టీమ్ మరియు పోలీసు అధికారులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని తిరిగి పొందిన పలువురు బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు.
సృజన అనే మహిళా బాధితురాలు KPHB లోని టి పాయింట్ దగ్గర రెండు నెలల క్రితం Tea త్రాగడానికి వెళ్ళగా తన I Phone 17 Pro అక్కడ మర్చిపోయింది వెంటనే KPHB పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఫోన్‌కు కాల్ చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్ రావడంతో తిరిగి దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందానని చెప్పారు. అయితే సైబరాబాద్ పోలీసులు కృషి చేసి తన ఫోన్‌ను తిరిగి అందజేయడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో TCS లో పని చేస్తున్న నారాయణ చౌదరి అనే బాధితుడు తన Motorola మొబైల్ ఫోన్ కోకపేట్ లోని రెస్టారెంట్ లో పోయింది అని, తదుపరి నార్సింగి పోలీసు స్టేషన్ లో ధరఖాస్తు ఇచ్చాను అని తెలిపి, చాలా కాలం అయిపోయిందని, ఇక అది దొరకదని భావించానని తెలిపారు. అయితే పోలీసులు అకస్మాత్తుగా ఫోన్ చేసి తన ఫోన్ దొరికిందని చెప్పడంతో ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు.

మెదక్ కు చెందిన మహమ్మద్ ముఖిబ్ అనే బాధితుడు తాను కూకట్పల్లి లో Zomato & Swiggy లో పనిచేసుకుంటూ ఉండేవాడు అని తెలిపి, ఒక సంవత్సరం క్రితం కూకట్పల్లి లోని Alsaba హోటల్ వద్ద tea త్రాగే సమయం లో నయొక్క ఫోన్ అక్కడ మరిచిపోయాను, కొద్ది సేపటికి మరలా వచ్చి చూసే సరికి నా యొక్క ఫోన్ అక్కడ లేదు, వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది, ఆ సమయం లో నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు మరియు వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు అని తెలిపాడు మరియు ఆ ఫోన్‌లో తన బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఉండటంతో ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమోనని భయపడ్డామని చెప్పారు. అయితే సైబరాబాద్ పోలీసులు కృషి చేసి తన ఫోన్‌ను తిరిగి అందజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.

బిహార్ కు చెందిన మరో బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, Sattva Knowledge City లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న సమయం లో తన office ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు, తదుపరి నేను రాయదుర్గం పోలీసులకు దరఖాస్తు ఇవ్వగా, మీ ఫోన్ తప్పకుండ దొరుకుతుంది అని నాకు ధైర్యo చెప్పారు, అయితే CCS పోలీసులు అకస్మాత్తుగా ఫోన్ చేసి తన ఫోన్ దొరికిందని చెప్పడంతో ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు మరియు సైబరాబాద్ పోలీసులకు కృత్జ్ఞతలు తెలియజేశాడు.
ఈ కార్యక్రమం లో క్రైమ్స్ డీసీపీ ఎ. ముత్యం రెడ్డి, క్రైమ్స్ ఏసీపీ వై. నాగేశ్వర్ రావు మరియు S. వెంకటేష్, మరియు ఇన్‌స్పెక్టర్లు P. జగదీశ్వర్, సీసీఎస్ కుకట్‌పల్లి, G. సత్యనారాయణ, సి‌సి‌ఎస్ కుత్బుల్లాపూర్, S. విజయ్. సీసీఎస్ శేరిలింగంపల్లి, G. మురలి కుమార్, సీసీఎస్ నార్సింగి, తధితరలు పాల్గొన్నారు.

🚨 KYC UPDATE? STOP. VERIFY FIRST.Received a message asking you to update your KYC through a link? Don’t click it blindly...
16/09/2026

🚨 KYC UPDATE? STOP. VERIFY FIRST.

Received a message asking you to update your KYC through a link? Don’t click it blindly. Cyber fraudsters often use fake KYC expiry messages to steal your banking details, OTPs and passwords.
🔹 Use only your bank’s official website or app for KYC updates.
🔹 Never share your OTP, PIN or password.
🔹 Complete KYC only through official bank channels.
🔹 If you suspect cyber fraud, report it immediately at 1930.

🛡️ Stay Alert. Stay Safe. Stay Cyber Smart.

జాతీయ ఇంజినీర్స్‌ దినోత్సవ శుభాకాంక్షలుదేశ అభివృద్ధికి తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యాలతో కొత్త మార్గాలను నిర్...
15/09/2026

జాతీయ ఇంజినీర్స్‌ దినోత్సవ శుభాకాంక్షలు

దేశ అభివృద్ధికి తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యాలతో కొత్త మార్గాలను నిర్మిస్తున్న ఇంజినీర్లందరికీ జాతీయ ఇంజినీర్స్‌ దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳

మహనీయుడు సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య గారి సేవలు, కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం.

🚫 DRUGS DESTROY — CHOOSE LIFEDrugs don’t just harm your health — they can destroy your future, relationships, dreams and...
15/09/2026

🚫 DRUGS DESTROY — CHOOSE LIFE

Drugs don’t just harm your health — they can destroy your future, relationships, dreams and peace of mind.

Say NO to drugs.
Protect your health. Value your family. Chase your dreams. 💙
Let’s build a Drug-Free Cyberabad and a stronger tomorrow together.

📞 See something? Report it! Dial 1908

🪔 వినాయక చవితి శుభాకాంక్షలు 🪔విఘ్నాలను తొలగించి..అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుంటూ.. 🙏🐘 విఘ్నేశ్వరుని ఆశీస...
14/09/2026

🪔 వినాయక చవితి శుభాకాంక్షలు 🪔

విఘ్నాలను తొలగించి..
అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి కలగాలని కోరుకుంటూ.. 🙏
🐘 విఘ్నేశ్వరుని ఆశీస్సులతో
మీ కుటుంబంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ...
వినాయక చవితి శుభాకాంక్షలు! 🌺✨

13/09/2026

Weekend-Special Drunk & Drive Checking’s by Cyberabad Traffic Police

Cyberabad Traffic Police (CTP) conducted a special drunk driving enforcement drive over the weekend, resulting in the apprehension of 292 offenders.

The vehicle-wise breakdown of the cases is as follows:
Two wheelers: 240
Three wheelers: 12
Four wheelers: 40
Heavy Vehicles: 00

Offenders were categorized based on their Blood Alcohol Concentration (BAC) levels:
248 offenders had BAC levels ranging from 36 mg/100 ml to 200 mg/100 ml
30 offenders had BAC levels ranging from 201 mg/100 ml to 300 mg/100 ml
14 offenders had BAC levels ranging from 301 mg/100 ml to 550 mg/100 ml

All the offenders will be produced before the Hon’ble Court.
Cyberabad Police reiterate that driving under the influence of alcohol is a serious offence. If anyone is found to be driving in an inebriated condition and causes a fatal accident, such individuals will be booked under Section 105 of the Bharatiya Nyaya Sanhita, 2023 (Culpable Homicide Not Amounting to Murder). The maximum punishment under this section is 10 years of imprisonment along with a fine.

In the last Week (07.09.2026 to 12.09.2026)
Total 681 DD cases were disposed in the Hon’ble courts, in which
(18) person got _Fine + Jail,
(07) persons got _Fine+ social service,
(656) persons got Fine only.

Address

Telecomnagar, Gachibowli
Hyderabad
500032

Alerts

Be the first to know and let us send you an email when Cyberabad Police Commissionerate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Cyberabad Police Commissionerate:

Shortcuts

Share