03/06/2026
*యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలి*
*రోషన్ కుమార్ సిన్హా* పిలుపు
ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా పిలుపునిచ్చారు. ఈ రోజు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరుగుతున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా *ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ రోషన్ కుమార్ సిన్హా*. మాట్లాడుతూ దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా సంక్షోభం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు ఉద్యోగాల పెరుగుదల, పెరుగుతున్న ఫీజులు, సామాజిక అసమానతలు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు .
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, యువతను మోసం చేసిందన్నారు . పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు . కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీలు భర్తీ కాకుండా , ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను అమలు చేస్తోందన్నారు . రైల్వేలు, రక్షణ రంగం, బ్యాంకులు, బీమా సంస్థలు, విద్యా రంగంలో ప్రైవేటీకరణ వేగవంతం చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు . విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్య, మధ్యతరగతి విద్యార్థులపై భారంగా మారాయన్నారు . ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
దేశంలో యువత ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందుకే ఇటీవల వివిధ రాష్ట్రాలలో ప్రజలు బీజేపీ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు . నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్యా-ఉపాధి సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారని,
ఈ పరిస్థితుల్లో శాంతి, అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం అనే ఏఐవైఎఫ్ సిద్ధాంతాలతో యువతను సంఘటితం చేసి, ఉద్యోగ హక్కు, విద్య హక్కు, సామాజిక న్యాయం, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత విస్తృతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
అదే విధంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర*. మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, రైల్వేలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్పొరేట్ దోపిడీని అరికట్టాలని, విద్య, ఉద్యోగాలలో సామాజిక న్యాయం అమలు చేయాలని, యువత సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉద్యమాలను నిర్మించేందుకు ఏఐవైఎఫ్ కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సమావేశం పిలుపునిస్తోందన్నారు.
*AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో సెప్టెంబర్ 8,9 తేదీలలో నిర్వహించాలని తీర్మానించడం జరిగింది*.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు, లింగం రవి, టి. సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలకృష్ణ, మొగిలి లక్ష్మణ్, పి. శివ కుమార్, ఎల్లంకి మహేష్, శేఖర్, రాజ్ కుమార్, మహేష్, ఆంజనేయులు, నయీమ్, హేమంత్, వెంకటేష్, మధుకర్, భాను పాల్గొన్నారు.