28/05/2022
తెలంగాణ జాతి గర్వించదగిన గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారు మంత్రి శ్రీ V Srinivas Goud గారు
చరిత్ర పరిశోధనలో, సాహిత్య రచనలో, కవితా సంకలనాల్లో, సామాజిక వేత్త గా, పత్రిక అధినేతగా కూడా బహుముఖీనమైన పాత్ర పోషించిన సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ జాతి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన తేజోమూర్తి అని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు కీర్తించారు.
రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, గోల్కొండ పత్రిక స్థాపన వంటి ఎన్నో అంశాల ద్వారా తెలంగాణ జాతిని జాగృతం చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని తన కలం ద్వారా, పరిశోధన ద్వారా లోకానికి అందించిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి గారు, వారి జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూన్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సంవత్సరం కూడా సురవరం గారి 126వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు సాంస్కృతిక శాఖ సంచాలకులను ఆదేశించారు.
శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి 126 వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ పైన ఉన్న వారి విగ్రహానికి రేపు ఉదయం 9 గంటలకు సురవరం కుటుంబ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి పూలమాల వేసి నివాళులర్పించి ...జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా సురవరం ప్రతాపరెడ్డి గారిని, వారి కృషిని గౌరవించేవిధంగా ఘనంగా వేడుకలు నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన కథలపై షార్ట్ ఫిలిం పోటీలని నిర్వహించడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం పోటీలో గెలుపొందిన లఘు చిత్రాల కు నగదు పురస్కారాలను మంత్రిగారు అందిస్తారు. ప్రథమ ఉత్తమ లఘుచిత్రానికి 50 వేల రూపాయలు, ద్వితీయ ఉత్తమ లఘుచిత్రానికి 40 వేల రూపాయలు, తృతీయ ఉత్తమ లఘుచిత్రానికి 30 వేల రూపాయలు, వ్యక్తిగత విభాగాల్లో ఉత్తమ దర్శకుడు - ఉత్తమ ఛాయాగ్రాహకుడు - ఉత్తమ సంగీత దర్శకుడు - ఉత్తమ ఎడిటర్ లకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, ప్రత్యేక బహుమతులు ముగ్గురికి ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు చొప్పున మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు అవార్డుల బహుకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
అలాగే , సురవరం ప్రతాపరెడ్డి గారు ఏఏ రంగాలలో కృషి చేశారో ఆయా రంగాలలో దశాబ్దాల కాలం నుంచి విశేష కృషి చేసిన ఐదుగురు మహనీయులకు (పద్మభూషణ్ డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, డా. ఈమని శివనాగిరెడ్డి, డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా. ఆర్. శేషశాస్త్రి, డా. జుర్రు చెన్నయ్య) కూడా గౌరవ పురస్కారాలు అందచేయడం జరుగుతుంది. ఇది సురవరం ప్రతాపరెడ్డి గారిని వారి సేవలను స్మరించుకోవడం ఒకవైపు అయితే వారి సేవలను కొనసాగించడానికి మరొకసారి దీక్ష పూనడం లాంటిదని, వారి దీక్ష , వారి సేవలు నిరంతరం ఈ తరానికి, రాబోయే తరాలకి కూడా స్ఫూర్తివంతంగా ఉంటాయని గౌరవ మంత్రివర్యులు గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుకలకు సురవరం ప్రతాపరెడ్డి గారి అభిమానులు, కవులు, సాహితీవేత్తలు, రచయితలు అందరూ పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి విచ్చేసి ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపునిచ్చారు.