Eatala Janasena

Eatala Janasena Eatala Janasena - EJS

05/08/2026

ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు.

ఈ సందర్భంగా కొంపల్లి ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో యాక్సిడెంట్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. కాబట్టి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులు గుంతలు లేకుండా చూడాలని నితిన్ గడ్గరీ గారిని విజ్ఞప్తి చేశారు.

పదిరోజుల్లో సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆదేశాలు జారీ చేశారు అని అన్నారు.

ఈ సమావేశంలో ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు ఉన్నారు.

05/08/2026

ఢిల్లీ : కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు.

ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ..

🔸హైదరాబాద్ జనాభా 30 లక్షలు ఉన్న సమయంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. కానీ, నేడు నగరం 2 కోట్లకు పైగా జనాభాతో విస్తరించినా, ఇప్పటికీ చెత్తనంతటినీ ఆ ఒక్క ప్రాంతంలోనే వేస్తున్నారు.

🔸రోజుకు దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడకు చేరడంతో కొండల్లా పేరుకుపోతోంది. దీనివల్ల 40 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ సంపాదనంతా ఆసుపత్రుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

🔸ఈ తీవ్రమైన సమస్యపై కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్‌ గారిని కలిసి విజ్ఞప్తి చేశాం అని తెలిపారు.

🔸జవహర్ నగర్‌లో ఒక్క కిలో చెత్త కూడా వేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, గాలి, నీటి కాలుష్యం లేని 'జీరో పొల్యూషన్' పద్ధతుల్లో చెత్తను రీసైకిల్ చేయాలని కోరారు.

🔸ఢిల్లీ లాంటి మహానగరాల్లో అనుసరిస్తున్న చెత్త నిర్వహణ (వేస్ట్ మేనేజ్‌మెంట్) విధానాలను హైదరాబాద్‌లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.

🔸వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కెపాసిటీ కేవలం 3,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కాగా, నిత్యం 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని.. అసలు ఆ ప్లాంట్ సరిగ్గా పనిచేస్తోందో లేదో పర్యవేక్షించే నాథుడే లేడని విమర్శించారు.

🔸ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, గతంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసు వేశారని గుర్తుచేశారు. కానీ, ఆయన సీఎం అయినప్పటికీ ప్రజల రాత మారలేదని, ఫలితం శూన్యంగా మిగిలిపోయిందని విమర్శించారు.

ఈ సమావేశంలో ఎంపీలు శ్రీమతి డీకే అరుణ గారు, శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శ్రీ గోడం నగేష్ గారు ఉన్నారు.

01/08/2026
ఢిల్లీ,తేది:30.07.2026.కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ Rajnath Singh  గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగిరి పార్...
30/07/2026

ఢిల్లీ,
తేది:30.07.2026.

కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ Rajnath Singh గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ Eatala Rajendar గారు.
పలు అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

🔸సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కోరారు.
🔸కౌకురు దర్గా నుండి బిట్స్ పిలాని వరకు డిఫెన్స్ భూములలో రోడ్డు నిర్మాణం, విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరారు.
🔸దీనితో పాటు డిఫెన్స్ ఏరియాలో పలు రోడ్ల విస్తరణ మరియు సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు.
🔸తాజాగా రాజనాథ్ సింగ్ గారి తెలంగాణ పర్యటన గురించి ఇరువురి మధ్య చర్చకు వచ్చింది.
🔸బీజేపీ తెలంగాణలో పట్టు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని దీనిని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.
🔸కేంద్ర నాయకత్వం సహకారం, రాష్ట్ర నాయకుల సమన్వయంతో ఈసారి తెలంగాణ గడ్డపై కషాయ జెండా ఎగురవేస్తామని ఈటల రాజేందర్ గారు, రాజ్ నాథ్ సింగ్ గారికి తెలిపారు.

30/07/2026

ఢిల్లీ,
తేది:30.07.2026.

కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ ( Rajnath Singh ) గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు.
పలు అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

🔸సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కోరారు.
🔸కౌకురు దర్గా నుండి బిట్స్ పిలాని వరకు డిఫెన్స్ భూములలో రోడ్డు నిర్మాణం, విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరారు.
🔸దీనితో పాటు డిఫెన్స్ ఏరియాలో పలు రోడ్ల విస్తరణ మరియు సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు.
🔸తాజాగా రాజనాథ్ సింగ్ గారి తెలంగాణ పర్యటన గురించి ఇరువురి మధ్య చర్చకు వచ్చింది.
🔸బీజేపీ తెలంగాణలో పట్టు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని దీనిని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.
🔸కేంద్ర నాయకత్వం సహకారం, రాష్ట్ర నాయకుల సమన్వయంతో ఈసారి తెలంగాణ గడ్డపై కషాయ జెండా ఎగురవేస్తామని ఈటల రాజేందర్ గారు, రాజ్ నాథ్ సింగ్ గారికి తెలిపారు.

30/07/2026

Power of togetherness! 🪷

గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరఃగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమఃప్రజలందరికీ.. గురు పూర్ణిమ శుభాకాంక్షల...
29/07/2026

గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః

ప్రజలందరికీ..
గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Eatala Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Eatala Janasena:

Shortcuts

Share