Telangana Congress

03/08/2026

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేటీఆర్ గారు ప్రయత్నించడం సరికాదు. గతంలో కేసీఆర్ గారు ఇంజినీరింగ్ విద్య, విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ముందుగా గుర్తు చేసుకోవాలి. యువతను, నిరుద్యోగులను నిరాశపరిచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలను విస్తరించింది. సభలు, ప్రెస్‌మీట్ల పేరుతో యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలి.

శ్రీ జక్కిడి శివచరణ్ రెడ్డి గారు
రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ యువజన కాంగ్రెస్.










03/08/2026

కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు ద్వారా, అధికారం పోయినా ఆయనలో అహంకారం తగ్గలేదని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు మరియు నైపుణ్యాల గురించి ఒక తండ్రిలా మంచి మాటలు చెబితే, కేటీఆర్ దాన్ని వక్రీకరించి మాట్లాడటం సరైన పద్ధతి కాదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం లక్షా 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెండున్నర ఏళ్లలోనే దాదాపు లక్ష ఉద్యోగాల వైపు వేగంగా అడుగులు పడ్డాయి. గతంలో 'మిషన్ భగీరథ' నుండి వందలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేసిన విషయాలను గుర్తుంచుకోవాలి. పెద్ద చదువులు ఉండటం కంటే మాట్లాడే తీరులో సంస్కారం, నిజాయితీ ఉండటం ముఖ్యం అని గ్రహించి కేటీఆర్ గారు ఇప్పటికైనా అహంకారం పక్కన పెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

శ్రీమతి ఇందిరా శోభన్ గారు
మహిళా కాంగ్రెస్ నాయకురాలు








03/08/2026

కేటీఆర్... ముందు మీ భాష మార్చుకోండి, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి.. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏంటా మాటలు? హోదాకి ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజల విశ్వాసంతో, సొంత కృషితో ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్న నాయకుడిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. గత పాలనలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన యువతకు, పేపర్ లీకేజీలతో నష్టపోయిన నిరుద్యోగులకు, ఆవేదనతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాల్సింది మీరే. హుందాతనం లేని మీ మాటలను తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదు.

శ్రీ ఈరవర్తి అనిల్ గారు,
టీజీఎండీసీ చైర్మన్.





03/08/2026

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కానీ, ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ పార్లమెంట్ కు రావడం లేదు. వాళ్ళు భయంతోనే సమావేశాలకు హాజరు కావట్లేదు. వాళ్లకు చట్ట సభలకు వచ్చే ధైర్యం లేదు కానీ, 15 ఏళ్ళ చిన్నారిపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ బాలికను ఆన్ లైన్ లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెద్ద పెద్ద రేపిస్టులకు, నేరస్థులకు బీజేపీ కొమ్ము కాస్తోంది. అలాంటి వాళ్ళకే టికెట్స్ ఇచ్చి గెలిపిస్తోంది.

శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు.









రాష్ట్రంలో కొత్తగా మరో 54 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు తొలిదశలో ఇప్పటికే 65 ఐటీఐలను ఏటీసీలుగా ఉన్నతీకరణ రెండో దశలో మర...
03/08/2026

రాష్ట్రంలో కొత్తగా మరో 54 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు

తొలిదశలో ఇప్పటికే 65 ఐటీఐలను ఏటీసీలుగా ఉన్నతీకరణ

రెండో దశలో మరో 54 ఏటీసీలకు ప్రభుత్వం అనుమతి

మొత్తం 119 ఏటీసీలతో ప్రతి నియోజకవర్గానికి ఒక కేంద్రం

గ్రామీణ ప్రాంతాల యువతకు అత్యాధునిక టెక్నాలజీ కోర్సులు
Vivek Venkatswamy



#𝖲𝗄𝗂𝗅𝗅𝖣𝖾𝗏𝖾𝗅𝗈𝗉𝗆𝖾𝗇𝗍




రెవెన్యూ శాఖకు నూతన భవనాలు99 తహసీల్దార్, 10 ఆర్డీవో కార్యాలయాల నిర్మాణంభవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభంఒక్కో...
03/08/2026

రెవెన్యూ శాఖకు నూతన భవనాలు

99 తహసీల్దార్, 10 ఆర్డీవో కార్యాలయాల నిర్మాణం

భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఒక్కో భవనం రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మాణం.

6 నెలల్లో అన్ని నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యం
Komatireddy Venkat Reddy






03/08/2026

బీహార్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ పరాజయం చవిచూసింది. ఈ ఉపఎన్నిక ఫలితం రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పాలన సాగించాలని, నియంతృత్వ ధోరణులు కొనసాగవని ఈ తీర్పు స్పష్టం చేసింది.

శ్రీ పొన్నం ప్రభాకర్ గారు,
బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రివర్యులు.
Ponnam Prabhakar



నిమ్స్‌ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందనలురెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్త...
03/08/2026

నిమ్స్‌ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందనలు

రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి

నిమ్స్ డైరెక్టర్, వైద్యులు, నర్సింగ్, ఓటీ బృందానికి సీఎం గారు అభినందనలు

90%కిపైగా శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితం

వైద్య రంగంలో మరిన్ని మైలురాళ్లు సాధించాలని సీఎం గారు ఆకాంక్ష
Anumula Revanth Reddy
Damodar Rajanarsimha Cilarapu










03/08/2026

ఒకప్పుడు హైడ్రా అవసరమేంటని ప్రశ్నించినవారే, నేడు హైడ్రా లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచిస్తున్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడుతూ నగరాన్ని భవిష్యత్ తరాలకు సురక్షితంగా తీర్చిదిద్దుతోంది. కేవలం రెండేళ్లలో రూ.1.20 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, 1,810 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడం, చెరువుల పరిధిలో 454 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవడం, 1,378 అక్రమ నిర్మాణాలను తొలగించడం హైడ్రా పనితీరుకు నిదర్శనం. నగర భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతోనే ఇలాంటి మార్పు సాధ్యమైంది.









03/08/2026

చదువుతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తోంది ప్రజా ప్రభుత్వం. రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు) ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ఏర్పాటును వేగవంతం చేసింది. తొలి దశలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం, రెండో దశలో మరో 54 ఏటీసీలకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.
Anumula Revanth Reddy
Vivek Venkatswamy



#𝖲𝗄𝗂𝗅𝗅𝖣𝖾𝗏𝖾𝗅𝗈𝗉𝗆𝖾𝗇𝗍







Address

Gandhi Bhavan Nampally
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Telangana Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Congress:

Shortcuts

Share