Telangana Congress

Telangana Congress Telangana Pradesh Congress Committe

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ నవీన్ యాదవ్ గారు పోలింగ్ తేదీ : నవంబర్ 11హస్తం గుర్తుకే మన ఓటు
09/10/2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
శ్రీ నవీన్ యాదవ్ గారు

పోలింగ్ తేదీ : నవంబర్ 11

హస్తం గుర్తుకే మన ఓటు

రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌.Free electricity supply to Ganesh pandals and Durga...
25/08/2025

రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌.

Free electricity supply to Ganesh pandals and DurgaDevi pandals across the state.

బెంగుళూరులో జరుగుతున్న ఓబీసీ సలహా మండలి సమావేశంలో చైర్మన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యా తో టీపీసీసీ అధ్యక్షులు మహేష...
16/07/2025

బెంగుళూరులో జరుగుతున్న ఓబీసీ సలహా మండలి సమావేశంలో చైర్మన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యా తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ బిసి ప్రతినిధులు

తెలంగాణ యువజన కాంగ్రెస్ విస్తార కార్యనిర్వాహక సమావేశం జరగనుందని మేము మీకు తెలియజేస్తున్నాము:   *తేదీ:* ఏప్రిల్ 29  *వేది...
26/04/2025

తెలంగాణ యువజన కాంగ్రెస్ విస్తార కార్యనిర్వాహక సమావేశం జరగనుందని మేము మీకు తెలియజేస్తున్నాము:
*తేదీ:* ఏప్రిల్ 29
*వేదిక:* SVL Arena , నాగోల్ ( https://maps.app.goo.gl/iHXPBW6TTKZJLNWD7?g_st=iw)
*సమయం:* సాయంత్రం 4 గంటలకు
ఈ సమావేశాన్ని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *జక్కిడి శివచరణ్ రెడ్డి* గారు నిర్వహిస్తున్నారు మరియు *శ్రీ కృష్ణ అల్లవారు గారు *, భారత యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ - *శ్రీ ఉదయ్ చిబ్ గారు*, *భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు* ఇతర సీనియర్ నాయకులు ముఖ్య అతిథులు గా వస్తున్నారు.
ఇది రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం కాబట్టి, కేటాయించబడిన అన్ని జిల్లా ల ఇంఛార్జ్‌లు జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని, వీరి హాజరును నిర్ధారించుకోవాలని అభ్యర్థించారు: - జిల్లా ఉపాధ్యక్షులు
- జిల్లా ప్రధాన కార్యదర్శులు
- ⁠జిల్లా కార్యదర్శులు
- ⁠అసెంబ్లీ అధ్యక్షులు
- ⁠మండల అధ్యక్షులు
- ⁠ డివిజన్ మరియు మునిసిపాలిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హాజరై ఈ సమావేశం విజయవంతం కావడానికి మీ సహకారం చాలా అవసరం...

19/04/2025

పల్లెల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం.
17/04/2025

పల్లెల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు
రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం.

10.04.2025 ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం◉ సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.◉ గల్ఫ్ కార్మికుల ...
11/04/2025

10.04.2025

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం

◉ సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.

◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం.

◉ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు.

కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు. గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు.

సీఎం హామీ నేపథ్యంలో...

గత సంవత్సరం ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది.

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పన తో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.

గాంధీ భవన్ | TPCC విస్తృత స్థాయి సమావేశంపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.• ...
28/02/2025

గాంధీ భవన్ | TPCC విస్తృత స్థాయి సమావేశం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.

• ఏఐసీసీ మాజీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీకి కృతజ్ఞతలు
• స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం పై చర్చ
• కుల గణన, ఎస్సీ వర్గీకరణ పై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం

కాంగ్రెస్ ఇచ్చిన మాటపై ప్రజల నమ్మకం —

• 1 ఏట 56 వేల ఉద్యోగాలు — కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కంటే ఎక్కువ!
• రైతు రుణమాఫీ — 1 ఏట బీఆర్‌ఎస్ 10 ఏళ్ల కంటే అధికంగా!
• ఉచిత బస్సు సౌకర్యం — కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలకు అందుబాటులో!
• కుల గణన నివేదిక — అసెంబ్లీలో సమర్పణ!

సంకల్పం: అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లుదాం!
మీనాక్షి నటరాజన్ లాంటి సమర్పణతో పార్టీ కోసం శ్రమిద్దాం!

జై కాంగ్రెస్!












ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం చిన గోపతి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్...
27/01/2025

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం చిన గోపతి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా... నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

ఇవి కేవలం నాలుగు సంక్షేమ పథకాలు మాత్రమే కాదు…ఏడాదికి నలభై వేల కోట్ల బృహత్ కార్యక్రమం.
ఇది ఒక పవిత్ర దినం రోజు ప్రారంభిస్తున్నాము.

ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారత్.

ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నది…పాలకుల కోసం కాదు. గడిచిన పదేళ్లు పాలకుల పాలన…ఇది ప్రజల పాలన .. ప్రజా పాలన.గతానికీ వర్తమానానికి తేడా ఇదే.

ఇవి నాలుగు గోడల మధ్య గడీలలో ఎంపిక చేసిన పథకాలు కాదు, ఇది ప్రజల మధ్య ప్రజల కోసం ఎంపిక చేసిన పథకాలు.

ఈ పథకాలు అత్యంత ప్రజాస్వామికంగా పారదర్శకంగా ఎంపిక చేసే పథకాలు.

అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తికి పథకాలు అందిస్తాం.
దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ.

ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన ప్రతి అడుగుకు లెక్క కట్టి రైతు భరోసా ఇస్తాం.

ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒక విధాన పరమైన నిర్ణయం క్యాబినెట్ అంతా కలిసి తీసుకున్నాం.

ఏడాదికి రూ. 12,000 ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి కనీసం 20 రోజుల పని చేసిన భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.

పథకాలు అమలు కాకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది. మీరు ప్రజల్ని దోపిడీ చేశారు.. మేం ప్రజలకు పంచుతున్నాం.

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. పదేళ్ళ లో లక్ష రుణమాఫి కూడా చేయలేదు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ప్రజల కలలు నెరవేరుతున్నాయి.

పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.ప్రజా సమస్యలు తెలుసుకొని పథకాలు చేపడుతున్నాం.

ఇది మోసకారుల పాలన కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న పాలన.

పదేళ్లు పాలన చేసి ప్రజలకు అన్యాయం చేస్తుంటే.. ఆ నాడు ప్రతి పక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి ప్రతి సమస్యను తెలుసుకొని ఈరోజు ప్రజా ప్రభుత్వం లో ఆర్థిక శాఖ మంత్రి గా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తాం…ప్రతి పైసా ప్రజలకే పంచుతాం.

ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం.ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమం కోసమే తీసుకుంటాం.

ప్రజాపాలన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక...
27/01/2025

ప్రజాపాలన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది

📍చౌటుప్పల్ మండలం, మసీదు గూడెం

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...
27/01/2025

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మహాత్మ్యం గురించి ప్రస్తావిస్తూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి గారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, ఎంపీ అనిల్ యాదవ్ గారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు గారు, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, TUFIDC ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి గారు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ గార్లు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో అందరి ఉత్సాహం, భారతీయ జాతీయతపై గర్వం కనిపించింది. ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చడానికి ప్రతిజ్ఞ చేసిన ఈ ఘనమైన వేడుక, దేశ భక్తి జ్వాలలను రగిలించింది.

దళితాభ్యుదయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నేత, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపి...
26/01/2025

దళితాభ్యుదయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నేత, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు.






Address

Gandhi Bhavan
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share