Zilla Grandhalaya Samstha jogulamba Gadwal

Zilla Grandhalaya Samstha jogulamba Gadwal zgsgdl

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి...-నిరుద్యోగులు లక్ష్యాలకు అనుగుణంగా చదవాలి.-జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి.-లైబ్...
15/05/2026

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి...

-నిరుద్యోగులు లక్ష్యాలకు అనుగుణంగా చదవాలి.

-జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి.

-లైబ్రరీ డే లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

గ్రంథాలయంలోని పత్రికలు, పుస్తకాలను పాఠకులు, విద్యా ర్థులు, నిరుద్యోగులు చదివి సద్వినియోగం చేసుకోవాలని, గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూ ల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో శుక్రవారం లైబ్రరీ డే సందర్భంగా గద్వాలలోని జిల్లా గ్రంథా లయంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడారు. ముం దుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభిం చారు. లైబ్రరీలో వివిధ విభాగా లను పరిశీలించిన కలెక్టర్ విద్యా ర్థులకు,నిరుద్యోగులకుఅవసరమైన అప్డేట్ పుస్తకాలను తెప్పిస్తామ న్నారు. విద్యార్థులు ఒక కమిటీగా ఏర్పడి తమకు కావాల్సిన పుస్తకా ల లిస్ట్ రాసిఇవ్వాలన్నారు.గ్రూప్స్, బ్యాంకింగ్, టీచర్, తదితర ఉద్యో గాలకు సాధన చేస్తున్న నిరుద్యో గులు పక్కా ప్రణాళికతో లక్ష్యాలకు అనుగుణంగా చదివితే పోటీ పరీక్ష ల్లో విజయం సాధిస్తారన్నారు. ఓకే నోటిఫికేషన్ కోసం కాకుండా నిరు ద్యోగులు తాము చదివిన కోర్సుల కు రిలేటెడ్ గా ఉండే ఇతర ఉద్యో గాల కోసం కూడా సాధన చేస్తే ప్ర యోజనం ఉంటుందనీ సూచిం చారు. గ్రంథాలయ పక్కా భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తు తం నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని సమీపంలో ఉన్న పాత కోర్టు భవ నంలోకి మార్చడానికి సంబంధిత అధికారులతోమాట్లాడతానన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయంను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు. నూతన భవన నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న నిధులేకాక ఎంపీ నిధులతో పాటు కలెక్టర్ నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు. టాయిలెట్స్, ఫ్యాన్లు, లైట్లు, కం ప్యూటర్స్ అప్డేట్, ఇంటర్నెట్, ఇన్వర్టర్, తదితర సమస్యలను పలువురు నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చినందున పరి ష్కరిస్తామన్నారు. మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండడంతో అందుబాటులో ఉన్న నిధులతో త్వరలోనే నిర్మిస్తామన్నారు. గ్రంథా లయంకు వచ్చే పాఠకులు తప్పని సరిగా రిజిస్టర్లో సంతకాలు పెట్టా లని, లైబ్రరీ మెంబర్షిప్ కార్డును తీసుకొని సద్వియోగం చేసుకోవా లన్నారు. ఈ సందర్భంగా విద్యార్థు లు గ్రంథాలయంలోని వివిధ సమ స్యలపై కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ గ్రంథాలయ పరిసరాలను పరిశీ లించి మరుగుదొడ్లను శుభ్రం చేసేం దుకు స్కావెంజర్ ను నియమి స్తామన్నారు. సమీపంలోని నీటిపారుదల శాఖ కార్యాల యాన్ని సందర్శించి అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డీఈవో విజయలక్ష్మి, లైబ్రేరియన్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Address

Hyderabad

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+917989486865

Alerts

Be the first to know and let us send you an email when Zilla Grandhalaya Samstha jogulamba Gadwal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Zilla Grandhalaya Samstha jogulamba Gadwal:

Shortcuts

Share

Category