07/09/2026
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డికి ఘన నివాళి! 🚩
నిజాం నిరంకుశ పాలనపై సింహంలా గర్జించి, వెట్టి చాకిరీ విముక్తి కోసం.. దున్నేవాడికే భూమి కోసం అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు అగ్ర నాయకుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం హయత్‌నగర్ పార్టీ కార్యాలయంలో లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
సీపీఐ హయత్‌నగర్ మండల కన్వీనర్ అంబల రాములు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు.
నిజాం నవాబు మెడలు వంచి తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన తెగువ, అలాగే దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో నల్లగొండ లోక్‌సభ స్థానానికి గెలిచిన ఆయన ఘన చరిత్ర ఎప్పటికీ చిరస్మరణీయమని శేఖర్ రెడ్డి గారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ (NFIW) నాయకురాలు సుజాత, బీఓసీ (BOC) మండల అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, సామెల్, AIYF మండల కార్యదర్శి వీరన్న, ఏఐటీయూసీ (AITUC) నాయకులు ఉపేందర్, శేఖర్ తదితరులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జోహార్ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి..
కమ్యూనిస్టుల త్యాగాలు వర్ధిల్లాలి!