05/09/2026
ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…🦚
పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని, విద్యార్థులు, అధ్యాపకులు, యువతతో కలిసి శ్రీకృష్ణుడి ధర్మం, కర్తవ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక సమానత్వం వంటి విలువలపై నా ఆలోచనలు పంచుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది.
శ్రీకృష్ణుడి బోధనలు నేటి యువతకు గొప్ప మార్గదర్శకం. ధర్మం కోసం నిలబడుతూ, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తూ, దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు, శ్రేయస్సు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
🙏 అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🦚
గుజ్జ సత్యం
జాతీయ ఉపాధ్యక్షులు,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం
స్టేట్ కోఆర్డినేటర్ – బీసీ జేఏసీ