TNSF Nizamabad

TNSF Nizamabad Think! Implement!! Achieve!!!
ఆలోచన! ఆచరణ!! ఆశయ సాధన!!!

TNSF -Telugu Nadu student federation is a student wing belongs to the Telugu Desam Party, struggling for the welfare of students and their problems in the two Telugu-speaking States తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యార్థి విభాగం, రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలలో విద్యార్థుల సంక్షేమం మరియు వారి సమస్యల కోసం పోరాడుతోంది.

🌼🙏 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌼✨ "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహగురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమ...
29/07/2026

🌼🙏 గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌼

✨ "గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుహే నమః ✨

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే ప్రతి గురువుకూ హృదయపూర్వక వందనాలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు!




🌿🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ...
25/07/2026

🌿🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌿

ఈ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
🕉️ ఓం నమో నారాయణాయ 🕉️

#తొలిఏకాదశి #శ్రీమన్నారాయణ

నేటి ప్రధాన దినపత్రికలలో
24/07/2026

నేటి ప్రధాన దినపత్రికలలో

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాం...
24/07/2026

నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం - వెంటనే పూర్తి వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాండ్.

నిజామాబాద్ నగర ప్రజలు ఎదురుచూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పనులు ప్రారంభమై చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2022 నవంబర్ 27న ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. 2025 నాటికి పూర్తవుతుందని చెప్పినా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.

ఈ బ్రిడ్జి పూర్తయితే నిజామాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ నియోజక వర్గం ఇంచార్జీలు బొబ్బ నరసింహారావు, కర్రె వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రేంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, యువ నాయకులు శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, దంతాల ఆనంద్, కల్లెడ గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు బాల గంగాధర్, కృష్ణారెడ్డి, చిలుక సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, దత్త కృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, లవంగా రాజు, నటరాజ్, హరిష్ చౌదరి, రషీదా, లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.








23/07/2026

*నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో తీవ్ర జాప్యం – వెంటనే పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున డిమాండ్.*

*ఈ కార్యక్రమం దేగాం యాదగౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్కిని నర్సింలు గారు బ్రిడ్జి పనులను పర్యవేక్షించడం జరిగింది.*

*ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నర్సింలు గారు మాట్లాడుతూ..*

*పీసీసీ మహేష్ కుమార్ పై బక్కిని నర్సింలు ఫైర్..*

*ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా, మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.*

*ఇప్పుడు ఆగస్టు 31 లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికి కూడా నిధులు విడుదల చేస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం పేపర్లకే పరిమితం అవుతుంది కానీ పనిలో ఎలాంటి మార్పు కనబడటం లేదు, చిత్తశుద్ధి ఉంటే సమయానికి పనులు పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు.*

నిజామాబాద్ నగర ప్రజలు మరియు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు, నిత్యం హైదరాబాద్ వెళ్ళే వేలాది మంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం తీవ్ర జాప్యానికి గురికావడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నగరంలోని వేలాది మంది ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గి, రాకపోకలు సులభతరం అవుతాయి. అయితే పనులు ప్రారంభమై దాదాపు ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం బాధాకరం.

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2022 జనవరి 27న పనులు ప్రారంభమైనప్పటికీ, అనంతరం పనులు పలుమార్లు నిలిచిపోయాయి. 2022 సెప్టెంబర్‌లో మళ్లీ పనులు ప్రారంభించినా, ఆశించిన వేగంతో కొనసాగలేదు. 2025 మే వరకు పనులు పూర్తవుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ, ఆ గడువు కూడా దాటిపోయింది. ప్రస్తుతం 2026 ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ, ప్రజలకు ఆ హామీపై విశ్వాసం తగ్గుతోంది.
ఇప్పటివరకు సుమారు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సమాచారం. మిగిలిన పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు ఈ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. కనెక్టివిటీ రోడ్డు సరిగా లేక, దుమ్ము, బురద, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులు, అత్యవసర వాహనాలు కూడా ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజల సమయం, ఇంధనం వృథా అవుతోంది.

ఈ ప్రాజెక్టు ఆలస్యానికి అసలు కారణాలను ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. నిర్మాణ పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? ఎలాంటి సాంకేతిక, పరిపాలనా లేదా నిధుల సమస్యలు ఉన్నాయి? అనే విషయాలపై అధికారిక ప్రకటన విడుదల చేయాలి.

నగర అభివృద్ధి కోసం అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును ఇకపై నిర్లక్ష్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నర్సింలు ప్రజల తరుపున డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వo దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేసి మిగిలిన పనులను వేగవంతం చేయాలి.

ప్రజల సహనాన్ని పరీక్షించేలా పనులు సాగడం బాధాకరం. ప్రతి ఎన్నికల సమయంలో ఈ బ్రిడ్జి గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, ఆ హామీలు కార్యరూపం దాల్చకపోవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది.

మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పూర్తయితే నిజామాబాద్ నగర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా నగర అభివృద్ధికి కొత్త ఊపిరి వస్తుంది. వ్యాపార, విద్య, వైద్య రంగాలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
అందువల్ల సంబంధిత అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున విజ్ఞప్తి చేస్తుంది, ఈ ప్రాజెక్టుపై ప్రతినెలా పురోగతి నివేదిక విడుదల చేసి పారదర్శకత పాటించాలని కూడా కోరుతున్నారు.

"ప్రజల కలల బ్రిడ్జి ఇక ఆలస్యం కాకూడదు – వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి" అనే నినాదంతో నగర ప్రజలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ తరుపున కోరుతున్నారు.

అనంతరం పార్లమెంట్ కన్వీనర్ దేగాం యదాగౌడ్ గారు మాట్లాడుతూ గడువులోగా బ్రిడ్జిని పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ నియోజక వర్గం ఇంచార్జీలు బొబ్బ నరసింహారావు, కర్రె వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రేంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, యువ నాయకులు శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, దంతాల ఆనంద్, కల్లెడ గంగాధర్, మాజీ మండల అధ్యక్షులు బాల గంగాధర్, కృష్ణారెడ్డి, చిలుక సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, దత్త కృష్ణ, పట్టణ సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, లవంగా రాజు, నటరాజ్, హరిష్ చౌదరి, రషీదా, లక్ష్మీ యాదవ్, విజయలక్ష్మి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో   మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి  నత్త నడకన నడుస్తున్న నిర్మాణ పనులు త్...
21/07/2026

తెలంగాణ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి నత్త నడకన నడుస్తున్న నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని నిరసిస్తూ ఒక్కరోజు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది, *ఈ కార్యక్రమానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బక్కిని నర్సింలు గారు ముఖ్య అతిథిగా వచ్చి బ్రిడ్జి పనులు పర్యవేక్షించడం జరుగుతుంది,* అదే రోజు సంబధిత మంత్రులకు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.

*ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము.*

తేదీ 23:07:2026, గురువారం
ఉదయం : 10:00 గంటలకు
మాధవనగర్ సాయిబాబా ఆలయం

ఇట్లు
దేగాం యదాగౌడ్
కన్వీనర్
నిజామాబాద్ పార్లమెంట్.

🌸 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! 💐తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ...
02/06/2026

🌸 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! 💐

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ 🙏, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 🎉

అభివృద్ధి 📈, సంక్షేమం 🤝, సుసంపన్నత 🌾 దిశగా తెలంగాణ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

జై తెలంగాణ! ✊💖






జై తెలుగుదేశం! జై తెలంగాణ!! 💛⚡• మహానాడు - 2026 వార్షిక మహోత్సవ ఆహ్వానం! 📜• నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ శ్రే...
26/05/2026

జై తెలుగుదేశం! జై తెలంగాణ!! 💛⚡

• మహానాడు - 2026 వార్షిక మహోత్సవ ఆహ్వానం! 📜

• నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం! 🙌

• అందరం కలిసికట్టుగా తరలివచ్చి మన మహానాడును ఘనంగా విజయవంతం చేద్దాం!

*📌 ముఖ్య గమనిక: కార్యక్రమానికి వచ్చే వారు తప్పనిసరిగా మీ పార్టీ సభ్యత్వ కార్డు (Membership Card) తీసుకొని రావలెను.*

📍 సమావేశ స్థలం (Venue):
తెలుగుదేశం పార్టీ కార్యాలయం,
మొదటి అంతస్తు, తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్,
చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, నిజామాబాద్.

⏰ సమయం: ఉదయం 09:00 గంటలకు.

తెలంగాణ తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలి రా!! 🔥

✍️ సచిన్ పటేల్
TNSF నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు (బోధన్).


ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార...
20/04/2026

ఈరోజు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా, బోధన్ నియోజకవర్గం, మోస్రా మండలంలోని చింతకుంట గ్రామంలో ఉన్న
వృద్ధుల అనాధాశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది!






రాష్ట్ర నిర్మాణ శిల్పి, దూరదృష్టి గల నాయకుడు, నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వ...
20/04/2026

రాష్ట్ర నిర్మాణ శిల్పి, దూరదృష్టి గల నాయకుడు, నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐

అభివృద్ధి, పారదర్శక పాలన, సాంకేతికతకు మార్గదర్శిగా నిలిచిన మీ నాయకత్వం మరింత ఎత్తులకు చేరాలని కోరుకుంటున్నాం. 🚀






Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when TNSF Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TNSF Nizamabad:

Shortcuts

Share