iTDP Guntupalli

iTDP Guntupalli Jai CBN Jai Devineni Uma

దేవినేని ఉమా , తెలుగు దేశం పార్టీ లో కార్యకర్తలలో ఆయన్ని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తది అలానే స...
29/03/2026

దేవినేని ఉమా , తెలుగు దేశం పార్టీ లో కార్యకర్తలలో ఆయన్ని చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తది అలానే సొంత కుటుంబం లో మనిషి కలిసాము అనే అనుభూతి వస్తది కార్యకర్తలలో..

ఏ రోజు ఏ అవసరం అయినా కార్యకర్త ఫోన్ చేస్తే తన సొంత సమస్య గా భావించి శాయశక్తుల శ్రమించి సమస్య తీరేదాకా వదలకుండా పని పూర్తి చేసి పంపించటం ఆయన గొప్ప తనం ..

పార్టీ పుట్టిన రోజు ఆయన పుట్టిన రోజు ఒకటే అవ్వటం ఆయన పూర్వ జన్మ సుకృతం..

ఆయన కి చంద్రబాబు గారు అంటే ప్రాణం, నారా నందమూరి కుటుంబాల తర్వాతే ఆయన కుటుంబం ఆయనికి..

20 ఏళ్లుగా MLA చేసిన , 5 ఏళ్ళు మంత్రి చేసిన నిజాయితీ గా వుంటూ పార్టీ కి అధినాయుకుడుకి నమ్మకం గా వుంటూ అవినీతి కి ఆమడదూరం లో వుండటం ఆయన గొప్పతనం.పురాణాల్లో హనుమంతుడు గురించి చవిదాం కానీ నిజజీవితం లో చంద్రబాబు లాంటి రాముడు కి దేవినేని లాంటి హనుమంతుడు దొరకటం అదృష్టం ..

అధికారం లో వున్నప్పుడు పదవులు వచ్చిన రాకపోయినా అధికారం లేనప్పుడు మాత్రం జగన్ కి టార్గెట్ మాత్రం ఆయనే..13 రోజులు జైల్ లో పెట్టి ఇప్పటికీ వారానికి రెండేసి సార్లు కోర్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు…

కార్యకర్త అంటే పార్టీ కి కుటుంబానికి కట్టు బానిస లాగా వుండాలి .. దేవినేని ఉమా గారి లాగా ..

మీరు ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాం సర్

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!ధర్మనిబద్ధతకు, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ ...
27/03/2026

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!

ధర్మనిబద్ధతకు, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. తన కుటుంబ సౌఖ్యంకన్నా ప్రజల ఆనందానికే ప్రాధాన్యత ఇచ్చి, ప్రజాబీష్ట పాలనతో యుగయుగాల పాటు స్ఫూర్తిగా నిలిచిన మహానుభావుడు.

ఆ సుగుణాభిరాముడు అవతరించిన పవిత్ర దినమైన శ్రీరామనవమి సందర్భంగా, ఆయన కళ్యాణ ఘట్టాన్ని మనం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటాం.

సీతారాముల దివ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సదా ఉండాలని కోరుకుంటూ… శ్రీరామనవమి శుభాకాంక్షలు!

దేవినేని ఉమామహేశ్వరరావు
మాజీమంత్రి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నారా లోకేష్ మరియు బ్రాహ్మణిల కుమారుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుక (పంచెకట్టు కార్యక్రమం) అత్యంత వైభవంగా, కుటుంబ సభ్యుల సమక్...
14/03/2026

నారా లోకేష్ మరియు బ్రాహ్మణిల కుమారుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుక (పంచెకట్టు కార్యక్రమం) అత్యంత వైభవంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది

ఈ వేడుకకు లో పెద్దల తాతయ్యలు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలతో పాటు నానమ్మ భువనేశ్వరి, అమ్మమ్మ వసుంధర గార్ల ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

- నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సందడి చేయడంతో ఈ వేడుక కంటికి పండుగలా నిలిచింది.
- తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా దేవాన్ష్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోవడం అందరినీ ఆకట్టుకుంది.

“పార్టీ బలోపేతమే లక్ష్యం… వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి”రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిరంతర కృషిలోకేష...
13/03/2026

“పార్టీ బలోపేతమే లక్ష్యం… వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి”

రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిరంతర కృషి

లోకేష్ దిశానిర్దేశంతో క్షేత్రస్థాయిలో టీడీపీ బలోపేతం

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1.32 లక్షల మందికి రూ.1179 కోట్లు

క్లస్టర్ క్యాడర్ శిక్షణలో నేతలకు మాజీ మంత్రి దేవినేని ఉమా మార్గదర్శనం

మంగళగిరి, మార్చి 13:
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనునిత్యం కృషి చేస్తున్నారని, అదే సమయంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు గట్టిగా ఎదుర్కోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ల కోసం నిర్వహించిన ‘టిడిపి సంస్థాగత రూపకల్పన – విధులు, బాధ్యతలు’ అంశంపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నేతలకు మార్గదర్శనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిశానిర్దేశంతో టిడిపిని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి క్లస్టర్ ఇన్‌ఛార్జి, ప్రతి నాయకుడు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయాలని సూచించారు. అభివృద్ధితో పాటు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను గట్టిగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. ప్రజలకు నిజాలు తెలియజేయడం పార్టీ కార్యకర్తల బాధ్యత అని చెప్పారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రతి కార్యకర్త వాస్తవాలతో తిప్పికొట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 1.32 లక్షల మందికి రూ.1179 కోట్లు అందజేసి పేదల ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడం ద్వారానే టిడిపి మరింత శక్తివంతమవుతుందని, ప్రతి క్లస్టర్ నాయకుడు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీపై విశ్వాసాన్ని మరింత బలపరచాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

11/03/2026
శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు టిడిపి నేత, మాజీ మంత్రి మీడియా సమావేశం (స్క్రోలింగ్ పాయింట్స్)విజయవాడ : 11 మార్చి 2026దోచుక...
11/03/2026

శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు
టిడిపి నేత, మాజీ మంత్రి

మీడియా సమావేశం (స్క్రోలింగ్ పాయింట్స్)

విజయవాడ : 11 మార్చి 2026

దోచుకో.. పంచుకో.. తినుకో ఆ నినాదం వైసీపీ పేటెంట్ హక్కు

ఐదేళ్ళు ఆర్థిక విధ్వంసానికి పాల్పడి ఇప్పుడు కాగ్ నివేదకను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే పనులు చేస్తున్నారు

ఇక్కడ శ్రీరంగ నీతులు చెప్పి.. ఢిల్లీలో తెల్లజెండా ఎత్తుతున్నారు

గత ప్రభుత్వంతో పోల్చితే దాదాపు 45శాతం వరకు సంక్షేమ పథకాలకు అదనంగా కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది

అభివృద్ధి - సంక్షేమంతో రాష్ట్రంలో కేంద్రంలో ఢబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ వేగంతో నడుస్తుంది

పరదాలు కట్టుకొని పరిపాలన చేయడం చేతగాక 11 సీట్లకు పరిమితమయ్యారు

అన్న క్యాంటీన్, తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, అన్నదాత సుఖీభవ పథకాలతో కూటమి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది

లక్షల కోట్లు అప్పులు చేసి, వేలకోట్ల పెండింగ్ బిల్లులు వదిలి నేడు రాష్ట్ర ఖజానా, మినిమమ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు

చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి


మాజీ మంత్రి దేవినేని ఉమాపై నమోదైన మూడు కేసులు కొట్టివేతవిజయవాడ, శుక్రవారం:  నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన మూడు కేసు...
06/03/2026

మాజీ మంత్రి దేవినేని ఉమాపై నమోదైన మూడు కేసులు కొట్టివేత

విజయవాడ, శుక్రవారం: నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన మూడు కేసుల విచారణలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఊరట లభించింది. విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు లో శుక్రవారం జరిగిన విచారణలో న్యాయాధికారి కేసులను కొట్టివేశారు.

విచారణ నిమిత్తం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టిడిపి నేతలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా 2019లో నమోదైన కేసు (Cr.No 811/2019, C.C.No 2075/24), విజయవాడ రూరల్ జక్కంపూడి కాలనీలో నమోదైన కేసు (Cr.No 225/24, C.C.No 2064/24), అలాగే Dr. NTR University of Health Sciences పేరు మార్పుకు నిరసనగా 2022లో నమోదైన కేసు (Cr.No 592/22, C.C.No 6605/22)లపై కోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసుల్లో ప్రముఖ సీనియర్ న్యాయవాది చేకూరి శ్రీపతి మరియు న్యాయవాది నవీన్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం కేసుల్లో సరైన ఆధారాలు లేవని గుర్తించిన న్యాయస్థానం మూడు కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు టీడీపీ నేతలకు ఊరట లభించింది.

తెలుగుదేశం కుటుంబ చరిత్ర లో గురుశిష్యుల సంబంధం లో మొదటగా గుర్తు వచ్చేది దేవినేని ఉమా ,చంద్రబాబు గార్లదే..పేరుకు తగ్గట్టే...
25/02/2026

తెలుగుదేశం కుటుంబ చరిత్ర లో గురుశిష్యుల సంబంధం లో మొదటగా గుర్తు వచ్చేది దేవినేని ఉమా ,చంద్రబాబు గార్లదే..
పేరుకు తగ్గట్టే ఎంత బాధని అయినా కంఠం లో దాచుకునే మంచి మనిషి ఉమా గారు
హనుమంతుడి లాంటి శిష్యుడు ని చూడగానే బాబు గారు ఆప్యాయత కురిపించే విధానం 👏👏

ఈ నవ్వులు వెనుక ఎంతో కష్టం ఉంది ఐదు ఏళ్లలో పార్టీ కోసం కుటుంబం మొత్తం పోరాడింది..కట్టుకున్న భార్య ని పార్టీ కోసం కౌన్సిల...
14/02/2026

ఈ నవ్వులు వెనుక ఎంతో కష్టం ఉంది
ఐదు ఏళ్లలో పార్టీ కోసం కుటుంబం మొత్తం పోరాడింది..

కట్టుకున్న భార్య ని పార్టీ కోసం కౌన్సిలర్ గా నిలబెట్టి క్యాడర్ కి ధైర్యం ఇచ్చాడు..కన్నీరు పెట్టుకుంది భర్త ని అరెస్ట్ చేసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి తీసుకుని పోతుంటే …

ఒక కొడుకును వార్డ్ మెంబెర్ గా నిలబెట్టాడు పార్టీ కోసం ..ఈ రోజుల్లో MLA,MP గానే నిలబడతారు నాయకులు కొడుకులు..అయినా వార్డ్ మెంబెర్ గా పోటీచేయించాడు…

ఇంకో కొడుకుని పార్టీ కి పదునైన అస్త్రం ని చేసి వదిలాడు.. ఎన్నో కేసు లు ..ఎన్నో ఇబ్బందులు..ఐటీడీపీ లో పోరాటం సైకో మీద ,తన పసికందులని సైతం సీఐడీ పోలీసులు ఇబ్బందులు పెట్టారు..ప్రశ్నలతో భయపెట్టారు…ఐదు ఏళ్లలో ఒక్క పండుగ కూడా ఇంటిలో ఉండి జరుపుకున్నది లేదు..పాపం ..పార్టీ కోసమే త్రికరణ శుద్ధితో కష్టపడ్డాడు చింతకాయల విజయ్..ఉన్న విద్య చదివి కూడా ఎన్నో దొంగ కేసులు ఐదు ఏళ్లలో…

ఇంటిలో ఉన్న నలుగురు నాలుగు దిక్కులు బాబు గారి కుటుంబం కోసం ,పార్టీ కోసం , కాళ్లకి బలపం పట్టుకుని తిరిగారు..
ఉత్తరాంధ్ర సింహం అని మాటలతో కాకుండా చేతలతో చూపెట్టారు అయ్యన్న కుటుంబం మొత్తం 👏👏

రప్ప రప్ప అంటూ.. రక్త తిలకాలు దిద్దుకుంటూ చేసే అరాచక పర్యటనలతో వైసిపి క్రిమినల్ ఆటిట్యూడ్ ప్రజలకు అర్థమవుతుంది: మాజీ మంత...
07/02/2026

రప్ప రప్ప అంటూ.. రక్త తిలకాలు దిద్దుకుంటూ చేసే అరాచక పర్యటనలతో వైసిపి క్రిమినల్ ఆటిట్యూడ్ ప్రజలకు అర్థమవుతుంది: మాజీ మంత్రి దేవినేని ఉమా

★మొన్న గుంటూరు నేడు ఇబ్రహీంపట్నంలో పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి ప్రజలను ఇక్కట్ల పాలు చేశాడు

★తన ప్రచార పిచ్చికి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సొంత పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు సంతాపం తెలపడానికి కూడా మనస్సు రాలేదు

★ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమైన దండయాత్ర పై అధికార యంత్రాంగం సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి

★ పరామర్శల పేరుతో అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వకుండా.. ప్రాణాలు కోల్పోయిన సొంత పార్టీ కార్యకర్తలను కూడా వైసీపీ నేతలు పట్టించుకోలేదు

★తిరుమలలో చేసిన మహా పాపం కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు

★తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఢిల్లీలో బాబాయి చెబుతుంటే ఇక్కడ ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు

★కల్తీ కోసం టెండర్ నిబంధనలను మార్చింది మీ బాబాయి వైవి సుబ్బారెడ్డి కాదా?

★తిరుమలలో చేసిన పాపాలు వైసీపీ నేతల్ని వెంటాడుతున్నాయి

★అబద్ధాలు అసత్యాలు వండి వార్చి అవినీతి సాక్షి, వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు

31/01/2026

*పశువులు కూడా సిగ్గుపడేలా బరితెగించి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు క్షమించరానివి: మాజీ మంత్రి దేవినేని ఉమా*

★ కెమికల్స్, జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి పవిత్ర తిరుమలలో లడ్డు తయారీలో వాడారని స్పష్టమయ్యింది

★వాస్తవాలు కప్పిపుచ్చాలని దురుద్దేశంతో అబద్ధాలు అసత్యాలతో వైసిపి నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు

★ఎన్‌డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) జంతు అవశేషాలు ఉన్నాయని రిపోర్టులో వచ్చాయి

★చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అచ్చోసిన ఆంబోతుల్లా అసత్యాలు ప్రచారం చేస్తారా ?

★హద్దు అదుపులేకుండా దుర్మార్గమైన బాష బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సభ్యసమాజం సహించకూడదు

★రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి అంబటి మాటలు నిదర్శనం

★గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే 11 సీట్లకు పరిమితమయ్యారు

★ఈ రోజు మాట్లాడిన బాష, రెచ్చగొడుతున్న తీరు చూస్తేంటే వైసీపీ నేతలు ప్రజాజీవితంలో ఉండడానికే అర్హులు కాదు

★ఇటువంటి బూతుల పంచాంగం భవిష్యత్తులో ఎవరూ మాట్లాడకుండా సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత అధికారులు యంత్రాంగం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి





Address

Guntupalli
Ibrahimpatan

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Guntupalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to iTDP Guntupalli:

Share