20/04/2021
జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలలో పోటి చేస్తున్న అభ్యర్థులకు, ముఖ్యంగా టికెట్ ఆశించి అనివార్య కారణాల వల్ల టికెట్ పొందనివారికోసం నా యొక్క చిన్న సూచన.....
దాదాపు పదేళ్ళ తరువాత మన జడ్చర్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ కావడంతో తెరాస పార్టీ నుండి పోటి చేసేందుకు ఒక్కో వార్డు నుంచి దాదాపు 5-6 మంది టికెట్ ఆశించారు. ఆశించినవారందరికి టికెట్ ఇవ్వడం కుదరదు. రిజర్వేషన్, స్థానికంగా ఉన్న గుర్తింపు తదితర అంశాలు పరిగణలోకి టికెట్ కేటాయించారు.
టికెట్ రానివారు సహజంగా నిస్పృహకి లోనయ్యి ఇతర పార్టిలలో చేరడం, లేద మన ఎమ్మెల్యే గారి మీద కోపం పెంచుకోవడం, ఎమ్మెల్యే గారు మమ్మల్ని మోసం చేసాడు అని ప్రచారం చెయ్యడం ఇలా ఎన్నెన్నో అంటుంటాం.
కాని టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఒక్కసారి మన నాయకుడు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి చరిత్ర గుర్తు తెచ్చుకోండి.
2001 లో తెరాస పార్టీ స్థాపించిన నాటి నుండి ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలో 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెరాస పార్టీ నుండి మహబుబ్ నగర్ జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన లక్ష్మన్న.తెలంగాణ కోసం అనంతరం కేసియార్ గారి మాటతో మొట్టమొదటి రాజినామ చేసిన వ్యక్తి కూడ మన లక్ష్మన్నే.
2009 లో జరిగిన ఎన్నికలలో తెరాస పార్టి తెదేపాతో పొత్తు పెట్టుకుంటే, పాలమూరు జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయిన లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల నుండి తనకు తప్పకుండ టికెట్ వస్తుందని భావించాడు, కాని కొన్ని సామాజిక కోణాలతో జడ్చర్ల నుండి లక్ష్మారెడ్డి గారిని కాదని తెదేపా అభ్యర్థికి టికెట్ కేటాయించారు. తనకు టికెట్ రాకపోవడంతో లక్ష్మారెడ్డి గారు అసహనంలో ఉన్నారని తప్పుగా భావించిన ఆనాటి ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి లక్ష్మరెడ్డి గారికి భారీ పాకేజ్ తో పాటు ఎమ్మెల్సీ పదవి ఆశజూపాడు...లక్ష్మన్న కనుక మనలాగ ఆలోచించి ఆనాడు పార్టీ మారినుంటే ఈరోజు తను ఎక్కడుంటుండే...?
ఎవరు ఎన్ని చెప్పిన పట్టు సడలకుండ అధినేత కేసియార్ గారి ఆదేశంతో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసం ప్రచారం చేసి గెలీంచాడు. ఆరోజు మన లక్ష్మన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసాడు కాబట్టే లక్ష్మన్న నిజాయితిని గుర్తించిన కేసియార్ గారు 2014 లో టికెట్ ఇచ్చి గెలిపించుకొని తన తొలి క్యాబినెట్ లో అత్యంత కీలకమైన వైద్యారోగ్య శాఖను మన లక్ష్మన్నకు అప్పజెపిండు.
కాబట్టి టికెట్ రాని వారు ఎలాంటి నిస్పృహకు లోనవ్వకండి...