SHO Dharmapuri

SHO Dharmapuri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Dharmapuri, Police station, Dharmapuri, Jagtial.

ధర్మపురి పోలీస్ స్టేషన్  అకస్మిక తనిఖీ చేసిన  జిల్లా ఎస్పీ  శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారుపోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల...
12/07/2024

ధర్మపురి పోలీస్ స్టేషన్ అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని అధికారులను గారు ఆదేశించారు. ఈరోజు ధర్మపురి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై, నూతన చట్ట ల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.

*- గంజాయి తరలిస్తున్న ఇద్ధరు అంతర్ రాష్ట్ర   నిందుతులు, స్థానికంగా కొనుగోలు చేసే వ్యాపారీ  అరెస్ట్.నిందుతుల  వద్ద నుoచి ...
11/07/2024

*- గంజాయి తరలిస్తున్న ఇద్ధరు అంతర్ రాష్ట్ర నిందుతులు, స్థానికంగా కొనుగోలు చేసే వ్యాపారీ అరెస్ట్.
నిందుతుల వద్ద నుoచి 6.03 కిలోల గంజాయి సీజ్.

*- - - అక్రమంగా గంజాయి సేవించిన,విక్రయించిన,కలిగి ఉన్న కఠిన చర్యలు తప్పవు.*

*- - -జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్., గారు.*

జల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ గారు.

*DETAILS OF ARRESTED PERSON*

A-1:Durgam Ramu s/o Lachaiah, age 23yrs, r/o Donur village of Dharmapuri mandal, Jagtial district.

A-2:Dinesh Kumar Nayak s/o Ranjith Kumar Nayak, age 30yrs, r/o Rayagada, Odisha State.

A-3:Gujjala Purushotham s/o Narayana, age 49yrs, r/o Vijayanagaram, Andhra Pradesh State.

*Seized item:*

*6.030) KGs of dry G***a worth rupees 1,20,000=00*

*Three mobile phones,Net cash Rs. 3,500=00*

ధర్మపురి పోలీసులు ఛేదించిన అంతర్రాష్ట్ర డ్రగ్ (గంజాయి) రాకెట్, ముగ్గురు నిందితులను 10.07.2024 రాత్రి సమయంలో అరెస్టు చేశారు, ఇందులో ఇద్దరు చిరువ్యాపారులు ఒకరు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు మరియు మరొకరు AP రాష్ట్రానికి చెందినవారు, కొనుగోలుదారుడు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం కి చెందినవాడు.

*వివరాలు:*

ఇటీవల, 04.07.2024 నాడు ధర్మపురి PS లో NDPS చట్టం కింద 1.బత్తిని చందు, 2. గొల్ల వెంకటేష్ మరియు 3.దుర్గం రాము s/o లచ్చయ్య, వయస్సు 23 సంవత్సరాలు, ధర్మపురి మండలానికి చెందిన r/o దొంతాపూర్ గ్రామం, వారి పై ధర్మపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. 03.07.2024న ఆ కేసు, 1. బత్తిని చందు, 2. గొల్ల వెంకటేష్‌లను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు, అయితే దుర్గం రాములు పరారీలో ఉన్నాడు.నిందితుడు దుర్గం రాము ని పట్టుకునేందుకు యత్నిస్తుండగా, 10.07.2024 సాయంత్రం ధర్మపురి మండలం బుద్దేష్‌పల్లి గ్రామ బస్టాప్‌లో ఉన్న నిందితుడు దుర్గం రాము గురించి పి.ఉదయ్ కుమార్, ధర్మపురి ఎస్‌ఐకి సమాచారం అందింది. పై సమాచారం అందుకున్న SI ధర్మపురి మరియు సిబ్బంది చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు, అక్కడ SI ధర్మపురి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు అరెస్టు చేసిన వ్యక్తుల వద్ద (6.030) కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో, నిందితుడు A -2: ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన దినేష్ కుమార్ నాయక్ గంజాయి ని పండిస్తున్నాడు , నిందితుడు A -3: గుజ్జల పురుషోత్తం ఏపీ రాష్ట్రం విజయనగరానికి చెందినవాడు మరియు సరఫరాదారుడు అని అంగీకరించి మధ్యవర్తిగా పనిచేస్తూ కమీషన్ పద్ధతిలో గంజాయిని విక్రయిస్తున్నాడు.
నిందితుడు A -1: దుర్గం రాము r/o దొంతపూర్‌, A-4: సునర్కని అజయ్ , A-5 దుర్గం సంజయ్ r/o మగ్గిడి గ్రామం వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన A-2 దినేష్‌కుమార్‌ నాయక్‌ రాయఘడ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఏ-3 గుజ్జెల పురుషోత్తంరావు r/o విజయనగరంకు 2 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. బత్తిని చందు r/o రాయపట్నం (v), గొల్ల వెంకటేష్ r/o రాయపట్నం (v), దుర్గం రాము r/o దొంతపూర్ (v), సునర్కాని అజయ్ r/o దొంతపూర్ (v) మరియు దుర్గం సంజయ్ r/o మగ్గిడి (v) అనువారు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ వెళ్ళి , రాయఘడ రైల్వేస్టేషన్‌లో A -2 దినేష్, A -3 పురుషోత్తంలను కలుసుకొని వారి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసేవారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన A-2 దినేష్ కుమార్ నాయక్ r/o రాయఘడ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన A-3 గుజ్జెల పురుషోత్తం రావు r/o విజయనగరం గంజాయిని విక్రయించడం ద్వారా త్వరగా మరియు సులభంగా డబ్బు సంపాదించడానికి ఈ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. మొదటి సారి ఈ ప్రాంతానికి వచ్చి A -1 దుర్గం రాముడిని కలుసుకుని ధర్మపురి మండలం బుద్దేష్‌పల్లి గ్రామంలో 6 కిలోల గంజాయిని అందజేసి A -4 సునర్కని అజయ్, A -5 దుర్గం సంజయ్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు
పై విషయాలతో PS ధర్మపురి లో NDPS-1985Act యొక్క Cr.no 219/2024 u/s 20 (b) (ii) (B) NDPS చట్టం క్రింద నమోదు చేయబడింది మరియు దర్యాప్తు చేయబడింది.

నిందితుడు A -2: దినేష్ కుమార్ నాయక్ గతంలో విజయనగరం GRP పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డిపిఎస్ చట్టం కేసులో ప్రమేయం ఉంది మరియు ఒడిశా రాష్ట్రంలోని షేష్‌ఖాల్ పిఎస్‌లో పోక్సో కేసుతో పాటు రాయగడ జైలులో ఉన్నాడు, A -3: గుజ్జల పురుషోత్తం కూడా గతంలో. రాయగడ పీఎస్‌లో ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌ కేసు జైలుకు వెళ్లగా, ఇద్దరికీ రాయగడలో జైల్ లో పరిచయం అయినది

*జిల్లాలో అక్రమ గంజాయి పై జిల్లా పోలీస్ ఉక్కుపాదం.*

సమాజంలో డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడo జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ (ఏడీసీ)లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి, డయల్ 100 కి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.

జగిత్యాల జిల్లా....*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన*జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎ...
29/01/2024

జగిత్యాల జిల్లా....

*సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన*

జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మెనాలా గ్రామంలో పోలీస్ కళా బృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహణ, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ఎస్సై దత్తద్రి గారు మాట్లాడుతూ... నేను సైతం అనే కార్యక్రమం ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు ,యూత్ చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని,ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న తగదలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామలుగా చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై గారు, గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా.....*- - - శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ,అసాంఘిక కార్యకలాపాలు నివారణకే జిల్లా సరిహద్దులోపకడ్బందీ చర్యలు....
08/10/2023

జగిత్యాల జిల్లా.....

*- - - శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ,అసాంఘిక కార్యకలాపాలు నివారణకే జిల్లా సరిహద్దులోపకడ్బందీ చర్యలు.*

*- - - సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ.*

*- - -రాయపట్నం వద్ద నూతనంగా నిర్మించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ పోలీస్ బార్డర్ చెక్పోస్ట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు*

జగిత్యాల జిల్లా నుండి మూడు జిల్లాల కు అనుసంధానంగా ఉండే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ పోలీస్ బోర్డర్ చెక్ పోస్ట్, కమాండ్ కంట్రోల్ ను జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ... రానున్న ఎన్నికల సందర్భంగా జిల్లాలోని చుట్టూ ఉన్న అన్ని బార్డర్ల నందు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు నూతనంగా నిర్మించిన రాయపట్నం చెక్ పోస్ట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాత్రి పగలు ఇతర జిల్లాల నుండి వచ్చే ,వెళ్లే వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఇoదుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. డబ్బు మద్యం రవాణా జరగకుండా నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ యొక్క చెక్ పోస్ట్ కరీంనగర్ జగిత్యాల మంచిర్యాల మూడు జిల్లాలకు సరిహద్దు కావడంతో ఈ ప్రాంతం నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉంటుందని గతంలో ఇక్కడ తాత్కాలికంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీ లు నిర్వహించేవారు అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండు ప్రత్యేక గదులతో మరొక సపోర్ట్ రూమ్ నిర్మించడం జరిగిందని ఇందులో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారని వచ్చి పోయే వాహనాలను, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సుమారు మూడు లక్షల వ్యయంతో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడం జరిగిందని కావున ఈ ప్రాంతంలో జరిగే ప్రతి సంఘటన కమాండ్ కంట్రోల్ ద్వారా చూడవచ్చన్నారు. ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని అదుపులో ఉంచేందుకు రోడ్డు మధ్యలో భారీ ఎత్తున బారికెట్లను ఏర్పాటు చేశామన్నారు. ఎలక్షన్ ల సమయం లొ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పట్లు చేస్తుంది అన్నారు. ప్రజలు, యువత ఎలక్షన్ సమయం లో ఎలాంటి గొడవలకు పోకుండా పోలీసువారికి సహకరించాలని సూచించారు.ఈ యొక్క చెక్ పోస్ట్ కు సహకరించిన స్థానిక ప్రజలకు ,దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఎస్పీ గారు పోలీస్ చెక్ పోస్టు ఆవరణలో మొక్కలు నాటారు

ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకట స్వామి సి.ఐ రమణమూర్తి, ఎస్సైలు దత్తాత్రి, నరేశ్ , సందీప్, రామక్రిష్ణ, శ్వేత, సర్పంచ్ ఈర్ల చిన్నక్క,MPTC పుష్పాలత,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

29/01/2022

సురక్షితమైన సైబర్ స్పేస్ గురించి తన అభిప్రాయాలను తో పంచుకోవటానికి ప్రపంచ స్థాయి మహిళా బ్యాడ్మింటన్ స్టార్ గారు "iSMART CYBER CHILD" ద్వారా లైవ్ లో మన ముందుకు రాబోతున్నారు

*Date19-11-2021 రోజున*  *జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలపేట గ్రామం నందు* 👉 *గౌరవనీయులు జగిత్యాల ...
20/11/2021

*Date19-11-2021 రోజున*

*జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలపేట గ్రామం నందు*

👉 *గౌరవనీయులు జగిత్యాల జిల్లా SP శ్రీమతి శ్రీ సిందుశర్మ IPS గారి అదేశాల మేరకు..*

👉 *మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని*

👉 *సైబర్ నేరాల నియంత్రణ,టోల్ ఫ్రీ నెం 155260 పై అవగాహన*

👉 *ట్రాఫిక్ మొబైల్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాలపైన LED స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన*

👉 *మహిళల భద్రత మరియు,మానవ అక్రమ రవాణా, బాల్య రక్షణ,మూఢ నమ్మకాలపై*

*👉డైల్100 మరియు సైబర్ క్రైమ్ డైల్ 155260 పై అవగాహన..*

*కార్యక్రమంలో*

👉 *ధర్మపురి పోలీస్ సిబ్బంది,ప్రజలు మరియు పోలీస్ కళాబృందం జగిత్యాల🌹* 🙏

14/09/2021
*Date28-08-2021 రోజున*  *జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆక్సయిపల్లె గ్రామంలో* 👉 *గౌరవనీయులు జగిత్యాల ...
28/08/2021

*Date28-08-2021 రోజున*

*జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆక్సయిపల్లె గ్రామంలో*

👉 *గౌరవనీయులు జగిత్యాల జిల్లా SP శ్రీమతి శ్రీ సిందుశర్మ IPS గారి అదేశాల మేరకు..*

👉 *కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించి సోషల్ డిస్టన్స్ పాటించాలని*

👉 *అర్హులు అందరూ కరోన టీకా తీసుకునేలా అవగాహన*

👉 *ట్రాఫిక్ మొబైల్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాలపైన LED స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన*

👉 *మహిళల భద్రత మరియు,మానవ అక్రమ రవాణా, బాల్య రక్షణ, సైబర్ నేరాలు,మూఢ నమ్మకాలపై*

*👉డైల్100 మరియు సైబర్ క్రైమ్ డైల్ 155260 పై అవగాహన..*

*కార్యక్రమంలో*

👉 *ధర్మపురి పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ కళాబృందం జగిత్యాల🌹* 🙏

Address

Dharmapuri
Jagtial

Telephone

+918712656824

Website

Alerts

Be the first to know and let us send you an email when SHO Dharmapuri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category