SHO Jagtial Rural

SHO Jagtial Rural Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Jagtial Rural, Police station, Jagtial.

విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి లావోస్ దేశానికి అక్రమంగా తరలించిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద న...
21/02/2026

విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి లావోస్ దేశానికి అక్రమంగా తరలించిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేయడం జరిగింది.
వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం..
విదేశీ ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టే ఏజెంట్లను నమ్మకండి.
అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరిగా పరిశీలించండి.
మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.
ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవు.

28/03/2025

వ్యవసాయ మోటర్ దొంగతనానికి ప్రయత్నించిన కేసులో నిందితునికి 6 నెలల జైలు శిక్ష మరియు 100 రూపాయల జరిమానా....

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతే గ్రామానికి చెందిన రైతు అనిల్ తేదీ: 03-01-2024 రోజున పొలం పనుల గురించి ఉదయం 10 గంటలకు వెళ్లగా పొలం దగ్గర ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వ్యవసాయ మోటార్ దొంగిలిస్తున్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి పట్టుకోవడానికి ప్రయత్నించగా నిందితుడు అనిల్ ను గాయపరిచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న వారు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వ్యవసాయ మోటర్ దొంగతనానికి ప్రయత్నించడని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన జగిత్యాల రూరల్ ఎస్.ఐ సదకర్ తన సిబ్బందితో కలిసి వ్యవసాయ మోటర్ దొంగలించిన నిందితుడు ఫీరాజ్ గ్రామం ఉత్పల్లి,బోధన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచడం జరిగింది. కోర్టు కానిస్టేబుల్ రామకృష్ణ సాక్షులను ప్రవేశపెట్టగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజని గారు తమ వాదన వినిపించగా నేరం రుజువు కావడంతో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష,100 రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ గారు తీర్పునిచ్చారు

13/03/2025

కన్న కూతురు(మైనర్ బాలిక) తో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితునికి 3 సంవత్సరముల జైలు శిక్ష మరియు రూ 5000/- జరిమానా........

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన నిందితుడు మేకల స్వామి వయస్సు 36 సంవత్సరాలు అనే వ్యక్తి కన్నకూతురు(మైనర్ బాలిక) తో అసభ్య కరంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్.ఐ M.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి Fast track spl. Court కి ఆధారాలు సమర్పించగా పిపి గారు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్ష్యులను ప్రవేశపెట్టగా, సాక్ష్యులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీమతి నీలిమ గారు ఈ రోజున నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు.

24/02/2025

స్కూల్ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా సైగలు చేస్తూ, వెంటపడి వేధించిన కేసులో నిందితుడికి 20 రోజుల జైలు శిక్ష మరియు 26000/- రూపాయల జరిమానా.......

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కేసులో ఒడ్డేటి చంద్ర తేజ 30 సంవత్సరాలు, ధర్మపురి కి చెందిన వ్యక్తి స్కూల్ విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా సైగలు చేస్తూ, వెంటబడి వేధించిన కేసులో నిందితుడికి 20 రోజుల జైలు శిక్ష మరియు 26000/- రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ గారు తీర్పునిచ్చారు.

20/02/2025
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అలిశెట్టి బాలకృష్ణ 30 సంవత్సరాలు అనే వ్యక్తి మైనర్ బాలిక  పట్ల అసభ్యంగా ప్ర...
18/02/2025

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అలిశెట్టి బాలకృష్ణ 30 సంవత్సరాలు అనే వ్యక్తి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష మరియు 500 రూపాయల జరిమానా విధించబడడం జరిగింది.
Telangana State Police
Telangana She Teams
bharosahydpolice

శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి, సర్దార్ వల్లభాయి పటేల్ గారిక...
31/10/2024

శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి, సర్దార్ వల్లభాయి పటేల్ గారికి ఘన నివాళి అర్పించిన పోలీసు అధికారులు సిబ్బంది

శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ గారి ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను మరియు భద్రత ను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తున్నానని మరియు నా తోటి ప్రజల్లోకి ఈ సందేశాన్ని పంపియటానికి నా వంతు కృషి చేస్తున్నానని ప్రమాణం చేయటం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గారి యొక్క దూరదృష్టి మరియు చర్యల ద్వారా దేశ ఐక్యత సాద్యమైందని ఈ ఐక్యత స్ఫూర్తి తో మన దేశం యొక్క అంతర్గత భద్రత ను కాపాడటానికి మన వంతు భాద్యతను నిర్వహించాలని అన్నారు. జాతి సమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో SB ఇన్స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ. వేణు,RSI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.**- - - గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక ద...
30/10/2024

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.*

*- - - గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి*

*- - - వార్షిక తనిఖీల్లో భాగంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు*

ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీ లో భాగంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని,బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని అసాంఘిక కార్యకలాపాలు ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు దూరంగా ఉన్నప్పటికీ 10 నిమిషాల్లో చేరుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, మరియు పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ0లో 5s అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షన్ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ గారు మొక్కలు నాటడం జరిగింది.

29/10/2024

లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు*

*- - - లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు*

*- - - పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి*

దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నరు. టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు. దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్‌ ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణoలో జరుపుకోవాలని సూచించారు.

*- జులై 1 నుండి అమల్లోకి కొత్తచట్టాలు**- - -కొత్త చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి**- - - జిల్ల...
01/07/2024

*- జులై 1 నుండి అమల్లోకి కొత్తచట్టాలు*

*- - -కొత్త చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి*

*- - - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు*

జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు అమలులోకి రానున్నట్లు జిల్లా ఎస్పి పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.*కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు - *భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం.* జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

*ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా  జగిత్యాలలో  ట్రాఫిక్ ఆంక్షలు: జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*ప్రధాని నరే...
16/03/2024

*ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాలలో ట్రాఫిక్ ఆంక్షలు: జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*

ప్రధాని నరేంద్ర మోదీ గారి ఈ నెల 18న జగిత్యాల లో బహిరంగ సభ సందర్భంగా పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. జిల్లా కేంద్రం లోనికి ఆదివారం సాయంత్రం నుoడి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాల అనుమతి లేదు అన్నారు. ఆదివారం, సోమవారం ఎటువంటి డ్రోన్లు పట్టణంలో ఎగురవేయ డానికి అనుమతి లేదు అన్నారు. అదే రోజు SSC పరీక్ష ఉండటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వీలైనంత త్వరగా చేరుకొవాలని సూచించారు.

*ట్రాఫిక్ డైవర్షన్.*
★ కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు ధరూర్ పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్ళవలసి ఉంటుంది.
★నిజామాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు తాటిపల్లి బైపాస్ ద్వారా ధరూర్ పెద్ద కెనాల్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.
★ ధర్మపురి నుండి కరీంనగర్ వైపు వెళ్లేవారు తమ వాహనాలను పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా, ధరూర్ పెద్ద కెనాల్ వైపు వెళ్ళవలసి ఉంటుంది.
★కరీంనగర్ నుండి ధర్మపురి వైపు వెళ్లేవారు తమ వాహనాలను ధరూర్ పెద్ద కెనాల్ వైపు నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా పొలాస వైపు వెళ్ళవలసి ఉంటుంది.
★ ధర్మపురి నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు పొలాస నుండి తిమ్మాపూర్ బైపాస్ మీదుగా, ధరూర్ పెద్ద కెనాల్ బైపాస్ ద్వారా కోరుట్ల వైపు వెళ్ళవలసి ఉంటుంది.

Address

Jagtial
505327

Website

Alerts

Be the first to know and let us send you an email when SHO Jagtial Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category