CITU kadapa

CITU kadapa భారతదేశంలోని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలి... అతను భారతీయుడని మరియు ఈ దేశంలో అతనికి ప్రతి హక్కు ఉంది,

18/04/2026

సిఐటియు కడప జిల్లా ఉద్యమ అనుభవాలు... ప్రవేశపెడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్

31/03/2026
27/03/2026

రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.

కడప నగరంలోని ఎరముక్కపల్లె మామిళ్ళ పల్లె రోడ్డు రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయాలని సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ముఖ్యంగా మామిళ్ళ పల్లె ప్రాంతంలో తెలుగు గంగ ప్రాజెక్టు ఉన్నదని తెలిపారు. ఆ ప్రాంతంలో వందల మంది ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. అదే తరుణంలో చుట్టుపక్కల ప్రాంతాల నందు వేలమంది కడపకు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే బ్రిడ్జిని పూర్తిచేయకపోవడం దుర్మార్గమని తెలిపారు. అనారోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్స్ రావాలంటే పదుల సంఖ్యలో కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలిపారు. అలాంటప్పుడు అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ప్రభుత్వం రైల్వే అధికారులు జోక్యం, చేసుకొని స్థలం ఇచ్చిన వారికి పునరవాసం కల్పించి, వెంటనే రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నగర నగర అధ్యక్ష కార్యదర్శులు వెంకటసుబ్బయ్య , చంద్రా రెడ్డి ,సిఐటియు జిల్లా కోశాధికారి బి లక్ష్మీదేవి సిపిఎం నగర కార్యదర్శి ,రామ్మోహన్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి, రైల్వే బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి ,రిమ్స్ నాయకులు పవన్, దస్తగిరి ,మున్సిపల్ జిల్లా కోశాధికారి గోపి, అధ్యక్షులు రవి , ఆనంద్ ,ప్రకాష్, కిరణ్, కెవిపిఎస్ నాయకులు నరసింహ, శ్రీను, ఉదయ్, తిమ్మయ్య సాయి తదితరులు పాల్గొన్నారు.

16/03/2026

బిల్డింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిఐటియు

రాష్ట్రవ్యాప్తంగా బిల్డింగ్వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ బిల్డింగ్ సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలిపారు .అంతేకాకుండా 2019 నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ అన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .బిల్డింగ్స్ బాగున్నాయని చెప్తున్నారంటే దానికి బిల్డింగ్ వర్కర్స్ ప్రధాన కారణం అని తెలిపారు. అలాంటి బిల్డింగ్ వర్కర్స్ బాధలు ,కష్టాలు, సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిల్డింగ్ వర్కర్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బిల్లింగ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు బైరవ ప్రసాద్, చంద్రారెడ్డిలు మాట్లాడుతూ బిల్లింగ్ వర్కర్స్ గతంలో కట్టినవన్నీ రెనువలు చేయాలని కోరారు అంతేకాకుండా పిల్లల స్కాలర్షిప్ పెన్షన్స్ ప్రమాద బీమా పనిముట్లు కల్పించాలని కోరారు అదే తరుణంలో యాజమాన్యం ద్వారా వచ్చే డబ్బులన్నీ బిల్డింగ్ అన్ని రకాల కార్మికులకు వర్తించే విధంగా చూడాలని కోరారు వందల వేల మంది అనేక రకాల కష్టాలు పాలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర్ కార్యదర్శి రామ్మోహన్ పెన్షన్ నాయకులు రామకృష్ణారెడ్డి మున్సిపల్ నగర అధ్యక్షులు ఎస్ రవి జిల్లా కోశాధికారి గోపి జిల్లా ఉపాధ్యక్షులు తెలిపారు ప్రకాష్ కిరణ్ ఉదయ్ సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి,, తిమ్మయ్య, ఆలీ భాష, రవి, రమణయ్య, ప్రకాష్, నజీరు, తిరుపాలు,
ఆచారి, వెంకటేశ్వర్లు,CITU జిల్లా సభ్యులు విజయ్ కుమార్, వెంకటేశు, పోరుమామిళ్ల నుంచి బిల్లింగ్ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.

Address

Kadapa Muthumjaigunta Kadapa
Kadapa
516001

Telephone

+919160074782

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CITU kadapa:

Share