19/03/2022
19-03-2022,
కడప జిల్లా.
* అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థితికి ఎదగాలి
* ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎపి స్కిల్ డెవెలప్మెంట్ ఛైర్మెన్ అజయ్ రెడ్డిలు
* APSSDC & MAAS సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేకోడూరులో మెగా జాబ్ మేళా
* 30 కి పైగా కంపెనీల ద్వారా దాదాపు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు.
అందుబాటులో ఉన్న అవకాశాలను అందుకుని, ఉద్యోగ విధుల్లో నైపుణ్యతను, అనుభవాన్ని పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, ఎంపీ పి.వి.మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మరియు ఎపి స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మ కొండూరున్ అజయ్ రెడ్డిలు యువతకు సూచించారు.
శనివారం ఉదయం రైల్వేకోడూరు రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో. APSSDC & MAAS సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎంపీ పి.వి.మిథున్ రెడ్డి లతోపాటు ఎపి స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ అజయ్ రెడ్డిలు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
ముందుగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ చైర్మన్ అజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ అవకాశం ఉన్న ఏదైనా సరే చిన్నదా పెద్దదా అని ఆలోచన లేకుండా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలలో మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు, నిరుద్యోగ యువతి యువకులకు వివిధ రకాల సాంకేతిక నైపుణ్యాలను నేర్పించి పెద్ద కంపెనీలలో ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ పనిచేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ. నిరుద్యోగ యువత యువతకు విస్తృతమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఆయా రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారన్నారు. APSSDC & MAAS సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళా ద్వారా... 30 కి పైగా సంస్థల్లో... దాదాపు 3000 ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ద్వారా.. ఉద్యోగాలను పొందే యువతకు ఆయా కంపెనీల నుండి భద్రతతో కూడిన ఉపాధిని.. అందివ్వడం జరుగుతుందన్నారు. కావున అందివచ్చే అవకాశాలను అందుకుంటూ.. మరింత పై స్థాయికి యువత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఇంత పెద్ద జాబ్ మేళా రైల్వేకోడూరులో నిర్వహించడం.. ఈ ప్రాంత యువత అదృష్టంగా చెప్పవచ్చన్నారు.
గౌరవ ముఖ్య అతిధి రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా నిరుద్యోగ యువత వుండకూడదనే లక్ష్యంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకెళుతున్నారన్నారు. అందరికీ ఉద్యోగ ఉపాది అవకాశాలు పుష్కలంగా అందలన్నదే ఆయన ఉద్దేశ్యం అన్నారు. అందులో భాగంగానే.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా.. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీస్థాయిలో 30కి పైగా కంపెనీలా ద్వారా ఉద్యోగ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. కావున మన పరిధిలో అర్హతలు, అవకాశాలు ఉన్న ఉద్యోగాలను.. యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో.. ఈ నియోజకవర్గంలోని యువతకు ఇక్కడే విస్తృతమైన ఉపాధి ఉద్యోగాలు అందేలా.. నియోజకవర్గాన్ని.అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపి ఓ.ఎస్.డి. దుర్గ ప్రసాద్ గారు, ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సంపత్ కుమార్, నెల్లూరు జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యుం, స్తానిక MPPలు, MPDOలు, సర్పంచ్ లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.