24/06/2026
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా లక్ష్యం – తుమ్మల రామస్వామి (బాబు)
మా అందరి ఆరాధ్య దైవం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి (బాబు) తెలిపారు.
కాకినాడ నుండి అన్నవరం వరకు నిర్మాణంలో ఉన్న సాగరమాల రహదారి కారణంగా స్థానిక రైతులు, గ్రామస్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ రైతులు, గ్రామస్తుల తరఫున కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి అపూర్వ భరత్, ఐఏఎస్ గారికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రజల తరఫున ఈ వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా అవసరమైన చోట అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, బాక్స్ కల్వర్టులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు, గ్రామస్తుల రాకపోకలకు సౌలభ్యం కలగడంతో పాటు వరద ముప్పును నివారించవచ్చని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ప్రజల అవసరాలను గుర్తించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సిహెచ్ సురేష్ కుమార్ నాని, ఏవి రామారావు, మేడ రామకృష్ణారెడ్డి, సిహెచ్ బాలరెడ్డి, ఆనంద్ వెంకట రాఘవరావు, ఎం. అర్జున్ రెడ్డి, కొమరగిరి గ్రామ రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
🚜 రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
🛣️ సాగరమాల రహదారిపై జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
✊ పిఠాపురం ప్రజల సంక్షేమమే లక్ష్యం – తుమ్మల రామస్వామి (బాబు)