Telugu Desam Party: Kakinada Rural

Telugu Desam Party: Kakinada Rural Official Page of TDP Kakinada Rural

05/06/2026

భారతదేశపు ఏకైక కార్యాచరణ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 100కు పైగా అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా జరిగాయి. దానిని ఆధారంగా చేసుకుని మేము స్పేస్ పాలసీ 4.0ను రూపొందించి, రెండు ప్రత్యేక స్పేస్ సిటీలను ఆవిష్కరించాం.



04/06/2026

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు... 🔥🔥
గొడ్డలి పార్టీకి, ఏపీ ప్రజలు గొడ్డలి వేటు వేసిన రోజు..


• ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా "యోగాంధ్ర - 2026" మహత్కార్య క్రమానికి శ్రీకారం చుడుతున్నాం ..సీఎం చంద్రబాబు• కార్...
04/06/2026

• ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా "యోగాంధ్ర - 2026" మహత్కార్య క్రమానికి శ్రీకారం చుడుతున్నాం ..సీఎం చంద్రబాబు

• కార్పొరేట్ హాస్పిటల్ లో యోగా శిక్షణకు ప్రత్యేక సెల్.. లలితా పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

• ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భవిష్యత్తును మార్చే సరికొత్త సాంకేతిక విప్లవానికి మాస్కో వేదికగా పునాది వేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి.. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్ తో భేటీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డు "ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ -2026 " ఏపీకి లభించడం గర్వకారణం .."ఎక్స్ " వేదికగా అభినందించిన సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/mmthP


03/06/2026

గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

03/06/2026

నాడు బాబాయ్ తల అయినా, నేడు రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల అయినా...

వాళ్ల తలలు వాళ్లే నరుక్కుంటారు... మన మీదకు తోస్తారు...

ఇదే గొడ్డలి పార్టీ మూల సిద్ధాంతం...


• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్...
03/06/2026

• "సర్" పై అవగాహన పెంచుకోవాలి .కూటమి పార్టీలను సమన్వయం చేసుకొని ప్రతి ఓటునూ మ్యాపింగ్ చేయాలి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు

• ఆరు రోజుల పర్యటన నిమిత్తం రష్యా రాజధాని మాస్కో చేరుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ .సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు

• ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తూ "గోదావరి పుష్కరాలు".." గోదావరి పుష్కరాలు 2027" నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు

• 6 నెలల్లోనే తుంగభద్ర కు 33 కొత్త గేట్లు. ఈ నెలాఖరున ఏపీ ,కర్ణాటక సీఎంల తో ప్రారంభం.. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి

• పచ్చిరొట్ట పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.2 0 కోట్ల సబ్సిడీని కేటాయించింది.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/fQDZV


02/06/2026

దశాబ్దాల కల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూటమి నేతల సంబరాలు..


02/06/2026

డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.

నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.

మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.

కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.

02/06/2026

స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టును దాచేశారని చేస్తున్న ఫేక్ ప్రచారం పచ్చి అబద్ధం..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 382 మంది జాబితా మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం ...
02/06/2026

• ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 65, 887 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేశాం.. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం పర్యటనలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

• నియోజకవర్గాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

• రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యం.. ముంబయి సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• ఉపాధ్యాయ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలను ఎండగడుతూ విశాఖ తీరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులు

• కోటిమంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలు యోగాంద్ర కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు.. మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QE0HV


Address

Kakinada Rural
Kakinada

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kakinada Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share