Kakinada District Police

Kakinada District Police This is an initiative by the Kakinada Dist. Police to connect directly with the citizen & redresses Please do not report crime here.

In case of emergency
100 /
9494933233

06/09/2026

కాకినాడ ఇందిరా కాలనీ, ఏలేశ్వరం PS పరిధిలోని కప్పలచెరువులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – 46 మోటార్ సైకిళ్లు సీజ్

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం మరియు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో కాకినాడ నగరంలోని ఇందిరా కాలనీ, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్పలచెరువు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.

ఇందిరా కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ – 21 మోటార్ సైకిళ్లు సీజ్

అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్ గారి పర్యవేక్షణలో, కాకినాడ మూడవ పట్టణ సీఐ శ్రీ కె.వి.ఎస్. సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈగల్ టీమ్, సర్పవరం సీఐ శ్రీ సీహెచ్. ప్రకాష్, పోర్ట్ సీఐ శ్రీ పి. సునీల్ కుమార్, 1 టౌన్ ఎస్‌ఐ శ్రీ సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 21 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

కప్పలచెరువులో కార్డన్ అండ్ సెర్చ్ – 25 మోటార్ సైకిళ్లు సీజ్

పెద్దాపురం ఎస్‌డీపీఓ శ్రీ ఎ.బి.జి. తిలక్ గారి పర్యవేక్షణలో, ప్రత్తిపాడు సీఐ శ్రీ బి. సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్పలచెరువులో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, హెల్మెట్ వినియోగం, లోన్ యాప్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం కోసం 1972, అత్యవసర సేవల కోసం 112, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండి, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని కోరారు.


Dgp Andhra Pradesh
Andhra Pradesh Police
AP Police



























06/09/2026

కాకినాడ జిల్లా తలుపులమ్మ లోవలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తలుపులమ్మ లోవ ప్రాంతంలో తుని రూరల్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

తలుపులమ్మ లోవకు వచ్చే భక్తులు, పర్యాటకుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రదేశాలు, ఆలయ పరిసరాలు, రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతూ, ప్రజల భద్రతకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలని, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయిల్ 112 కి సమాచారం అందించాలని సూచించారు.


Dgp Andhra Pradesh
Andhra Pradesh Police
AP Police



























06/09/2026

కాకినాడ జిల్లాలో రాత్రి పూట అనవసరంగా తిరిగే ఆకతాయిలకు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులు

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘాను మరింత పెంచారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ కిషోర్ కుమార్ గారి పర్యవేక్షణలో గత రాత్రి అనగా 05.09.2026 తేదీన కాకినాడ పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కాకినాడ ఒకటవ పట్టణ సీఐ ఎం. నాగ దుర్గారావు ఆధ్వర్యంలో నైట్ బీట్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. రాత్రి వేళల్లో ఆకతాయిగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. బీచ్ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

అదేవిధంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు, నాకాబందీ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తామని కాకినాడ జిల్లా పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police



























// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో గెజిటెడ్ ఆఫీసర్స్ కేటగిరీలో పతకాలు సాధించిన కాకినాడ జి...
05/09/2026

// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో గెజిటెడ్ ఆఫీసర్స్ కేటగిరీలో పతకాలు సాధించిన కాకినాడ జిల్లా ఏఆర్ డీఎస్పీ శ్రీ వి.జి. శ్రీహరి రావును అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ //
ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గుంటూరు జిల్లా అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో డీఎస్పీ మరియు అంతకంటే ఉన్నత స్థాయి అధికారులతో కూడిన గెజిటెడ్ ఆఫీసర్స్ కేటగిరీలో కాకినాడ జిల్లా తరఫున పాల్గొన్న ఏఆర్ డీఎస్పీ శ్రీ వి.జి. శ్రీహరి రావు విశిష్ట ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.
లాన్ టెన్నిస్ సింగిల్స్‌లో బంగారు పతకం, లాన్ టెన్నిస్ డబుల్స్‌లో బంగారు పతకం, టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించి కాకినాడ జిల్లా పోలీసులకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు శ్రీ వి.జి. శ్రీహరి రావును తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పత్రికా ప్రకటన
తేదీ: 05.09.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police




























03/09/2026

// గణపతి మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన పోలీసు వారి సూచనలు //

గణేష్ ఉత్సవాలు, గణపతి నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణపతి మండపాల నిర్వాహకులు క్రింది సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్, ఐపీఎస్ సూచించారు.

1. అనుమతులు – సింగిల్ విండో విధానం
* గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
* సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన అన్ని అనుమతులను పొందవచ్చు.
* అనుమతుల కోసం https://ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే సంబంధిత స్థల యజమాని అనుమతి తప్పనిసరి.
* ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలి.
* ఫైర్, మున్సిపాలిటీ/పంచాయతీ, విద్యుత్ శాఖలకు సంబంధించిన అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా పొందాలి.
* సింగిల్ విండో విధానం ఆన్లైన్ లో తప్ప ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేయరాదు.

2. ట్రాఫిక్ – ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు
* రహదారికి అడ్డంగా గణేష్ మండపాలు నిర్మించరాదు.
* రహదారులకు అడ్డంకిగా బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయరాదు.
* మండపం వద్ద జరిగే కార్యక్రమాల వల్ల రోడ్డుపై ప్రయాణించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.
* ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మండపం వద్ద కనీసం ఒక వాలంటీర్‌ను నియమించాలి.
* మండపం వద్ద వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.

3. మండప భద్రత – వాలంటీర్ల బాధ్యతలు
* కనీసం ముగ్గురు కమిటీ సభ్యులు/వాలంటీర్లు రాత్రి సమయంలో మండపం వద్ద ఉండి భద్రతను పర్యవేక్షించాలి.
* నాలుగు అడుగులకు మించిన విగ్రహాలు ఏర్పాటు చేసిన మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి.
* మండపం స్టేజీ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని చెక్కలతో లేదా ఇతర సురక్షిత ఏర్పాట్లతో మూసి ఉంచాలి.
* రాత్రి సమయంలో బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను మండపం వద్ద ఉన్నయెడల తగిన జాగ్రత్తలు మండపం కమిటీ వారు తీసుకోవాలి.

4. అనుమానాస్పద వస్తువులు – అప్రమత్తత
* మండపం వద్ద అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు లేదా వాహనాలు ఎక్కువ సమయం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
* మండపం వద్దకు ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులతో వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మండపం కింద, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాలి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
* హాని తలపెట్టే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచి, డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలి.

5. డీజేలు – శబ్ద కాలుష్య నియంత్రణ
* పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా డీజేలు, సౌండ్ బాక్సులు, బాణాసంచా ఉపయోగించరాదు.
* ముందస్తు అనుమతి పొందిన మేరకే డీజేలు, సౌండ్ బాక్సులు, బాణాసంచా ఉపయోగించాలి.
* శబ్దం నిర్ణీత పరిమితులకు లోబడి ఉండేలా చూసుకోవాలి.
* రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు ఎలాంటి లౌడ్‌స్పీకర్లు ఉపయోగించరాదు.
* భక్తి పాటలు మాత్రమె ప్లే చెయ్యవలెను, సినిమా పాటలు, అసభ్యకరమైన పాటలు నిషిద్దం.

6. నిమజ్జన ఊరేగింపులలో పాటించవలసిన నియమాలు
* మద్యం సేవించి గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన రాదు.
* నిర్దేశించిన రూట్ ద్వారా నియమిత సమయంలో ముందుగా సూచించిన ఘాట్ వద్ద మాత్రమె నిమజ్జనం చెయ్యవలెను.
* గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఇతర మతాలు, కులాలు, రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదు.
* ఊరేగింపులు శాంతియుత వాతావరణంలో, పోలీసు శాఖ నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా, నిర్ణీత సమయంలో నిర్వహించాలి.
* ప్రభుత్వం అనుమతించిన నిమజ్జన ఘాట్ల వద్ద మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలి.
* నిమజ్జన సమయంలో ఎటువంటి నీటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
* ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
* పోలీస్ వారికి సహకరిస్తూ ఊరేగింపు ముందుకు కదిలించాలి మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవాలి.

7. అసాంఘిక కార్యకలాపాలకు నిషేధం
* సినిమా పాటలు, అశ్లీల నృత్యాలు, అసభ్యకరమైన పాటలు, రికార్డింగ్ డ్యాన్సులు, కొజ్జా మేళం తదితర అసాంఘిక కార్యకలాపాలు గణేష్ మండపాల వద్ద లేదా ఊరేగింపుల్లో అనుమతించబడవు.
*భక్తి పాటలు మాత్రమె అనుమతించ పడతాయి.

8. విద్యుత్ – అగ్నిప్రమాదాల నివారణ
* మండపానికి అమర్చిన విద్యుత్ తీగలను ఎవరూ అనవసరంగా ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* షార్ట్ సర్క్యూట్ జరగకుండా వైర్లు, విద్యుత్ కనెక్షన్లు సక్రమంగా ఏర్పాటు చేయాలి.
* మండపంలో రాత్రి సమయంలో నూనె దీపాలు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
* అగ్నిప్రమాదాల నివారణ కోసం ఇసుక బస్తాలు, నీటి తొట్టెలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.
* మండపం వద్ద టపాకాయలు, ఇతర పేలుడు పదార్థాలు ఉంచరాదు.

9. సోషల్ మీడియా పట్ల అప్రమత్తత
* సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మరాదు.
* నిర్ధారణ కాని సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి గణపతి మండప నిర్వాహకుడు పై సూచనలను తప్పనిసరిగా పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కాకినాడ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పత్రికా ప్రకటన
తేదీ: 03-09-2026
జిల్లా పోలీసు కార్యాలయం
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police





























03/09/2026

// అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కాకినాడ జిల్లా ఎస్పీ //
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు దివి. 02/03.09.2026 అర్ధరాత్రి నగరంలోని భానుగుడి, అన్నమ్మ ఘాటీ, డైరీ ఫాం సెంటర్, సర్పవరం సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి వాహనాల తనిఖీలు, గస్తీ విధులను పరిశీలించారు. నగరంలో నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, గస్తీ మరింత పెంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు తమ వైఖరిని మార్చుకోవాలని జిల్లా ఎస్పీ గారు తీవ్ర హెచ్చరిక చేశారు. నేరాలకు పాల్పడే వారు, రౌడీ మూకలు మరియు అలవాటు పడిన నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే వారి నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు తరలిస్తామని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో ఎస్బీ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ గారు జిల్లా ఎస్పీ గారి వెంట ఉన్నారు.
పత్రికా ప్రకటన
తేదీ: 03.09.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police



























02/09/2026

// గణేష్ నిమజ్జనోత్సవాల నిర్వహణపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయ సమావేశం నిర్వహించిన కాకినాడ జిల్లా ఎస్పీ //
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి అధ్యక్షతన రానున్న గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఊరేగింపులను పూర్తి క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. అసభ్యకరమైన పాటలు, అశ్లీల నృత్యాలు, డీజేలకు తావులేకుండా కేవలం భక్తి గీతాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పోలీసు శాఖ సూచించిన సమయపాలనను పాటిస్తూ, అధికారులు నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం ర్యాలీలను నిర్వహించాలని కోరారు. పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జనోత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి ఎవరూ నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు.
విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, ఫైర్ శాఖల అధికారులు నిమజ్జన ఘాట్ల వద్ద అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేయడంతోపాటు, క్రేన్ ఆపరేటర్లు, గజ ఈతగాళ్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా షిఫ్టుల వారీగా విధులు కేటాయించాలని సూచించారు.
నిమజ్జన ఊరేగింపులు నిర్ణీత మార్గాల్లో నిరంతరాయంగా సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, తద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ గారు తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసు శాఖ సూచనలు, సమయపాలన, రూట్ మ్యాప్‌ను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గణేష్ నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, ఉత్సవ కమిటీలు, వివిధ ప్రభుత్వ శాఖలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.
పత్రికా ప్రకటన
తేదీ: 02.09.2026
జిల్లా పోలీసు కార్యాలయం,
కాకినాడ.
AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police





























01/09/2026

గంజాయి సమాచారం ఇచ్చి బహుమతి గెలుచుకోండి.. అంటున్న కాకినాడ జిల్లా పోలీసులు
"రైజ్ ఎగైనెస్ట్ గంజా" పేరుతో భారీ అవగాహన సదస్సు నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీస్
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు "రైజ్ ఎగైనెస్ట్ గంజా" పేరుతో విద్యార్థులు, యువత మరియు ప్రజలకు గంజాయికి వ్యతిరేకంగా విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతో పాటు విద్యార్థులు, యువత మరియు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం "రైజ్ ఎగైనెస్ట్ గంజా" పోస్టర్ ను ఎస్పీ గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
"సమాచారం ఇవ్వండి – సమాజాన్ని కాపాడండి", "గంజాయి రహిత సమాజం – మనందరి బాధ్యత" అనే నినాదాలతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
గంజాయికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, విలువైన సమాచారాన్ని అందించిన వారికి తగిన బహుమతి కూడా అందజేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు తెలిపారు.
గంజాయి సమాచారాన్ని ఇలా అందించండి:
📞 1972 – గంజాయి సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్
📞 112 – అత్యవసర పోలీసు సేవలు
📱 కాకినాడ పోలీస్ వాట్సాప్ నంబర్: 9494933233
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడమే కాకుండా, తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవడంతో పాటు, మాదకద్రవ్యాల నిర్మూలనలో బాధ్యతాయుతమైన పౌరులుగా భాగస్వాములు కావాలని, గంజాయి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఇతర అనర్థాలను తెలిపారు.
అనంతరం గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు, స్థానిక ప్రజలు మరియు పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ గారు ప్రతిజ్ఞ చేయించారు. గంజాయిని పూర్తిగా నిరాకరిస్తామని, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటామని, సమాజంలో గంజాయి నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
మాదకద్రవ్యాల రహిత కాకినాడ జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ గారు ప్రజలను కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, పోర్ట్ ఇన్స్పెక్టర్ పి. సునీల్ కుమార్, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. నాగ దుర్గారావు, టూటౌన్ ఇన్స్పెక్టర్ మజ్జి అప్పలనాయుడు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డి. కృష్ణ చైతన్య, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ కె.వి.ఎస్. సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి. దుర్గా శేఖర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసరావు, తిమ్మాపురం ఎస్సై వై. గణేష్ కుమార్, ఎస్బీ ఎస్సై శోభన్ కుమార్, పోలీసు సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన సుమారు 1,200 మంది విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police






























01/09/2026

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో “చేరువ” కార్యక్రమంలో ముఖాముఖి సమావేశమైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్.,

కాకినాడ జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలలో భాగంగా “చేరువ” కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ముఖాముఖి చర్చలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వాటి ప్రభావం, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తదితర అంశాలపై ఎస్పీ గారు వారితో స్వేచ్ఛగా చర్చించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత ప్రజలకు చేరువ చేసేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఏదైనా ఘటనకు సంబంధించి అవాస్తవాలు లేదా నిర్ధారణ కాని సమాచారాన్ని పోస్ట్ చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, అపోహలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఒక ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను పరిశీలించి, సమాచారం నిజమని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేయడం బాధ్యతాయుతమైన విధానమని సూచించారు.
సోషల్ మీడియాను సానుకూల దృక్పథంతో వినియోగించి సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని కోరారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం, వదంతులు మరియు నిర్ధారణ కాని వార్తలను ప్రచారం చేయడం వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు మరియు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి సహాయం అవసరమైనా, వారు తమకు సమీపంలోని పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చని లేదా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో తనను కలవవచ్చని ఎస్పీ గారు తెలిపారు. తనను కలవడానికి ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదని, ప్రజలకు మరియు యువతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జిల్లా ఎస్పీ గారితో జరిగిన ఈ ముఖాముఖి సమావేశం ద్వారా అనేక ముఖ్యమైన విషయాలను తెలుసుకునే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన, బాధ్యతాయుతమైన సమాచారాన్ని చేరవేయడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
పోలీసులు–ప్రజల మధ్య మరింత సాన్నిహిత్యం పెంపొందించడంతో పాటు, సోషల్ మీడియాను సమాజ శ్రేయస్సు కోసం సద్వినియోగం చేసుకునేలా ఈ “చేరువ” కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు పేర్కొన్నారు.


AP Police
Dgp Andhra Pradesh
Andhra Pradesh Police




























సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో “చేరువ” కార్యక్రమంలో ముఖాముఖి సమావేశమైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్...
01/09/2026

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో “చేరువ” కార్యక్రమంలో ముఖాముఖి సమావేశమైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్.,

కాకినాడ జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలలో భాగంగా “చేరువ” కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ముఖాముఖి చర్చలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వాటి ప్రభావం, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తదితర అంశాలపై ఎస్పీ గారు వారితో స్వేచ్ఛగా చర్చించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత ప్రజలకు చేరువ చేసేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సూచనలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఏదైనా ఘటనకు సంబంధించి అవాస్తవాలు లేదా నిర్ధారణ కాని సమాచారాన్ని పోస్ట్ చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, అపోహలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఒక ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను పరిశీలించి, సమాచారం నిజమని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేయడం బాధ్యతాయుతమైన విధానమని సూచించారు.

సోషల్ మీడియాను సానుకూల దృక్పథంతో వినియోగించి సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని కోరారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం, వదంతులు మరియు నిర్ధారణ కాని వార్తలను ప్రచారం చేయడం వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

అనంతరం పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు మరియు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి సహాయం అవసరమైనా, వారు తమకు సమీపంలోని పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చని లేదా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో తనను కలవవచ్చని ఎస్పీ గారు తెలిపారు. తనను కలవడానికి ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదని, ప్రజలకు మరియు యువతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జిల్లా ఎస్పీ గారితో జరిగిన ఈ ముఖాముఖి సమావేశం ద్వారా అనేక ముఖ్యమైన విషయాలను తెలుసుకునే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన, బాధ్యతాయుతమైన సమాచారాన్ని చేరవేయడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

పోలీసులు–ప్రజల మధ్య మరింత సాన్నిహిత్యం పెంపొందించడంతో పాటు, సోషల్ మీడియాను సమాజ శ్రేయస్సు కోసం సద్వినియోగం చేసుకునేలా ఈ “చేరువ” కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు పేర్కొన్నారు.


Dgp Andhra Pradesh
Andhra Pradesh Police
AP Police





























Address

ANDHRAPRADESH
Kakinada
533001

Telephone

+919494933233

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakinada District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kakinada District Police:

Shortcuts

Share