Bharat Mukti Morcha - Andhra Pradesh

Bharat Mukti Morcha - Andhra Pradesh BMM is an Offshoot wing of the BAMCEF

13/11/2025
10/01/2025

*కొత్తతరానికి కొత్త అక్షరమాల or నవతరానికి నయా అక్షరమాల..*

ఇప్పుడు

*A అంటే ఆపిల్ కాదు A అంటే అంబేద్కర్,*

*B అంటే బాల్ కాదు, B అంటే బుద్ధా,*

*J అంటే జంగిల్ కాదు J అంటే జ్యోతిరావు ఫూలే,*

*P అంటే పెరియార్ రామ సామి,*

*R అంటే రమాభాయి ,*

*S అంటే సావిత్రి భాయి ఫూలే,*

భవిష్యత్తులో మనం ఇవే నేర్చుకోబోతున్నాం,

*నిజమైన చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకుంటున్నాయి , వారి ఘనమైన చరిత్ర ను వారే రాసుకుంటున్నారు అందులో మొదటి మెట్టు వారి మహాపురుషులను వారు గుర్తించటం.*

ఇప్పుడు ఈ దేశం లో ఈ ప్రక్రియ మొదలు అయ్యింది, ఇక మిగిలింది మహాపురుషుల మార్గం లో నడవటమే, వారి లక్ష్యాన్ని పూర్తి చేయటమే తద్వారా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవటమే....

రిజర్వేషన్స్ (ప్రాతినిధ్యలకు)లకు వ్యతిరేకం గా రోజు ఏడ్చేవారు, మేనేజ్మెంట్ కేటగిరీ పేరుతో చేసే ఘోరాలను మాత్రం సపోర్ట్ చేస...
10/07/2024

రిజర్వేషన్స్ (ప్రాతినిధ్యలకు)లకు వ్యతిరేకం గా రోజు ఏడ్చేవారు, మేనేజ్మెంట్ కేటగిరీ పేరుతో చేసే ఘోరాలను మాత్రం సపోర్ట్ చేస్తుంటారు.

26/04/2024

Many people revolted,expressed their displeasure ,and denounced the socio-political conditions of their times ! !. Only Buddha analysed the society and gave a holistic solution to the problems of the society .Buddha knew that he alone can't accomplish the task , there fore he established Bikku sangha to bring about total change in the society..He(Buddha) succeeded in his efforts.To this day his ideology is relevant !!!Inthe same way Babasaheb Dr B R Ambedkar understood the Indian society and gave a holistic solution.He (Babasahib) also established an organisation and waged a war against the unequal social system.Babasahib not only succeeded in getting the rights to the underprivileged people but also shown a clear way of life to lead..The problem is that you and I are enjoying the rights but we are not leading the life which he advocated and asked us to follow !! Now we are facing the consequences for not following his advice ??Our educated fellows have become pseudo intellectuals and each fellow started his own local organisation,and giving his own solution to our problems !!?? Babasaheb clearly said in one sentence "" our problem is our caste"",But our self declared leaders never followed his advice, instead established cast based organizations !!! Dr B R Ambedkar advised us to renounce the present religious system (Brahminical) and embrace Buddhist way of life,but we never taken it seriously and we have become more brahmanised ?!!.We need urgent self analysis......

* #ఉగాది పండుగ / గుడి_పడువా ( మహారాష్ట్ర) పండుగ చారిత్రక వాస్తవాలు #**చత్రపతి శివాజీ (కున్బీ - ఓబీసీ కులం ) గారికి పట్టా...
09/04/2024

* #ఉగాది పండుగ / గుడి_పడువా ( మహారాష్ట్ర) పండుగ చారిత్రక వాస్తవాలు #*

*చత్రపతి శివాజీ (కున్బీ - ఓబీసీ కులం ) గారికి పట్టాభిషేకం / పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి స్థానిక పేశ్వా బ్రాహ్మణు లెవరూ ఒప్పుకోలేదు, ఎందుకంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం శూద్రుడు ఎప్పుడు రాజు కాలేడు, ఒకవేళ అయినా కూడా బ్రాహ్మణుడు శూద్రున్ని రాజుగా ఒప్పుకోడు, అదే జరిగింది చత్రపతి శివాజి గారి విషయం లో. అప్పుడు దూరప్రాంతం అయిన కాశీ నుంచి *గాగాభట్ అనే బ్రాహ్మణ్ణి పిలిపించారు, అతను తన బరువు తగ్గ బంగారం లంచంగా తీసుకొని శివాజి పట్టాభిషేకం కార్యక్రమం పూర్తి చేయించాడు కానీ, శివాజీ నుదుట తన ఎడమ కాలి బొటనవేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైనవాడు శూద్రుడు గనక! మనుస్మృతి ప్రకారం శూద్రునికి రాజు అయ్యే అర్హత లేదు కాబట్టి* ఇటువంటి పరిస్థితి సమకాలీనంలో కూడా మారలేదు.

👉🏾మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో *శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. అలాంటి శివాజీని కుట్రలు కుతంత్రాలతో అగ్రవర్ణాల వారు హత్య చేశారు, బ్రాహ్మణులు శివాజీ హత్యలో పాలు పంచుకున్న బ్రాహ్మణుడు భాస్కర కులకర్ణి*

👉🏾 *శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ కూడా తండ్రి బాటలో నడిచాడు, మనుస్మృతిని ధిక్కరించి 'బుద్ధ భూషణం' అనే పుస్తకం రాశాడు* వేదపురాణాల్ని అధ్యయనం చేసి అవి పనికిరానివని తేల్చాడు. *'ఈ దేశానికి బౌద్ధం ఒక్కటే మార్గం' అని నిర్ణయించుకుని ప్రచారం చేశాడు. శూద్ర కులాల్ని చైతన్యపరిచాడు.*

👉🏾 *శూద్రకులాలు బలపడితే తమకు ప్రమాదమని, అగ్రవర్ణ బ్రాహ్మణులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహాయంతో శంభాజీని, అతని అనుచరుల్ని బంధించారు.*
*మనుస్మృతిలో వర్ణించినట్టుగా చత్రపతి శంభాజి యొక్క కళ్ళు పీకి, చర్మం వొలిచి, నాలుక కోసి అతిక్రూరంగా హత్య చేశారు. శంభాజీ తలను, అతని అనుచరుల తలలను కోసి, వారి కత్తులకు గుచ్చి పూణెలో ఊరేగించారు. మమ్మల్ని ధిక్కరించి కులధర్మాన్ని ధిక్కరించినవాడు చక్రవర్తి అయినా సరే వాడికి ఏ గతి పట్టిందో చూడండంటూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు.* అంటే బ్రాహ్మణులను ఎదిరిస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని హెచ్చరించారన్నమాట!

👉🏾 *శంభాజీని ప్రోత్సహించిన అంటరాని వారికి తర్వాత కాలంలో మూతికి ముంత, నడుముకు చీపురూ కట్టుకోవాలని పేశ్వ బ్రాహ్మణులు ఆజ్ఞ జారీ చేశారు ఎందుకు అంటే , చత్రపతి శంభాజీ మహారాజు ను బ్రాహ్మణులు హత్య చేసి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి పారవేస్తే , ఆ శరీరపు భాగాల్ని అక్కడ వున్నారు వంటి అంటరాని కులాల వారు తీసుకు వచ్చి రాచ మర్యాదలతో దహన సంస్కార కార్యక్రమం నిర్వహించటం బ్రాహ్మణులకు విపరీత కోపం తెప్పించింది అందుకే అంటరానివారికి శిక్షగా మూతికి ముంత , నడుముకు పొరకను శిక్షగా వేయటం జరిగింది.*

👉🏾 *ఛత్రపతి శంభాజీ హత్యకు గుర్తుగా .. ఒక కర్ర పై ఎర్రటి బట్ట ముక్కను పెట్టీ దానిపై ఒక చెంబును బోర్లించి పెట్టి ఊరేగించడం!*

*చెంబును కర్ర పై భాగం లో పెట్టడం అంటే శంభాజి మహారాజ్ గారినీ హత్య చేసిన తరువాత ఆయన తలను శరీరం నుండి వేరు చేసి కట్టెకు కట్టి పూనేలొ ఊరేగించారు పీశ్వా బ్రాహ్మనులు..*

*శంభాజీ మహారాజ్ గారిని అతిక్రూరంగా తలనరికి చంపి తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వివిద ప్రాంతాల్లో పడేవేసి, ఇక నుండి చత్రపతి యుగం పూర్తయి , కొత్తగా బ్రాహ్మణ పీశ్వ యుగం మొదలు అయ్యిందీ నూతన సంవత్సరము / యుగము అని ప్రకటించారు..మహారాష్ట్రలో అదే గుడిపడవా, మన తెలుగు ప్రాంతాల్లో అదే ఉగాది, దానే బ్రాహ్మణులు యుగాది అని కూడా చెబుతారు, దానికి వివరణగా యుగం + ఆది = యుగాది అని, అంటే కొత్త యుగం మొదలు అయ్యింది అని మనకు చెబుతారు , మరి ఇక్కడ ఎవరి / ఏ యుగం మొదలు అయ్యి , ఎవరి/ ఏ యుగం మొదలు అయ్యింది అంటే ఎవరూ చెప్పరు.*

*అందుకే ఉగాది ఏ విధంగానూ మన పండగ కాదు అనేది విశ్లేషకులు, చరిత్ర కారులు, మేధావులు ఇప్పుడు చెపుతున్నారు, నిజానికి ఈ దేశ మూలవాసులకు ఉగాది/ గుడి పడవా/ యుగాది అనేది ఒక దుర్దినం, ఎందుకంటే ఒక గొప్ప రాజును కోల్పోయిన రోజు ఇది, కొత్త సంవత్సరం పేరుతో పంచాంగ చెబుతూ ఎవరికి ఎంత లాభం , ఎంత ఖర్చు, ఎంత గౌరవం, ఎంత అవమానం అని ప్రజలను మభ్య పెడుతున్నారు బ్రాహ్మణులు, బ్రాహ్మణ రాజ్యం మొదలు అయిన తరువాత ఎవరెవరికి ఎంత ఢబ్బులు ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత మర్యాద , గౌరవం ఇవ్వాలి, ఎవరెవరికి ఏమేమి శిక్షలు , అవమానాలు చేయాలి అనేది బ్రాహ్మణులే నిర్ణయిస్తారు, అప్పుడు పంచాగం తో కూడా పని ఏముంది ?* 🤷🏻‍♂️
*కాబట్టి నిజమైన చరిత్రను తెలుసుకుందాం, మన ప్రజలకు తెలియ చెబుదాం...మన ప్రజలను జాగృతి వైపు నడుపుదాం..*

*జై భీమ్..*
*జై మూల్ నివాసి...*

*BAMCEF*
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ*

మార్చి నెల  17 - 2024 ఆదివారం నాడు నంద్యాల జిల్లా , ఆత్మకూరు మండలం ఆత్మకూరు, నందు BAMCEF సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనర...
19/03/2024

మార్చి నెల 17 - 2024 ఆదివారం నాడు నంద్యాల జిల్లా , ఆత్మకూరు మండలం ఆత్మకూరు, నందు BAMCEF సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డా.నిరంజన్ గారు , BAMCEF యొక్క 90 అనుబంధ సంస్థ లలో ఒక అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ పిచడ వర్గ్ ( జాతీయ వెనుకబడిన తరగతుల వర్గం) యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల వర్గం ( రాష్ట్రీయ పిచ్డ వర్గ - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ) రాష్ట్ర కన్వీనర్ అయిన డా.నాగన్న గారి సారధ్యంలో "రిజర్వేషన్లు - ఒక అవగాహన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది, ఇందులో భాగంగా OBC,SC ST వర్గాలకు చెందిన 40 మంది ఉద్యోగులు, కొంతమంది విద్యార్థులు, మరికొంత మంది ఇతరులు పాల్గొనటం జరిగింది, డా.నాగన్న గారు మాట్లాడుతూ, ప్రపంచం లో ఏ దేశం లో లేని ఒక వ్యవస్థ అదే కుల వ్యవస్థ కేవలం ఒక్క భారతదేశం లో మాత్రమే ఉందని, దీనితోటే దేశం లోని అన్ని సమస్యలు ముడిపడి ఉన్నాయని, కుల వ్యవస్థ ను అర్థం చేసుకోకుండా ఏ సమస్యా అర్థం కాదని, కాబట్టి కుల వ్యవస్థ ను గూర్చి పూర్తి అవగాహన కలిగి వుండాలి అని చెబుతూ ముఖ్యంగా ఈ దేశం లో 52% వున్న OBC లకు కేవలం 27% రిజర్వేషన్ లు ఇస్తూ అది కూడా క్రిమీలేయర్ ద్వారా ముడిపెట్టి OBC లను మోసం చేసే విషయాలను గూర్చి చర్చ చేయటం జరిగింది, అలాగే ప్రధాన వక్త - డా.నిరంజన్ గారు మాట్లాడుతూ అసలు రిజర్వేషన్ లు అంటే ఏమిటి ? ఎప్పుడు రిజర్వేషన్ లు మొదలు అయ్యాయి, దానికి గల కారణాలు ఏమిటి ? అలాగే రిజర్వేషన్ లపై గల పలు అపోహలను గురుంచి వివరించటం జరిగింది, ఈ దేశం లో కేవలం 3% వున్న బ్రాహ్మణులు EWS పేరుతో 10% రిజర్వేషన్ అక్రమంగా, రాజ్యంగ విరుద్ధంగా పొందుతూ 52% వున్న OBC లకు మాత్రం 27 % రిజర్వేషన్లు ఇస్తూ మోసం చేస్తున్నారని అలాగే OBC ల జనగణన జరుపవలసిన ప్రతీసారీ బ్రాహ్మణులు చేసిన కుట్రలను గూర్చి తెలిపారు, అలాగే 3% వున్న బ్రాహ్మణులు చదువును పూర్తిగా వారి ఆధీనం లో పెట్టుకుని ఈ దేశం లో 3000 సంవత్సరాలుగా విద్యలో రిజర్వేషన్ అనుభవిస్తున్నారని, ఒక రకంగా ఈ దేశం లో రిజర్వేషన్లు మొదలు పెట్టింది బ్రాహ్మణులు అని కానీ ఈ రోజు కేవలం 75 సంవత్సరాలుగా కేవలం రాజ్యాంగం ద్వారా మాత్రమే చదువుకునే హక్కును పొందిన OBC, SC,ST మరియు ఇతర మైనారిటీ ప్రజలకు చదువుకునే అవకాశం వస్తె ఆ ఒక్క అవకాశాన్ని కూడా ప్రైవటైజేశన్ పేరుతో, నూతన విద్యా చట్టం వంటి కొత్త కొత్త చట్టాలతో ఈ దేశ మూల వాసులు అయిన OBC, SC,ST మరియు ఇతర మైనారిటీ ప్రజలకు విద్యను మళ్ళీ దూరం చేస్తున్నారని, రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు అని వివరించటం జరిగింది, డా .నిరంజన్ గారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ జనాభా ప్రాతిపదికన రిజ్వేషన్ లు కల్పించాలని ఈ దేశం లో మొట్టమొదట ప్రతిపాదించింది మహాత్మ జ్యోతిరావు ఫూలే అని, అందుకోసం బ్రిటీష్ వారికి అనేక వుత్తరాలు రాశారని, దీని ఆధారంగానే చత్రపతి .సాహు మహారాజు తన ఆస్థానం లో మొట్ట మొదటగా రిజర్వేషన్లు కల్పించారని, చివరగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పించారని వివరించటం జరిగింది, అంతేకాక బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనకు చదువును ఇచ్చింది జ్ఞానం పెంచు కోవటానికి అని, చదువుకున్న వారు తమ జ్ఞానాన్ని సమాజ హితం కొరకు ఉపయోగించాలని చెబుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మార్చి 18 , 1950 లో ఆగ్రా పట్టణం లో మాట్లాడిన మాటలను మీటింగ్ కు హాజరు అయిన వారికి గుర్తు చేయటం జరిగింది.*
*చివరగా భారత దేశం లో BAMCEF సంస్థ చేస్తున్న కార్యక్రమాలను గూర్చి వివరించటం, దేశ వ్యాప్త ఉద్యమం యొక్క ఆవశ్యకత ను వివరించటం, దేశ వ్యాప్తంగా పనిచేసే సంస్థ యొక్క అవసరతను, ఆవశ్యకత ను గూర్చి వివరించారు.*
*కార్యక్రమానికి హాజరు అయినవారు చివర్లో మాట్లాడుతూ రిజర్వేషన్ల గురుంచి తమకు వున్న చాలా అనుమానాలు నివృత్తి అయ్యాయి అని కార్యక్రమ నిర్వాహకులు అయిన డా.నాగన్న గారిని అభినందించడం జరిగింది.*

మౌర్యుల కాలంలో నిర్మించబడిన *బౌద్ధ స్తూపాలు ను బ్రాహ్మణుల ఆక్రమణ నుండి రక్షించి తిరిగి బౌద్ధులకు అప్పగించాలి అనే అంశం మీ...
19/03/2024

మౌర్యుల కాలంలో నిర్మించబడిన *బౌద్ధ స్తూపాలు ను బ్రాహ్మణుల ఆక్రమణ నుండి రక్షించి తిరిగి బౌద్ధులకు అప్పగించాలి అనే అంశం మీద దేశ వ్యాప్తంగా ఇప్పుడు BAMCEF పోరాటం మొదలయ్యింది, BAMCEF కు వున్న 90 అనుబంధ శాఖలలో ఒకటి అయిన బుద్ధిష్ట్ ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ద్వారా BAMCEF జాతీయ అధ్యక్షులు మాన్యులు. వామన్ మేశ్రామ్ గారి అధ్యక్షతన, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ నిర్వాహకులు, BAMCEF జనరల్ సెక్రటరీ మాన్యులు డా.విలాస్ ఖరాత్ గారి ఆధ్వర్యంలో నిన్న కార్యక్రమం నిర్వహించటం జరిగింది, ఇందులో వందల సంఖ్య లో ప్రజలు పాల్గొని భవిష్యత్తు పోరాటానికి సిద్ధం అవుతున్నారు...*

*దేశ వ్యాప్త ఉద్యమాలు జరగబోతున్నాయి భవిష్యత్తులో , BAMCEF బహుముఖ పోరాటాలు చేస్తుంది ఈ దేశం లో, అందుకే 90 అనుబంధ శాఖలను తయారు చేసింది... భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛ రావాలి అంటే సామాజిక పోరాటాలే మార్గం..*
*కానీ మనవాళ్లు రాజ్యాంగం ఆపదలో వుంది, కాపాడు కోవాలి అని ఇప్పుడు మాట్లాడతున్నారు, నిజానికి మన వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మన ఓటు మన చేతిలో లేదు, మన ఓటు మన చేతిలో లేదంటే మనల్ని మనం కూడా కాపాడుకోలేము, ఇక రాజ్యాంగాన్ని ఏం కాపాడుతాము మనం ? దేశ వ్యాప్త ఉద్యమం లో మనం భాగస్వాములం కాకుండా మనం భవిష్యత్తులో ఏమి కూడా సాధించలేము.*

ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధుల చరిత్రలో  12 మార్చి, 2024 నాడు చారిత్రాత్మక మైన రోజు ఎందుకంటే ఆ రోజు ఒక చారత్రాత్మక మైన ఘట్టం చరిత...
13/03/2024

ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధుల చరిత్రలో 12 మార్చి, 2024 నాడు చారిత్రాత్మక మైన రోజు ఎందుకంటే ఆ రోజు ఒక చారత్రాత్మక మైన ఘట్టం చరిత్రలో చోటు చేసుకుంది, అది ఏంటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వున్న బౌద్ధ విహరాల లో కాకినాడ బౌద్ధ విహారం ఒకటి, ఎంతోమంది బౌద్ధ ఉపాసకులు ఇక్కడ బౌద్ధాన్ని నేర్చుకుని ఆచరిస్తూ వున్నారు, ఇప్పుడు ఆ బౌద్ధులు ఆనాటి బుద్దుడు ఏవిధంగా అయితే ఆనాటి సామాజిక రుగ్మతలు అయిన వర్ణ వ్యవస్థ ద్వారా, స్త్రీ బానిసత్వం ద్వారా యజ్ఞ యాగాదుల ద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని , మోసాలను, తద్వారా దుఃఖం పొందుతున్న సామాన్య ప్రజలకు, బుద్దుడు తాను పొందిన జ్ఞానోదయం , తద్వారా తాను కనుగొన్న ధమ్మం ను ప్రచారం చేస్తూ, అందుకు గాను సుసుక్షితు లైన బౌద్ధ బిక్కులను తయారు చేసి దమ్మాను ప్రచారం చేసి ప్రజల దుఃఖానికి కారణం ను తెలిపి దాని నుండి బయట పడే మార్గాన్ని బోధించి, ప్రజలు స్వేచ్ఛ పొందేలా ప్రజలను జాగృతి చేశారు, అప్పుడు ప్రజలు వారి అంతకు వారే దుఃఖ విముక్తి పొందారు , ఇప్పుడు కూడా మనకు కష్టాలు వున్నాయి, నిరుద్యోగం, స్త్రీ బానిసత్వం, విద్య లేకపోవటం, అస్పృశ్యత, అవమానం, దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని మరి వీటికి కారణాలు ఎంటి?

స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనగా రాజ్యాంగం రాసుకుని 75 సంవత్సరాలు దాటుతున్న కూడా మన ప్రజలకు కష్టాలు రోజు రోజు కూ పెరుగుతున్నాయి తప్పా తరగటం లేదు, ఇందులో భాగంగానే ప్రజలు అనేకానేక పోరాటాలు చేస్తున్నారు, ఇందులో భాగంగానే అనేక సామాజిక, రాజకీయ పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రజల కష్టాలు తీరటం లేదు, అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలు ఏకం అవుతున్నారు, వారికి గల సమస్యలు గల కారణాలను సహేతుకంగా తర్కించి తెలుసుకుని వాటి ఆధారంగా ఈ దేశ మూల వాసి ప్రజలు దేశ వ్యాప్తంగా సంఘటితంగా పోరాటాలు చేస్తున్నారు, అందులో భాగంగానే *ఇప్పుడు దేశం లో అతి ముఖ్యమైన సమస్య EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు.*

*మన అందరికీ తెలిసినట్టు ఇప్పుడు దేశ వ్యాప్తంగా EVM లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అనేక రాజకీయా పార్టీలు, ప్రజా సంఘాలు, EVM వ్యతిరేక ఉద్యమాలు జరుపుతున్నాయి.*

*ఇప్పుడు దేశ ప్రజలు అందరూ ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు యొక్క విలువను తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, అలాగే ఒకవేళ ఓటు హక్కును కోల్పోతే, అప్పుడు రాబోయే ఉపద్రవాన్ని కూడా ఇప్పుడు ప్రజలు గుర్తించారు, అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా EVM ల ద్వారా మన ఓటు ఏవిధంగా విలువ కోల్పోతుంది అనేది, BAMCEF జాతీయ అధ్యక్షులు మాన్యులు వామన మెస్రం గారి ద్వారా అలాగే ప్రజలను నిరంతరం జాగృతి చేసే BAMCEF లాంటి సంస్థ లాంటి ద్వారా EVM ల ద్వారా జరిగే మోసం గురుంచి ఇప్పుడు దేశ ప్రజలు అందరికీ తెలిసి పోయింది, అందుకే BMM (భారత్ ముక్తి మోర్చ) లాంటి ప్రజాస్వామిక , ఇతర ప్రజా ఉద్యమ సంస్థలు, అలాగే సుప్రీం కోర్టు లాయర్లు, రాజకీయ పార్టీలు మొన్న ఆ మధ్య అనగా 2024 , జనవరి 22 నాడు ఢిల్లీ జంతర్ మంతర్ లో దాదాపు లక్ష మంది కి పైగా ప్రజలతో EVM లకు వ్యతిరేకంగా, అలాగే ECI (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) యొక్క తీరును నిరసిస్తూ ఒక పెద్ద ర్యాలీ మరియు ధర్నా ప్రదర్శన కార్యక్రమం ను నిర్వహించారు, కాకపోతే ఇంత పెద్ద విషయాన్ని ఏ మీడియా పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చూపలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు మరింతగా ఆలోచిస్తున్నారు, మీడియాలో చూపకపోవడం వలన ప్రజల అనుమానం మరింతగా అనుమానిస్తున్నారు, అందుకే ఇప్పుడు తమ ఓటు గురుంచి, ఓటు విలువ గురుంచి ప్రజలు చర్చ చేస్తూ అర్థం చేసుకుంటున్నారు, అందుకే తమ నిరసనను దేశ వ్యాప్తంగా తెలియ చేస్తున్నారు, ఇప్పుడు EVM ల గురుంచిన జాగృతి దేశ వ్యాప్తంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది, అందుకే దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చెందుతున్నారు...*

*అందులో భాగంగానే ఇప్పుడు కాకినాడ బౌద్ధ విహార సభ్యులు, కాకినాడ లో వున్న ప్రజాస్వామిక వాదులును, ఇతర ప్రజా సంఘాలును కలుపుకుని EVM లకు వ్యతిరేకంగా దాదాపు 70 మంది ప్రజల తో కలసి కాకినాడ లో స్థానిక కలెక్టరేట్ వద్ద గల బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తమ నిరసనను తెలియచేశారు, ఈ విధంగా తమ నిరసనను తెలియచేయటం వలన ఇతర ప్రజలు , EVM ల ద్వారా జరిగే ఎన్నికల ద్వారా జరిగే మోసం గురుంచి, తద్వారా ఓటు యొక్క విలువ ఎలా శూన్యం కబడుతుంది, ప్రజాస్వామ్యం ఎలా నాశనం అవుతున్నాయి, రాజ్యాంగం ఎలా నాశనం అవుతున్నాయి అని ఆలోచించటం మొదలు పెట్టారు..*

*నిజంగా ఇది ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధుల చరిత్రలో ఒక గొప్ప కార్యక్రమం, ఆనాటి బౌద్ధులు ఏ విధంగా అయితే ఆనాటి సామాజిక సమస్యల గురుంచి పోరాటం చేశారో అదే విధంగా ఈ నాటి కాకినాడ బౌద్ధులు కూడా ఈనాడు దేశంలోని ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ప్రజల ప్రాథమిక హక్కు కు ప్రమాదం కలిగించే EVM లకు వ్యతిరేకంగా తమ గొంతుకను వినిపించారు, ఇది అత్యంత గొప్ప విషయం, ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ప్రజాస్వామిక వాదులు రాష్ట్ర వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు, ఈ నిరసన కార్యక్రమం చాలా మందికి ప్రేరణ కలిగించింది.*
*అయితే కొద్దిమందికి ఒక అనుమానం కలగవచ్చు, ఆనాడు బుద్దుడు కానీ బుద్ధ విహారాలు కానీ ఆధ్యాత్మిక ను బోధించాయి కదా ? మరి ఇప్పుడు బుద్ధ విహార ప్రజలు EVM లకు వ్యతిరేకంగా నిరసన తెలపటం ఎంటి అని ?*

*మనం ఒకసారి చరిత్రను బాగా అధ్యయనం చేస్తే బుద్దుడు నిజానికి సామాజిక పోరాటం చేశాడు,ఆనాటి సామాజిక , రాజకీయ సమస్యకు పరిష్కారం కోసం పని చేశాడు, కానీ ఈ విషయం తెలియని సాధారణ ప్రజలు బుద్దుడు ఆధ్యాత్మిక వాది కదా?*
*ఆధ్యాత్మికం అంటే అలౌకికము కదా అని చాలా మంది అభిప్రాయ పడతారు, కానీ నిజానికి "బుద్దుడు చెప్పిన ఆధ్యాత్మికం లౌకిక మైనదీ, అంటే భూమి మీద మనిషికి కలిగే దుఃఖానికి కారణం అయిన దుఃఖ హేతువుల గురుంచి తెలియజేయునది, దుఃఖ విముక్తి కి మార్గం చూపి , భూమి మీద మనిషి సంతోషంగా జీవించి నిర్వాణ స్థితిని( దుఃఖ రహిత స్థితి) చేరుకునే మార్గం" బుద్దుడు బోధించిన ఆధ్యాత్మిక మార్గం,*

*🔥అంతేకాని సాధారణ ప్రజలు అనుకున్నట్టు బుద్దుడు బోధించిన మార్గం అలౌకికము అంటే ఈ లోకానికి సంబంధము లేనిది కాదు..అనే అభిప్రాయం తప్పు" ఈ రకంగా చూస్తే కాకినాడ బౌద్ధులు , బుద్ధ విహార ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించటం జరిగింది.*
*అలాగే రాష్ట్రం లోని మిగిలిన ఇతర బుద్ధ విహార నిర్వాహకులు, బౌద్ధులు కూడా ఈ విధంగా బుద్దుడు చూపిన మార్గం లో పయనించాలని, ఈనాటి అత్యంత ఆవశ్యక , సామాజిక సమస్య అయిన EVM ల మీద అలాగే ఇతర ముఖ్య సమస్యల మీద ప్రజలను జాగృతి చేస్తారని కోరుకుందాం అలాగే దేశ ప్రజలు ఆశిస్తున్నట్టు దేశంలో EVM ల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే ఎన్నికలు తిరిగి రావాలని , తద్వారా ప్రజల ఓటును , ఓటు యొక్క విలువను, తద్వారా ప్రజాస్వామ్యము , రాజ్యాంగము కాపడబడతాయని ఆశిద్దాం.*
*"ఎందుకంటే మనం మన ఓటును కాపాడుకుంటే మాత్రమే మిగిలిన ప్రజాస్వామ్యం కానీ, రాజ్యంగము కానీ కాపడబడతాయి లేదంటే భవిష్యత్తులో త్వరలోనే రాబోయే బానిస వ్యవస్థ లో బానిసత్వం అనుభవించటానికి సిద్దం కావాల్సిందే..."*

*చివరగా కాకినాడ బుద్ధ విహార కు ప్రత్యేక అభినందనలు*💐💐
జై భీమ్
జై మూల నివాసి

ఇట్లు
BAMCEF
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ.

*10 వ తేదీ, మార్చి నెల, 2024 నాడు  కర్నూలు జిల్లా లోని యునాని హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్ నందు బామ్ స...
13/03/2024

*10 వ తేదీ, మార్చి నెల, 2024 నాడు కర్నూలు జిల్లా లోని యునాని హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్ నందు బామ్ సేఫ్ మరియు ఇతర ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మనకు తెలియని మన చరిత్ర ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రధాన శిక్షకుడిగా ఆంధ్ర ప్రదేశ్ బామ్ సేఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ రాముడు గారు వచ్చి ఉన్నారు ముఖ్యఅతిథిగా కర్నూల్ జిల్లా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నాగమ్మ గారు పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిలుగా సీనియర్ వైద్యులు డా.నాగన్న గారు - ఆత్మకూరు, డాక్టర్ రాజేష్ గారు ప్రొఫెసర్ కర్నూల్ మెడికల్ కాలేజీ, గవర్నమెంటు మెడికల్ కాలేజీ, నంద్యాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ గారు, సీనియర్ మత్తుమందు వైద్యులు డాక్టర్ రఘు ప్రవీణ్ గారు - కర్నూలు , సీనియర్ రేడియాలజీ వైద్యులు డాక్టర్ అశోక్ గారు- కర్నూల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.వర సుబ్రమణ్యం గారు కడప రిమ్స్ మెడికల్ కాలేజీ - కడప, రిటైర్డ్ టీచర్ పద్మ గారు పాల్గొన్నారు. ఇంకా భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గడ్డం వెంకట్రావు గారు , ఉన్నం రాజేష్ గారు, జయన్న గారు, ఖాదర్ గారు జబ్బర్ మౌలానా గారు, అలాగే SC , ST మరియు BC మహిళల ఐక్య వేదిక అధ్యక్షురాలు పట్నం .రాజేశ్వరి గారు వారి సంఘ సభ్యులు, అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం డా. కార్తీక్ చిన్న పిల్లల హాస్పిటల్ సిబ్బంది , నుండి, కర్నూల్ జిల్లా ILPA నాయకులు బంగి.సుధీర్ గారు మరియు ఇతర లాయర్లు ఇంకా ఇతర ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు మొత్తం దాదాపుగా 120 మంది పైచిలుకు గా హాజరయినారు. ఉదయం కార్యక్రమం 10 గంటలకు మొదలై సాయంత్రం 7:30 గంటల వరకు సాగింది, హాజరు అయిన వ్యక్తులు చివరగా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మన మూల నివాసి ప్రజలకు ఇప్పుడు అత్యావశ్యకం అని , ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మరినీ త్వరలోనే వివిధ జిల్లాల్లో ILPA ( ఇండియన్ లాయర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్) తరుపున జరుపుతామని చెప్పటం జరిగింది.హాజరు అయిన వ్యక్తులు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని తరవాత కార్యక్రమం చివర తమవంతుగా BAMCEF జాతీయ నిధికి విరాళాలు ఇవ్వటం జరిగింది ..*

జై భీమ్
జై మూలనివాసి.
BAMCEF
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ.

Address

Kakinada
533 ###

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharat Mukti Morcha - Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category