Tdp Kambadur

Tdp Kambadur Jai TDP

నీళ్ళొస్తే మరో కోనసీమ అవుతుంది... ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబ సభ్యులు...అనంతపురం జిల్లా బ్రహ్మాసముద్రం మండలం ఎర్ర...
06/04/2024

నీళ్ళొస్తే మరో కోనసీమ అవుతుంది...

ఎన్నికల ప్రచారంలో అమిలినేని కుటుంబ సభ్యులు...

అనంతపురం జిల్లా బ్రహ్మాసముద్రం మండలం ఎర్రప్పదొడ్డి, తిప్పయ్యదొడ్డి, తాటాకులదొడ్డి గ్రామాల్లో కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కుమార్తె చరిత, సోదరి పద్మావతి, కుటుంబ సభ్యులు పర్యటించి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరెళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులు, బీటీపీకి నీళ్లు తీసుకువచ్చేందుకు కాలువలు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని, సాగు నీరు వస్తే ఈ ప్రాంతం మరో కోనసీమలా ఉంటుందని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు . కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి..  పరిశ్రమలు వస్తే ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది....  రోడ్ షోలో అమిలినేని, అంబికా 05.04.2024 ఈ...
05/04/2024

నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి..
పరిశ్రమలు వస్తే ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది....
రోడ్ షోలో అమిలినేని, అంబికా

05.04.2024 ఈరోజు అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. కుందుర్పి మండల టీడీపీ నాయకుల సమావేశానికి విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు, ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు* టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు ఘజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి అంబికా మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేయడం జరిగిందని, రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఎన్నికలు వస్తాయ ఈ మోసపు జగన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురుచూస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు మహాశక్తి పథకాన్ని తీసుకువస్తారని తప్పకుండ తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలని కోరారు .
అమిలినేని మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలు రావాలన్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరెళ్లలో తప్పకుండా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తామని, నీళ్లు వస్తే ఇక్కడ APIIC తీసుకున్న భూమిలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఎంతో మందికి ఉపాధి కల్పించడం కోసం పనిచేస్తామని సమావేశంలో హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కాపాడే వ్యక్తి, విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా రాష్ట్రనికి కూడా మరిన్ని IT, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర పరిశ్రమలు తీసుకువస్థాడని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలాని అభ్యర్థించారు...

కార్యక్రమంలో కళ్యాణదుర్గం సీనియర్ టీడీపీ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

దుగ్ధమైన గడ్డి వామును పరిశీలించిన సురేంద్ర బాబు అల్లుడు అవినాష్ !!కళ్యణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని, దొడగట్ట గ్రామంలో బ...
05/04/2024

దుగ్ధమైన గడ్డి వామును పరిశీలించిన సురేంద్ర బాబు అల్లుడు అవినాష్ !!
కళ్యణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని, దొడగట్ట గ్రామంలో బిక్కిళప్ప అనే రైతు గడ్డి వాము నిన్న రాత్రి దుగ్ధమైన విషయం తెలుసుకున్న అవినాష్ గారు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మనోదైర్యం చెప్పి, అండగా ఉంటామని తెలియజేశారు!!

టీడీపీ కార్యకర్త మృతికి నివాళి అర్పించిన:- నవీన్ అనంతపురం జిల్లా కంబదూరు మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్య...
03/04/2024

టీడీపీ కార్యకర్త మృతికి నివాళి అర్పించిన:- నవీన్

అనంతపురం జిల్లా కంబదూరు మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముద్దుల్ల రామాంజప్ప అనారోగ్యం కారణంగా మృతి చెందగా విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అల్లుడు నవీన్ గారు.. కుటుంబాన్ని పరమార్శించి తెలుగుదేశం పార్టీ తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు....


దళిత సోదరులు ఐక్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వండి...  తెలుగుదేశం పార్టీబ్ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని.... అనంతపురం ...
03/04/2024

దళిత సోదరులు ఐక్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వండి...

తెలుగుదేశం పార్టీబ్ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని....

అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని కొత్త దళిత వాడలో జరిగిన దళితులతో సహపంక్తి భోజనానికి దళిత సోదరుల ఆహ్వానం మేరకు కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గారు పాల్గొన్నారు. దళిత సోదరులతో కలసి అమిలినేని సహపంక్తి భోజనం చేయడం జరిగింది. అనంతరం వారితో మాట్లాడతూ దళిత సోదరులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండాలని, దళితులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేసింది ఒక్క టీడీపీ పార్టీనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప కుండా దళిత సంక్షేమ పథకాలు తిరిగి అమలు అవుతాయని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

02-04-2024 Paper Articles
02/04/2024

02-04-2024 Paper Articles

తెలుగువారి అభ్యున్నతి కోసం, ఆత్మగౌరవం నిలపడం కోసం ఆంధ్రుల అన్నగారు నందమూరి తారక రామారావు గారు 1982, మార్చి 29న తెలుగుదేశ...
29/03/2024

తెలుగువారి అభ్యున్నతి కోసం, ఆత్మగౌరవం నిలపడం కోసం ఆంధ్రుల అన్నగారు నందమూరి తారక రామారావు గారు 1982, మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు


దూకుడు పెంచిన యువనేత!!ఎన్నికల ప్రచారంలో  స్పీడ్ పెంచిన అమిలినేని యశ్వంత్ గారు!!కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 9వ వార్డులో ఇంట...
28/03/2024

దూకుడు పెంచిన యువనేత!!

ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన అమిలినేని యశ్వంత్ గారు!!

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 9వ వార్డులో ఇంటిటికి వెళ్లి తెలుగుదేశం కూటమి అభ్యర్థి సురేంద్ర బాబు గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న యువనేత అమిలినేని యశ్వంత్ గారు!!


27-03-24 Papers
27/03/2024

27-03-24 Papers

26/03/2024


హడావిడి - ఆర్భాటాలు అసలు లేవు!!జనం సమస్యలు తెలుసుకోవడానికి వెనక మంది బలం అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలని నిరూపిస్తున్న ...
26/03/2024

హడావిడి - ఆర్భాటాలు అసలు లేవు!!
జనం సమస్యలు తెలుసుకోవడానికి వెనక మంది బలం అవసరం లేదు,
మంచి మనసు ఉంటే చాలని నిరూపిస్తున్న యువనేత!!
సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ముందుకెళ్తున్న యువనాయకుడు!!
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ,స్థానిక చిరు,వ్యాపారుల సమస్యలు వింటూ పట్టణంలో పర్యటిస్తున్న యువనేత అమిలినేని యశ్వంత్ గారు !!






26/03/2024

Address

Kalyandrug

Website

Alerts

Be the first to know and let us send you an email when Tdp Kambadur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share