TRS PARTY kamareddy

TRS PARTY kamareddy politics

Permanently closed.
01/02/2022
*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్...
01/02/2022

*కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.*

ఎయిర్ ఇండియాను అమ్మేశారు.. ఎల్ఐసీని కూడా అమ్మెస్తమని బడ్జెటలోనే చెప్పేశారు సీఎం కెసిఆర్కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కే...
01/02/2022

ఎయిర్ ఇండియాను అమ్మేశారు.. ఎల్ఐసీని కూడా అమ్మెస్తమని బడ్జెటలోనే చెప్పేశారు సీఎం కెసిఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022పై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రగతి భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. కేంద్ర బడ్జెట్ దారుణమైన బడ్జెట్ అన్నారు.

పచ్చి అబద్ధాలు మాట్లాడటం.. దేశాన్ని అమ్మేయడమే బీజేపీ ప్రభుత్వానికి తెలుసని కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ఎల్ఐసీని కూడా అమ్మేస్తామని బడ్జెట్‌లోనే కేంద్రం స్పష్టం చేసింది. నష్టం వస్తే అమ్మాలి కానీ.. మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

బ్యాంకుల అప్పులు తీసుకొని వేల కోట్లు, లక్షల కోట్లు ముంచిపోయినోళ్లకు సబ్సిడీలు ఇస్తున్నారు. రీఫార్మ్ పేరు మీద కరెంట్ సంస్కరణల పేరు మీద ఇతరుల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్మడమే. మత పిచ్చి లేపుడు.. దాంతో రాజకీయ పబ్బం గడుపుకొనుడు. ప్రజలకు మత పిచ్చి లేవాలే.. దాని నుంచి నాలుగు ఓట్లు రాబట్టుకోవాలె. దేశ ఆస్తులన్నీ అమ్మాలి. దాని కోసం డ్రామా చేయాలి. ఇదే గోల్‌మాల్ గోవిందం. పచ్చి అబద్ధాలు.. అని కేసీఆర్ దుయ్యబట్టారు.


గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో పాకిస్థాన్ కంటే అధ్వానమైన స్టేజ్‌లో భారత్‌

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే అధ్వానమైన స్టేజ్‌లో భారత్ ఉంది. 101వ స్థానంలో భారత్ ఉంది. దానికి డబ్బా కొట్టుకునుడు. ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. గ్లోబల్ ఇండెక్స్‌లో ఇంత ఘోరంగా ఉంటే.. 65 వేల కోట్ల ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. రైతులు ఇంత సమ్మె చేసినా.. ధర్నాలు చేసినా ఎంఎస్‌పీ ప్రస్తావన లేదు. వ్యవసాయానికి పెంచలేదు. ఆరోగ్యానికి పెంచలేదు. సంక్షేమానికి పెంచలేదు. విద్యకు పెంచలేదు. ఇంకెవరికి పెంచావు. రేకు డబ్బాలో రాళ్లు ఏసి ఊపినట్టు తప్పితే ఎవరికి మేలు చేశారు అంటూ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని, ప్...
01/02/2022

ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ వాళ్లు కూడా దేశానికి ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ సిపాయి నరేంద్ర మోదీ వచ్చిండు. గుజరాత్‌లో ఏదో పొడిచినట్టు.. నాలుగు బొమ్మలు దొంగ సోషల్ మీడియాలో పెట్టి.. పూర్తి పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి సోషల్ మీడియాలో దొంగ ప్రచారాలతో.. తల తోక లేని గుజరాత్ మోడల్‌ను తీసుకొచ్చారు. గుజరాత్ మోడల్‌ను ఉద్దరిస్తారని చెప్పి నమ్మి ప్రజలు ఓటేశారు. ఎనిమిదేండ్లు గడిచాక ఆయన బండారం బయటపడ్డది. బీజేపీకి, మోదీకి ఉన్న తెలివి ఏందో స్పష్టంగా ఇవాళ బయటపడింది.

ఈ బడ్జెట్ దిక్కుమాలినతనంగా ఉంది. పేదలకు, రైతులకు మొండి చేయి చూపించింది. కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేలా చేసింది. లక్షల మంది ప్రజలకు రైలు టికెట్టు కూడా ఇవ్వలేదు. చాలా మంది చనిపోయారు. కరోనా సమయంలో ఘోరంగా విఫలమయ్యారు.

మిడతలు వస్తాయని భయపడ్డాం. గుజరాత్, రాజస్థాన్ బోర్డర్‌లో మాత్రమే వచ్చి పోతాయి. కానీ పోయినా సారి హర్యానా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ బోర్డర్ వరకు వచ్చాయి. మనం కూడా సన్నద్ధం అయ్యాం. ఎంటమాలజిస్టులు వస్తే మన పంటలను కాపాడుకోవాలని, హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ బోర్డర్ తరలించాం. ఆ మిడతలను చంపేశారు. మన దగ్గరికి మిడతలు రాలేదు. అయితే ఆ తర్వాత ఓ మీటింగ్ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో మిడతలను నియంత్రించొచ్చు కదా అని అడిగాను. మానవజాతితో పాటు ఇవన్నీ ఉంటాయి. కరోనాలాంటి, మిడతలాంటి, ఫ్లూ లాంటి వైరస్‌లు 8 లక్షల సంవత్సరాల ముందే వచ్చాయి. వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడే విజృంభించి, మనషులను చంపేస్తాయని చెప్పారు. దీని నివారణ ఎట్లా అని అడిగితే.. తెలివి ఉన్న ప్రభుత్వాలు ఆరోగ్య వనరులను పటిష్టం చేసుకుంటాయి. తద్వారా తక్కువ నష్టాలతో బయటపడుతారు అని చెప్పిండు. ఆరోగ్య రంగ సదుపాయాలు పటిష్టం చేయాలని చెప్పారు.

ఈ నేపథ్యంలో టిమ్స్ కింద ఆరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. భవిష్యత్‌లో అనుకోని వైరస్‌లు వచ్చినా ప్రజలను కాపాడుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆరోగ్య సదుపాయాలను పెంచుకుంటున్నాయి. కానీ నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగానికి నిధులు పెంచలేదు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

01/02/2022
ఈరోజు శిశు మందిర్ పాఠశాల కామారెడ్డి లో 75 కోట్ల సూర్య నమస్కార్ ప్రోగ్రాంలో భాగంగా పాల్గొన్న రాష్ట్ర విప్ ఎమ్మెల్యే శ్రీ ...
26/01/2022

ఈరోజు శిశు మందిర్ పాఠశాల కామారెడ్డి లో 75 కోట్ల సూర్య నమస్కార్ ప్రోగ్రాంలో భాగంగా పాల్గొన్న రాష్ట్ర విప్ ఎమ్మెల్యే శ్రీ గంప గోవర్ధన్ గారు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు రంగా వెంకటేశ్వర గౌడ్, మధుసూదన్ రెడ్డి, ప్రభు లింగం, మోహన్ రెడ్డి, అనిల్, సంజీవ్, సతీష్ యోగా అసోసియేషన్ సభ్యులు kamareddy

At kamareddy
26/01/2022

At kamareddy

New presidents
26/01/2022

New presidents

Government of India is violating the spirit of Constitution of India    - CM KCRStrong Letter by Hon'ble CM KCR  to Prim...
24/01/2022

Government of India is violating the spirit of Constitution of India
- CM KCR

Strong Letter by Hon'ble CM KCR to Prime Minister expressing protest against GOI's proposed amendments to All India Service Rules ....

రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్య...
20/01/2022

రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది.

ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉండగా.. రేపటి నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రేపటి నుంచి ప్రారంభమయ్యే సర్వేకు సంబంధించిన టెస్ట్ కిట్లు, మెడికల్‌ కిట్లను ఆయా పీహెచ్‌సీలకు తరలించినట్లు మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.

చిరకాల స్వప్నం నెరవేర్చవు థాంక్యూ యూ కెటిఆర్.. ఆనంద్ మహీంద్రా ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఆనంద్‌ ...
17/01/2022

చిరకాల స్వప్నం నెరవేర్చవు
థాంక్యూ యూ కెటిఆర్.. ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలంగాణ ప్రభుత్వానికి.. ప్రత్యేకించి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రతిష్టాత్మక 'ఫార్ములా ఈ' వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రేసు కోసం హైదరాబాద్‌ నగరం వేదికగా ఇవాళ ఖరారైంది. ఈ తరుణంలో సొంత రేసింగ్‌ కార్లను(మహీంద్రా రేసింగ్‌ కంపెనీ) స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు కృతజ్ఞతగా ఆనంద్‌ మహీంద్రా కేటీఆర్‌ కు థ్యాంక్స్‌ చెబుతూ ఒక ట్వీట్‌ చేశారు. సొంత గడ్డపై తమ రేసింగ్‌ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా .

ఫార్ములా E సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- మంత్రి కేటీఆర్‌ సంయుక్తంగా ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. పనిలో పనిగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న మద్దతును సైతం అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే ఫార్ములా వన్‌ తరహాలో ఇ-వన్‌ ఛాంపియ్‌షిప్‌ కూడా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నదే. ఈ రేసింగ్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేని ఈ 'ఇ వన్‌​ ఫార్ములా' ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంలో మహీంద్రా రేసింగ్‌ కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది.

ఇప్పటి వరకు లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్‌ నగరం ఆతిధ్యం ఇ‍చ్చేందుకు సిద్ధమవుతోంది.

Address

Nh 7
Kamareddy
503112

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS PARTY kamareddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share