సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట.

  • Home
  • India
  • Kamavarapukota
  • సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట.

సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట. Helping someone might not change the whole world, but it could change the world for one person.

మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవ శుభాకాంక్షలు..
05/12/2024

మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవ శుభాకాంక్షలు..

బాధాకరమైన వార్త... జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది Atchuta Srinivasa Rao గారు, జంగారెడ్డిగూడెం సాక్షి...
04/11/2024

బాధాకరమైన వార్త... జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది Atchuta Srinivasa Rao గారు, జంగారెడ్డిగూడెం సాక్షి రూరల్
విలేఖరి Atchuta Ramu గారి తల్లి గారు తెల్లవారు జామున మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందజేయాలని కోరుకుంటూ.. మధు, సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట.

Happy Birthday Garapati S Chowdary  Garu . కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు, మంచి మనిషి, నిగర్వి,  #తపన ఫౌండేష...
02/11/2024

Happy Birthday Garapati S Chowdary Garu . కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు, మంచి మనిషి, నిగర్వి, #తపన ఫౌండేషన్ ద్వారా త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు ఫీజులు, వైద్య సేవలో సహాయం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యువతకు, కళాకారులకు, పలు రంగాలలో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా సమాజానికి, అవసరం ఉన్న వారికి పలు విధాలుగా సహాయం చేస్తున్న తపన ఫౌండేషన్ అధినేత, భారతీయ జనతా పార్టీ నాయకులు #గారపాటిచౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో.. మధు సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట.

కామవరపుకోట పాతూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, వైసిపి నాయకులు Subramanyam Tammisetti  తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం గారి తల్లి గ...
01/11/2024

కామవరపుకోట పాతూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, వైసిపి నాయకులు Subramanyam Tammisetti తమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం గారి తల్లి గుణసుందరి గారు ( వైస్ ఎంపీపీ Girija Thammisetti గిరిజా గారి అత్తయ్య) ఆరోగ్య సమస్యతో మృతి చెందారని తెలియజేయటానికి చింతిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలగజేయాలని భగవంతుని కోరుకుంటూ.. మధు, సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట.

జయహో కెమెరా  #సృష్టికర్త  #డాగురే గారు... టీ నర్సాపురం మండలం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి...
01/11/2024

జయహో కెమెరా #సృష్టికర్త #డాగురే గారు...
టీ నర్సాపురం మండలం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి నన్ను సన్మానించిన సోదర ఫోటోగ్రాఫర్స్ కు, యూనియన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. TNQ and Congratulations Venkateswararao Rachaprolu and New Team Members ❤️🤝

30/10/2024

Comments లో

అని type చెయ్యండి!
రంగులు వస్తున్నాయి. Happy Diwali.

చెల్లుబాటులో ఉన్న  #పదిరూపాయలబిల్లలను కొందరు దుకాణదారులు తీసుకోవటం లేదని పది రూపాయల బిల్లలు (కాయిన్స్) అందరూ తీసుకునేలా ...
30/10/2024

చెల్లుబాటులో ఉన్న #పదిరూపాయలబిల్లలను కొందరు దుకాణదారులు తీసుకోవటం లేదని పది రూపాయల బిల్లలు (కాయిన్స్) అందరూ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ తరఫున ఏలూరు జిల్లా కలెక్టరు #వెట్రిసెల్విగారిని కోరడం జరిగింది. చిల్లర సమస్యలు తలెత్తకుండా ఉండటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పది రూపాయల బిల్లలను ప్రవేశపెట్టారని అయితే కొందరు వ్యాపారస్తులు పది రూపాయల బిల్లలను తీసుకోవటం లేదని #కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. వ్యాపారస్తులు దుకాణదారులు పది రూపాయల బిల్లలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అపోహలు పెరిగిపోతున్నాయనీ, కనుక అన్ని వర్గాల వారు కూడా చెల్లబాటులో ఉన్న పది రూపాయల బిల్లలను తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు వెట్రి సెల్వి మేడంగారిని కోరడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో కలెక్టర్ #సమస్యలపరిష్కార ఫోన్ నెంబర్ ద్వారా కామవరపుకోట మండలంలో ఉన్న #ఎండుచెట్లను తొలగించడం, సౌత్ నా సెంటర్లోని ప్రమాదకరంగా ఉన్న #ట్రాన్స్ఫారం పనులను పూర్తి చేసినందుకు కలెక్టర్ గారు మరియు టీమ్ మెంబర్స్ కు సహాయ పౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. TNQ

బాధాకరమైన వార్త, కామవరపుకోట మాజీ ఎంపీటీసీ సభ్యులు  #చిలుకూరి సుబ్బారావు గారు తనయుడు జంగారెడ్డిగూడెం సీనియర్  #పాత్రికేయు...
21/10/2024

బాధాకరమైన వార్త, కామవరపుకోట మాజీ ఎంపీటీసీ సభ్యులు #చిలుకూరి సుబ్బారావు గారు తనయుడు జంగారెడ్డిగూడెం సీనియర్ #పాత్రికేయులు,, ప్రముఖ హార్డ్వేర్, మంచి మనిషి #చిలుకూరిరమేష్ గారు కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. రమేష్ కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ... Miss you Ramesh Chilukuri garu.

నాకు జరిగిన ప్రమాదం ఇంకొకరికి జరగకూడదనే తలంపుతో నేను చేసిన ప్రయత్నానికి కామవరపు కోట మండల  #తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,...
17/10/2024

నాకు జరిగిన ప్రమాదం ఇంకొకరికి జరగకూడదనే తలంపుతో నేను చేసిన ప్రయత్నానికి కామవరపు కోట మండల #తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, #గీతా మెడికల్స్ #సత్యనారాయణ గారు సహకరించారు. ప్రమాదకరంగా త్రిశూలం వలే ఉన్న చెట్టుకొమ్మను జయరాజు గారితో నరికించడం జరిగింది. TNQ Geetha Satyanarayana Kilaru Garu. #నోట్: ఇక్కడ ఎదుటివారికి ఏమైతే నాకేమిటనే భావనతో ఉన్న ఒక #వింతమనిషి మాటలు మనసుకు చాలా బాధ కలిగించాయి. ఏది ఏమైనా ప్రమాదకరంగా ఉన్న కొమ్మను దగ్గరుండి తొలగించటం జరిగింది.

మీ ఆరోగ్య సమస్యల సలహాల కోసం మీ దగ్గర ఉన్న  #రిపోర్ట్లను కేవలం ఈ నెంబర్కు  #వాట్సప్ చేయండి. హైదరాబాద్ కు చెందిన పేషెంట్ స...
17/10/2024

మీ ఆరోగ్య సమస్యల సలహాల కోసం మీ దగ్గర ఉన్న #రిపోర్ట్లను కేవలం ఈ నెంబర్కు #వాట్సప్ చేయండి. హైదరాబాద్ కు చెందిన పేషెంట్ సేవ సంస్థ Raja N V G #రాజాగారు మీ సమస్యకు పరిష్కారం చెప్పడంతో పాటు #తక్కువఖర్చులో వైద్య సేవలను అందించడానికి తన వంతు తాను కృషి చేస్తారు.. మీరు ఏ ప్రాంతం వారైనా ఈ నెంబర్ మీ దగ్గర ఉంటే మీ ఆరోగ్య సమస్యకు #పరిష్కారం దొరికినట్లే... మీ మధు, సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట.

Address

Main Road
Kamavarapukota
534449

Website

Alerts

Be the first to know and let us send you an email when సహాయ పౌండేషన్ ట్రస్ట్, కామవరపుకోట. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category