11/01/2022
ఈరోజు కందుకూరు, వరాల సాయి నగర్ MIG లేఅవుట్ ప్లాట్స్ కొరకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించ బడును.. ఉదయం 10.30 నుండి కందుకూరు మునిసిపల్ ఆఫీస్ నందు బుకింగ్ కౌంట ర్స్ ఏర్పాటు చేయబడును..ఆసక్తి కల వారు మున్సిపల్ ఆఫీస్ కు రాగలరు.
MIG layout
*3-18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్రంలో వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్ధలాల కేటాయింపు*
*ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో కేటాయింపు*
*అన్ని పట్టణాభివృద్ది సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగ నియమాల మేరకు ఒక సంవత్సర కాలంలో సమగ్ర లేఔట్ల అభివృద్ది*
*ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో చెల్లించే సౌకర్యం, చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్ చేసిన ప్లాట్ లబ్ధిదారునికి స్వాధీనం, దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో 10 శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేది లోపు ఏది ముందయితే అప్పటికి మిగిలిన 30 శాతం చెల్లించే వెసులుబాటు*
*ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5 శాతం మేరకు ఆకర్షణీయమైన రాయితీ*
*https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు*
*లేఔట్ల ప్రత్యేకతలు*
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్, గవర్నమెంటే లేఔట్ చేస్తుంది
కుటుంబాల అవసరాలను బట్టి 150,200 మరియు 240 చదరపు గజాల స్ధలాలు ఎంచుకునే వెసులుబాటు
పర్యావరణ హితంగా ఉండేలా లేఔట్ల విస్తీర్ణంలో 50 శాతం వరకు స్ధలం సామాజిక అవసరాలకు కేటాయింపు
విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్
మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్ధ, వరద నీటి డ్రెయిన్లు
విద్యుదీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు
పార్కులు, ఆట స్ధలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకు మరియు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్ధలాలు కేటాయింపు
లేఔట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరియు పట్టణాభివృద్ది సంస్ధల ద్వారా సంయుక్త నిర్వహణ