ITDP Kandukur

ITDP Kandukur జై తెలుగుదేశం

15/08/2026

పేదలకు మంచి చేయాలన్నదే చంద్రబాబు తపన - MP Vemireddy Prabhakar Reddy గారు

అభివృద్ధి, సంక్షేమం మీ కళ్ళముందే కనిపిస్తోంది

నిధులు తేవడంలో ఎమ్మెల్యే ఇంటూరి తర్వాతే ఎవరైనా

పెదపట్టపుపాలెంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే Inturi Nageswara Rao గారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపు

👉 ఉలవపాడు మండలం పెద్దపట్టపుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభోత్సవం చేశారు.

👉 గ్రామ సమీపంలోని బకింగ్ హామ్ కాలువపై 20 లక్షల రూపాయల సొంత నిధులతో ఎంపీ వేమిరెడ్డి బ్రిడ్జి నిర్మించారు. అలాగే 20.5 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరగగా, రెండింటిని నేతలిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరంతా ఒక్కటై, అభిమాన నేతలకు ఘన స్వాగతం పలికారు.

MP ప్రభాకరరెడ్డి గారు మాట్లాడుతూ....

👉 పెదపట్టపుపాలెం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. గ్రామ పెద్దలు అడిగిన వెంటనే 20 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించాను. ఈరోజు బ్రిడ్జిని చూస్తుంటే, స్థానికులకు ఎంతో మేలు చేశానన్న సంతోషం ఎక్కువగా కలుగుతోంది. ఎంపీ లాండ్స్ ద్వారా నియోజకవర్గానికి 1.35 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

👉 ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేదలంటే తపన. వారికి మేలు చేయడానికి రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారు. అమరావతి నిర్మాణం గురించి ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతోంది. రాబోయే మూడేళ్లలో మనకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి.

👉 స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిస్వార్ధమైన ప్రజా సేవకుడు. పట్టుదలతో ముఖ్యమంత్రిని మంత్రులను ఒప్పించి నిధులు తీసుకురావడంలో దిట్ట. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడం మీ అదృష్టం. రెండేళ్ల నుంచి చూస్తున్నాను... అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం మీ కళ్ళముందు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

*MLA నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.....*

👉 ఎంపీ వేమిరెడ్డి గారి దాతృత్వం, మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నియోజకవర్గంలో ఎంతోమంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు ఇచ్చారు. అనేక గ్రామాలలో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశారు. కృష్ణాపురం వద్ద బ్రిడ్జికి 40 లక్షలు మంజూరు చేశారు. ఏది అడిగినా కాదనకుండా సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు.

👉 కూటమి ప్రభుత్వంలో పెద్దపట్టపుపాలెం గ్రామం బాగా అభివృద్ధి చెందింది. పల్లె పండుగ ద్వారా 60 లక్షలతో సిసి రోడ్లు వేయించాం. 38 లక్షల పంచాయతీ, మండల పరిషత్ నిధులతో 17 పనులు చేపట్టడం జరిగింది. చెరువుకు నీరు వచ్చే ఎలికేరు కాలువను అభివృద్ధి చేశాం.

👉 సంక్షేమం విషయానికి వస్తే... మత్స్యకార భరోసా ద్వారా 884 మందికి 1.8 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా 437 మందికి 87.5 లక్షలు, ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా 15 మంది, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా 25 మందికి 20 లక్షలు అందజేయడం జరిగింది.

👉 ఈ మంచి పనులన్నీ ప్రజలు గుర్తుంచుకోవాలని, రాబోయే ఎందుకల్లో 12 పంచాయతీలను గెలుచుకునేలా కష్టపడాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తూపిలి రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ ఆవుల వాసు, స్థానిక నాయకులు ప్రళయకావేరి రామమూర్తి, ఊటుకూరి రాంబాబు, పుల్లా వెంకట్ రెడ్డి, వెయ్యాల అశోక్, గ్రామ కాపులు, పెద్దలు పాల్గొన్నారు.

14/08/2026

రామాయపట్నం పోర్టు అంశంలో మాట్లాడే అర్హత వైసిపికి లేదు

మీ ప్రభుత్వంలో నిర్వాసితులను పట్టించుకున్నారా ?

పునరావాస కాలనీల్లో వసతులు కల్పిస్తున్నది మేమే

కూటమి ప్రభుత్వంలోనే మూడు R & R కాలనీల్లో అభివృద్ధి

కర్లపాలెంలో పాఠశాల, అంగన్వాడి భవనాలను ప్రారంభించిన ఇంటూరి

రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన వారిని వైసిపి ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని, వారికి కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు.

గుడ్లూరు మండలం కర్లపాలెం పునరావాస కాలనీలో 1.10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాలను ఆయన గురువారం ఉదయం ప్రారంభించారు.

MLA నాగేశ్వరావు గారి మాటల్లో.....

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఆవులవారిపాలెం, మొండివారిపాలెం కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ మౌలిక వసతులను జగన్ ప్రభుత్వం కల్పించలేదు. కాంపౌండ్ వాల్, స్మశానాల అభివృద్ధి, ఇతర పనులను ఈ ప్రభుత్వంలో పూర్తి చేశాం. కర్లపాలెం కాలనీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం.

పోర్టుకు భూములు ఇచ్చిన వారి బాగోగులు చూసుకోవటం మా బాధ్యత. వైసీపీ ప్రభుత్వంలో ఆ గ్రామాలను ఖాళీ చేయించి చేతులు దులుపుకున్నారు. కానీ మేము వారికి అండగా నిలబడ్డాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని పెంచి ఇప్పించడం జరిగింది.

వీటికి తోడుగా 28 కోట్లతో జెట్టి నిర్మాణాన్ని ప్రారంభించాం. మత్స్యకారులకు దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది.

రామయపట్నం పోర్టు విషయంలో ఏదో జరిగిపోతున్నట్లు వైసిపి వారు ఇటీవల ధర్నాలు చేశారు. అసలు వారికి ఆ అర్హత ఉందా ? అధికారంలో ఉన్నప్పుడు పునరావాస కాలనీల గురించి ఎందుకు పట్టించుకోలేదు ?

పేదల పిల్లలందరూ చదువుకోవాలన్నదే మా లోకేష్ గారి ఆలోచన. అందుకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఒక కోటి పదిలక్షలతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించాం. అలాగే 12 లక్షలతో అంగన్వాడి భవనాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.

గ్రామస్తుల కోరిక మేరకు స్థానిక పాఠశాలను 7వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే క్రీడా పరికరాలతో కూడిన గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను. కాలనీలో గ్రామ దేవతల ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

మత్స్యకారుల పిల్లలు చక్కగా చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలి. రాబోయే నాలుగైదేళ్లలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలతో పాటు ఉద్యోగాలు కూడా వస్తాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును అందరూ గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది.

కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పోర్టు ఈఈ రాము, డిఈ మస్తాన్ రావు, డిప్యూటీ డిఇఓ టి.రవి, ఎంఈఓ లు హరేరామ్, గోవర్ధన్, పాఠశాల హెచ్ఎం మైఖేల్, గ్రామ టిడిపి అధ్యక్షుడు వేముల స్వామి, పార్టీ నాయకులు అట్లా కోటయ్య, చాపల రమణయ్య, బాలాజీ, ఎస్ఎంసి చైర్మన్ వెంకటేశ్వర్లు, ఏఎంసి వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, పార్టీ నాయకులు పోలుగంగు కృష్ణ, షేక్ పెదబాబు, మద్దసాని శ్రీను, వెంకటేశ్వర్లు, చిత్తారి మల్లికార్జున, ఉన్నం వెంకటేశ్వర్లు, దామా వెంకటేశ్వర్లు, మేకల మాల్యాద్రి, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

మౌలిక వసతులకు ప్రాధాన్యత - MLA ఇంటూరి కందుకూరు చుట్టూ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు 1.26 కోట్ల తో నిర్మించి...
14/08/2026

మౌలిక వసతులకు ప్రాధాన్యత - MLA ఇంటూరి

కందుకూరు చుట్టూ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు

1.26 కోట్ల తో నిర్మించిన తారురోడ్డు, బ్రిడ్జిని ప్రారంభించిన నాగేశ్వరరావు గారు

👉 రాకపోకలకు వీలుగా, కందుకూరు పట్టణం చుట్టూ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వెల్లడించారు.

👉 దివివారిపాలెం వెళ్లే రోడ్డులో ఆదిఆంధ్రకాలనీ వద్ద ఉప్పువాగుపై 1.10 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, 16.5 లక్షలతో నిర్మించిన తారురోడ్డును గురువారం ఆయన ప్రారంభించారు.

👉 పట్టణంలో నుంచి చుట్టుగుంట, ఆనందపురం, కొండముడుసుపాలెం గ్రామాలకు వెళ్లే మార్గాలలో వంతెనలు లేకపోవడం వల్ల, వర్షాల సమయంలో వాగుల వద్ద ప్రయాణాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆయాచోట్ల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

👉 అమృత్ 2.0 పథకం ద్వారా, 30 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలన్నిటికీ రామతీర్థం తాగునీటి సరఫరాకు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సుమారు 6 వేల కుళాయి కనెక్షన్లు ఇవ్వబోతున్నామని, 30 ఏళ్ల పాటు తాగునీటి సమస్య ఉండబోదని వివరించారు.

👉 గడిచిన రెండు దశాబ్దాలలో కందుకూరు పట్టణ పరిధిలో ఇంత పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడం పట్ల అన్నివర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

👉 ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులలో గెలుపు జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

👉 ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.అనూష, డిఈ గణపతి, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, పట్టణ మాజీ అధ్యక్షులు కండ్రా మాల్యాద్రి, పిడికిటి వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు చుండూరి మాల్యాద్రి, కోటేశ్వరరావు, అన్నక్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, ప్రధాన కార్యదర్శి దూదిపల్లి అఖిల, నియోజకవర్గ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, నల్లూరి సుబ్బారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

13/08/2026

సమైక్యస్ఫూర్తిని చాటిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ

పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి, సబ్ కలెక్టర్, అధికారులు, నేతలు

త్రివర్ణ పతాకాలతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

🇮🇳 కందుకూరు పట్టణంలో దేశభక్తి వెల్లివిరిసింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా... హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించగా, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమైక్యవాదాన్ని చాటిచెప్పారు.

🇮🇳 ఎల్ఐసి కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సైకిల్ ర్యాలీలో గౌరవ ఎమ్మెల్యే *ఇంటూరి నాగేశ్వరరావు*, సబ్ కలెక్టర్ *దామెర హిమవంశీ*, మున్సిపల్ కమిషనర్ *కే.అనూష* , సిఐ *అన్వర్ బాషా* తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరగా అందరి చేత దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు.

🇮🇳 ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ... 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇంటింటా ఘనంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఎగురవేయాలన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తు చేసుకోవటంతో పాటు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

🇮🇳 అంతకుముందు పలు పాఠశాలల విద్యార్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెప్మా సిబ్బంది, పొదుపు గ్రూపు మహిళలు, ఇంకా పలురా అనేక రంగాలకు చెందినవారు జాతీయ జెండాలు చేతబట్టి, నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

🇮🇳 ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఉన్నం వీరాస్వామి, పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్రా మాల్యాద్రి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, బిజెపి నాయకులు వరప్రసాదరావు, రాయపాటి శ్రీనివాసరావు, చనమాల శ్రీధర్, అన్న క్యాంటీన్ చైర్మన్ కొండలరావు, ఏఎంసి డైరెక్టర్ మాదాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

2025 మెగా డీఎస్సీపై ఈ కుట్రలేంటి ? కష్టపడి చదివాం... ఉద్యోగం తెచ్చుకున్నాం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం న్యాయమేనా ? మీరు ...
11/08/2026

2025 మెగా డీఎస్సీపై ఈ కుట్రలేంటి ?

కష్టపడి చదివాం... ఉద్యోగం తెచ్చుకున్నాం

మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం న్యాయమేనా ?

మీరు వాలంటీర్ పోస్ట్ ఇస్తే... కూటమి ప్రభుత్వం టీచర్ ఉద్యోగం ఇచ్చింది

ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తే.. ఈసారి 11కూడా రావు

వైసిపి ఆరోపణలపై ఉపాధ్యాయుల కన్నెర్ర

కందుకూరులో 2025 డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ

సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి

🔥 2025 మెగా డిఎస్సి మీద వైసిపి తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలకు ఎంపికైతే... తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తారా ? అంటూ వైసిపి నేతలపై కన్నెర్ర చేశారు. 2025 మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు... కందుకూరులో మంగళవారం సాయంత్రం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా వందలాదిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, యువత, మేధావులు, వివిధ వర్గాల ప్రముఖులు, సీనియర్ సిటిజన్లు, తరలివచ్చారు.

🔥 ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. కూటమి పార్టీల నేతలు కూడా ర్యాలీలో పాల్గొని ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు.

🔥 ఉపాధ్యాయులతో రాజకీయాలు ఆడొద్దు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి, థాంక్యూ సీఎం సార్, థాంక్యూ లోకేష్ సార్, థాంక్యూ పవన్ కళ్యాణ్ సార్ అంటూ... పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

🔥 అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం... మెగా డీఎస్సీ 2025 కు ఎంపికైన పలువురు ఉపాధ్యాయులు వైసిపి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

🔥 వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు డీఎస్సీ కోసం ఎదురుచూసినా ఫలితంలేదని, తాను అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తానన్న జగన్ మాటలను నమ్మి మోసపోయామని పలువురు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేశారు. మెగా డీఎస్సీపై లోకేష్ గారి యువగళం పాదయాత్రలో ప్రకటించిన తర్వాతే తమలో ఆశలు చిగురించాయని పేర్కొన్నారు.

🔥 లోకేష్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 16,300 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాక... తామంతా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించామని చెప్పారు. తీరా ఉద్యోగాలలో జాయిన్ అయ్యాక, వైసీపీ వ్యవహరిస్తున్న తీరుతో ఎంతో బాధపడుతున్నామని అన్నారు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించిన సంగతి వైసిపి వారికి కూడా తెలుసని, రాజకీయాల కోసం దగా డిఎస్సి అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

🔥 రెండు నెలలుగా తాము మానసిక క్షోభ అనుభవిస్తున్నామని పలువురు కంటతడి పెట్టారు. వైసిపి నేతలు, సానుభూతిపరుల కుటుంబాలలో అనేకమందికి ఉపాధ్యాయ పోస్టులు వచ్చాయని గుర్తు చేస్తూ... వారు కూడా డబ్బులు ఇచ్చి పోస్టు కొనుక్కున్నట్టేనా అని ఆవేశంగా ప్రశ్నించారు.

🔥 డీఎస్సీకి సంబంధించి పేపర్ లీకేజీ గాని, ఎలాంటి అక్రమాలు గాని జరగలేదని పలువురు ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రతి ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము కంటున్న కలలు సహకారం అయ్యాయని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు మనస్ఫూర్తితో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

🔥 జగన్, వైసీపీ నేతలు ఇకనైనా పద్ధతి మార్చుకుని, డీఎస్సీపై చేస్తున్న కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఒక దశలో వైసీపీని గొడ్డలి పార్టీ అని సంబోధిస్తూ.... ఇలాగే తప్పుడు ప్రచారాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని, ఉపాధ్యాయుల ఉసురు తప్పక తగులుతుందని భావోద్వేగంతో మాట్లాడారు.

🔥 ఎమ్మెల్యే *ఇంటూరి నాగేశ్వరరావు* గారు మాట్లాడుతూ.... డీఎస్సీని అడ్డుకునేందుకు వైసిపి 335 కేసులను వేసిందని గుర్తు చేశారు. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు వాటిని కొట్టేసిందన్నారు. మంత్ర లోకేష్ గారి సారధ్యంలో డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, నిరుద్యోగులకు న్యాయం చేశారని కొనియాడారు.

🔥 స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు గారి హయాంలో 13 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్ష మందికి పైగా ఉపాధ్యాయులను ఎంపిక చేసిన రికార్డును ఎవరు చెరిపి వేయలేరని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. 2025 మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తే, జగన్ అండ్ కో కొత్త నాటకాలకు తెరతీసిందన్నారు. వైసిపి ఎంత గోలచేసినా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే మరో డీఎస్సీని ప్రకటించబోతున్నారని తెలిపారు.

🔥 ఆత్మగౌరవ ర్యాలీకి తరలివచ్చిన ఉపాధ్యాయులందరికీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలుపుతూ... ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు. తన గెలుపులోను ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు.

🔥 ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు, వివిధ సామాజిక వర్గాల మేధావులు పాల్గొన్నారు.

కందుకూరు పట్టణంలోని ముత్యాలకుంట పార్కువద్ద హిందూస్మశాన వాటికలో..... పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్యుడు, VPG జ్యువెలర్...
11/08/2026

కందుకూరు పట్టణంలోని ముత్యాలకుంట పార్కువద్ద హిందూస్మశాన వాటికలో.....

పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్యుడు, VPG జ్యువెలర్స్ అధినేత వేముల సుకుమార్ గుప్తా సొంత నిధులతో, అంత్యక్రియలు నిర్వహించే భవనాన్ని కొత్తగా నిర్మించారు.

గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు, ఆ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు.

అందరికీ ఉపయోగపడేలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుకుమార్ ను అభినందించారు.

మున్సిపల్ కమిషనర్ కే.అనూష, ఆర్యవైశ్య నాయకులు చీదెళ్ల వేణుగోపాల్, గుర్రం అల్లూరయ్య, మురారిశెట్టి సుధీర్, చీదెళ్ల పిచ్చయ్య, గుర్రం చిన్న అల్లూరయ్య, పెట్లూరి సుబ్బారావు, వలేటి వెంకటేశ్వర్లు, యోగేశ్వరరావు, భవనాసి వెంకటేశ్వర్లు, మచ్చా మనోహర్, గుమ్మా శివ, రాధాకృష్ణ, నందనవనం రాము, రెబ్బవరపు మాల్యాద్రి, చనమాల శ్రీధర్, సవిడి బోయిన వెంకటకృష్ణ, చల్లా మహేంద్ర, షేక్ ఫిరోజ్, నూకల సుబ్బారావు, పీలా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది - MLA నాగేశ్వరరావు*కూటమి ప్రభుత్వం - ప్రజాపక్షంప్రతి గడపకు అభివృద్ధి, సంక్షే...
10/08/2026

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది - MLA నాగేశ్వరరావు

*కూటమి ప్రభుత్వం - ప్రజాపక్షం

ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం, అమలు చేస్తున్నాం

అన్ని రంగాల్లో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి

ఏలూరుపాడు ఎస్సీ కాలనీలో రెండేళ్ల ప్రగతిపై ఎమ్మెల్యే ఇంటూరి ప్రచారం

👉 భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం మాది. ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి కంటే, రాబోయే మూడేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధిని చూడబోతున్నారు. ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. అందుకు మీరంతా సహకరించాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తాను. అన్ని రంగాలలో కందుకూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నాను..... అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు.

👉 రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం* కార్యక్రమంలో భాగంగా గుడ్లూరు మండలం ఏలూరుపాడు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గారు సోమవారం సాయంత్రం పర్యటించారు. రెండేళ్ల ప్రగతిని వివరిస్తూ స్థానికులకు కరపత్రాలు పంచారు. ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు.

👉 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పిన నాగేశ్వరరావు... ఏలూరుపాడులో రెండేళ్లలో తల్లికి వందనం పథకం ద్వారా 176 మంది విద్యార్థులకు 52.8 లక్షలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 287 మందికి 77.49 లక్షలు, ప్రతినెలా 132 మందికి 5.23 లక్షల విలువైన పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

👉 గ్రామంలో 18 పొదుపు గ్రూపులకు 64 లక్షల రుణాలు అందించామని, జి రామ్ జి పథకం ద్వారా 35 వేల పని దినాలు కల్పించి 95 లక్షల రూపాయలు ఖర్చు చేసామని నాగేశ్వరరావు తెలిపారు.

👉 ఇంకా రోడ్లు, తాగునీటి పైపులైన్లు, స్మశానాల అభివృద్ధి, డంపింగ్ యార్డ్ పనులకు 12.37 లక్షల రూపాయలు వినియోగించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. 21లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడమే గాక, మంగలికుంట, వాయలచెరువులను 9.6 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు.

👉 మొత్తంగా పంచాయతీలో 43 లక్షలతో అభివృద్ధి, 3.13 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు.

👉 ఈ సందర్భంగా గ్రామంలో లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, అంగన్వాడికి సొంత భవనం, ఇంకా సిసి రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. శాంతినగర్ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, శాంతినగర్ లో స్మశానాలను అభివృద్ధి చేయాలని కోరారు.

👉 పెండింగ్ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. వాటికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

👉 ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిని, మండల టిడిపి అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామపార్టీ అధ్యక్షులు పర్రె రామారావు, మండల బీసీ సెల్ అధ్యక్షులు గద్దగుంట శ్రీను, గద్దగుంట రామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు నిమ్మకాయల రమణయ్య, మాజీ సర్పంచ్ స్వర్ణ కొండయ్య, క్లస్టర్ ఇంచార్జిలు చిత్తారి మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, ఏఎంసి వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రమణమ్మ, యూనిట్ ఇంచార్జ్ పోలుగంగు కృష్ణ, నరాల మాలకొండారెడ్డి, వెంకటేశ్వర్లు, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

08/08/2026

ఇంటింటి ప్రచారం అంటే...
కేవలం పాంప్లెట్ చేతిలో పెట్టి
క్యాజువల్ గా ఒకఫోటో తీసుకొని వెళ్లడంకాదు !

ఇంటింటికి వెళ్లి...
ఈ రెండేళ్లలో మీ కోసం
మేము ఇది చేశాం
ఇంత ఖర్చు పెట్టాం...
అని సాక్ష్యాలతో వివరించడం.

అంతేనా...!
ఇంకా ఏం సమస్యలున్నాయ్
ఏమేం పనులు చేయాలి
ఇంట్లో పరిస్థితులు ఏంటి
అని ఆరా తీయడం కూడా.

ఈరోజు వలేటివారిపాలెం, మండలం చిన్నఅమ్మపాలెంలో...
వృద్ధులు, మహిళలు, చిన్నారులు...
అందరినీ పలకరిస్తున్న విధానం
సమస్యను తెలుసుకుంటున్న తీరు
పరిష్కారం చూపిస్తున్న పద్ధతికి
స్థానికులు ఫిదా అయిపోయారు.

ఇంకాస్త చనువుతో
తమ బాధలు, సంతోషాలన్నీ
అభిమాన నేతతో చెప్పుకుంటూ
మురిసిపోయిన క్షణాలు ఇవి.

Address

Kottakata Street
Kandukuru

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Kandukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share