Srinivas Mallenki

Srinivas Mallenki Mallenki Srinivas

Vote for Car 🚗..
10/05/2024

Vote for Car 🚗..

కర్ణాటక కేన్స్‌ ప్లాంట్‌ తెలంగాణకు..కన్నడనాట పుట్టిన కంపెనీ హైదరాబాద్‌కుకేన్స్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ తరలింపుకాంగ్రెస్‌...
30/10/2023

కర్ణాటక కేన్స్‌ ప్లాంట్‌ తెలంగాణకు..
కన్నడనాట పుట్టిన కంపెనీ హైదరాబాద్‌కు
కేన్స్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ తరలింపు
కాంగ్రెస్‌ అసమర్థ విధానాలే కారణం!
ఆ సర్కారుపై ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో ఫైర్‌
తెలంగాణ టీఎస్‌ఐపాస్‌ విధానంపై ప్రశంసలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కరెంటు పోతది, నీళ్లు పోతయ్‌, పింఛన్లు పోతయ్‌, వచ్చే కంపెనీలు కూడా పోతయ్‌. అందుకు ఇదే తాజా ఉదాహరణ.
కన్నడనాట పుట్టిన కంపెనీ తెలంగాణకు తరలింపు

కర్ణాటక కంపెనీ.. కేన్స్‌ టెక్నాలజీస్‌ రూ.2,800 కోట్లతో ఓఎస్‌ఏటీ, కాంపౌండ్‌ సెమీకండక్టర్‌ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్‌ గ్రామంలో ఈ ప్లాంట్‌ కోసం గత మంగళవారం భూమిపూజ జరిగింది. దీంతో కొత్తగా 2,000 మందికిపైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. అయితే, కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు అసమర్థ విధానాల కారణంగానే అక్కడ నెలకొల్పవలసిన సెమీకండక్టర్‌ ఉత్పాదక కేంద్రాన్ని కేన్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ తెలంగాణకు తరలించిందన్న విషయం తాజాగా వెల్లడైంది.

సంప్రదించాలనుకొన్నప్పటికీ..
ఎలక్ట్రానిక్స్‌ రంగంలో కొనసాగుతూనే, సెమీకండక్టర్‌ సెక్టార్‌లో విస్తరించాలన్న ఉద్దేశంతో కేన్స్‌ టెక్నాలజీస్‌ తొలుత మైసూరులో రూ. 2,800 కోట్లతో ప్లాంట్‌ను ప్రారంభించాలనుకొన్నది. ఈ మేరకు అనుమతులనివ్వాలంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సర్కారుకు మూడు నెలల కిందట ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నిరోజులు గడిచినప్పటికీ, సర్కారు నుంచి సమాధానం రాలేదు. పరిశ్రమల శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను కేన్స్‌ ప్రతినిధులు సంప్రదించాలని చూశారు కూడా. అయినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టిన ఇతర భాగస్వాముల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. అనుమతుల్లో జాప్యంతో కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు మారే ప్రమాదం ఏర్పడింది. దీంతో చేసేదేమీలేక, ప్రత్యామ్నాయమార్గాలను కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. తెలంగాణ టీఎస్‌ఐపాస్‌కు ఆకర్షితులై ప్లాంట్‌ను ఇక్కడ నెలకొల్పేందుకు నిర్ణయించారు. 35 ఏండ్లపాటు మైసూరులో సేవలందిస్తున్నామని, స్థానికంగా ఉన్న వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని కాంగ్రెస్‌ సర్కారుకు ప్రతిపాదన లేఖలో విన్నవించామని, అయినప్పటికీ, సర్కారు అనుమతులనివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేన్స్‌ కంపెనీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

ఇలాగైతే ఉద్యోగాలు వచ్చినట్టే!
కేన్స్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ కర్ణాటక దాటి వెళ్లడంపై ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో, కర్ణాటకకు చెందిన మోహన్‌దాస్‌ పాయ్‌ ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ సర్కారు వైఖరిని ఎండగట్టారు. ప్లాంట్‌ తరలిపోయిన రోజును కర్ణాటక ప్రజలకు దుర్దినంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ సర్కారు బద్ధకం, అసమర్థత, తీవ్ర జాప్యం, జవాబుదారీతనం లేకపోవటం వల్లే మైసూరు నుంచి ఓ మంచి కంపెనీ తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. కంపెనీలు ఇలాగే తరలిపోతే కన్నడ యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని సిద్ధరామయ్య సర్కారును నిలదీశారు.

పాయ్‌ వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు సమర్థించారు. దీంతో అప్రమత్తమైన కర్ణాటక పరిశ్రమల శాఖమంత్రి ఎంబీ పాటిల్‌ కొత్త కథ మొదలుపెట్టారు. రూ. 500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించాల్సి ఉంటుందని, అయినప్పటికీ, ఆ భేటీకి ముందే కేన్స్‌ కంపెనీ ప్రతిపాదనలను తాము ఆమోదించినట్టు పేర్కొన్నారు. అయితే, కంపెనీ ప్రతినిధులు ఎక్కువ రాయితీలను కోరారన్న మంత్రి.. రాయితీల పేరిట తాము నిబంధనలను ఉల్లంఘించలేమని చెప్పుకొచ్చారు. అయితే, మంత్రి వ్యాఖ్యలు అబద్ధాలని కేన్స్‌ కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు అసమర్థ విధానాలు, జాప్యంతోనే కేన్స్‌ ప్లాంట్‌ తరలిపోయిందని కన్నడ పౌరులు మండిపడుతున్నారు.

టీఎస్‌ఐపాస్‌ భేష్‌
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్నిరకాల సదుపాయాలను టీఎస్‌ఐపాస్‌ ద్వారా త్వరితగతిన తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నది. దీంతో పెట్టుబడిదారులు భారీగా ముందుకొస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ కేన్స్‌ టెక్నాలజీస్‌ సెమీకండక్టర్‌ ప్లాంటే. ఈ నెల తొలివారంలో కేన్స్‌ ప్రతినిధులు ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేక భేటీ కావటం, నెల చివరినాటికి ప్లాంట్‌ ఏర్పాటుకు భూమిపూజ కూడా జరగటమే దీనికి నిదర్శనం. టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తుండటంతో గత తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల పరిశ్రమలు క్యూ కట్టాయి. 17 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. అందుకే, స్నేహపూర్వక పారిశ్రామిక విధానానికి కేరాఫ్‌గా మారిన టీఎస్‌ఐపాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నది.

35 ఏండ్ల కిందటి ముచ్చట ఇది..
రమేశ్‌ కన్నన్‌ అనే యువకుడికి ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్ట్‌ అంటే చాలా ఇష్టం. తన ఇష్టానికి అనుగుణంగా మైసూరు ఇంజినీరింగ్‌ కాలేజీలో 1988లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. అదే ఏడాది మైసూరులో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని కేన్స్‌ టెక్నాలజీస్‌ పేరిట ఓ ఎలక్ట్రానిక్స్‌ కాంట్రాక్ట్‌ కంపెనీని స్థాపించాడు. తాను పెరిగిన ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే కర్ణాటకలోనే దీన్ని స్థాపించినట్టు చెప్పాడు.

మూడున్నర దశాబ్దాలు గడిచాయి..
అద్దె గదిలో మొదలైన కేన్స్‌ టెక్నాలజీస్‌ ఇప్పుడు 1,500కు పైగా ఉద్యోగులతో, రూ.676 కోట్లు ఆదాయంతో మూడు ఖండాల్లోని 250 మంది క్లయింట్లకు సేవలందించే స్థాయికి చేరింది. సుఖోయ్‌ జెట్స్‌, మెట్రో ట్రైన్స్‌ కీలక విడిభాగాలను కూడా తయారుచేస్తున్నది. తాను పెరిగిన గడ్డ మీద మమకారంతో 35 ఏండ్ల కిందట కర్ణాటకలో కంపెనీని స్థాపించిన కన్నన్‌.. ఇప్పుడు అదే కర్ణాటకను వద్దనుకొని తెలంగాణలో 2,800 కోట్లతో కేన్స్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌కు ఇటీవల భూమి పూజ చేశారు. ఎందుకు?? కారణాలు రెండు. ఒకటి.. కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు అసమర్థ పాలన. రెండు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కారు స్నేహపూర్వక పారిశ్రామిక విధానం.

రెండువేల మందికి ఉద్యోగాలు
తెలంగాణలో సెమికండక్టర్‌ ఓఎస్‌ఏటీ, కాంపౌండ్‌ సెమికండక్టర్‌ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కేన్స్‌ టెక్నాలజీ సంస్థకు అభినందనలు. 2,800 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న యూనిట్‌ ద్వారా రెండువేల మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేన్స్‌ రాక తెలంగాణకు వ్యూహాత్మక పెట్టుబడి అవుతుంది. తెలంగాణలో సెమికండక్టర్‌ అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.

– కేన్స్‌ టెక్నాలజీ ప్రతినిధుల భేటీ సమయంలో మంత్రి కేటీఆర్‌

ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా కొంగరకలాన్‌
కేన్స్‌ ప్లాంట్‌లో తయారయ్యే సెమీకండక్టర్స్‌ను దేశ, విదేశీ మార్కెట్లలోకి తీసుకెళ్తాం. తైవాన్‌, జపాన్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. రకరకాల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కోసం మదర్‌ బోర్డులనూ తయారు చేస్తాం. భవిష్యత్తులో కొంగరకలాన్‌ పేరు ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్మోగుతుంది. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన తైవాన్‌, జపాన్‌ వంటి దేశాల సరసన భారత్‌ నిలవడానికి కొంగరకలాన్‌ తరహా ఇండస్ట్రియల్‌ పార్కులు అవసరం.

– సవితా రమేశ్‌, కేన్స్‌ టెక్నాలజీ చైర్‌పర్సన్‌ (భూమిపూజ వేడుకలో)

28/10/2023
కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా Vote for 🚗 Car సంక్షేమంలో ఏ రాష్ట్రం కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణలో మరో సంచల...
28/10/2023

కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా Vote for 🚗 Car

సంక్షేమంలో ఏ రాష్ట్రం కూడా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణలో మరో సంచలన పథకానికి సీఎం కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలో ఎల్ఐసీ ద్వారా రూ. 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తామని సీఎం కేసీఆర్ అభయమిచ్చారు. దాదాపు 93 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.

తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ బలోపేతానికి దోహదపడతాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కుదేలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పేదలకు సంక్షేమాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ బలపడడానికి తోడ్పడుతుంది. దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ బహుముఖ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఆలోచన సీఎం కేసీఆర్ గారి మానవత్వాన్ని చాటిచెబుతోంది.

జై కేసీఆర్
జై బీఆర్ఎస్
జై తెలంగాణ

కారు గుర్తుకే మన ఓటు !

KCR Bima – Empowering Every Home in Telangana

In a welfare-driven state like Telangana, CM KCR has charted a new course with the KCR Bima initiative. In a pathbreaking move, households with white ration cards are eligible for a life insurance benefit of Rs. 5 lakhs through LIC.

This program, envisioned by CM Garu, extends its reach to every family with a white ration card, to provide financial relief and enable stability. With this initiative at least 93 lakh families are set to be benefited.

Besides uplifting families, with this vision the KCR government, will also help LIC, to enhance its efficacy. In the current political landscape, where the Central Government under the BJP rule is dismantling public institutions, CM Garu’s decision to strengthen them reflects his commitment to stability. This is an example of how his vision transcends beyond challenges, inching towards solutions.

When the going gets tougher, there will always be CM KCR, who shines like a beacon of hope, to help and stand for people in need.

Jai KCR!
Jai BRS!
Jai Telangana!

కార్ గుర్తు కె మన ఓటు 🚗...
28/10/2023

కార్ గుర్తు కె మన ఓటు 🚗...

లక్ష ఖర్చు అయిన రచ్చ రచ్చే ని యవ్వ తగ్గేదే లే...మూడు తారీఖుమూడో గెలుపుజాతర మోత మోగిపోతదిగులాబీల దావత్ దద్దరిల్లిపోతది...
28/10/2023

లక్ష ఖర్చు అయిన రచ్చ రచ్చే ని యవ్వ తగ్గేదే లే...
మూడు తారీఖు
మూడో గెలుపు
జాతర మోత మోగిపోతది
గులాబీల దావత్ దద్దరిల్లిపోతది...

Gone Prakash Rao | తెలంగాణ‌లో మ‌రోసారి బీఆర్ఎస్‌దే అధికారం : గోనె ప్ర‌కాశ్ రావుGone Prakash Rao | క‌రీంన‌గ‌ర్ : తెలంగాణ‌...
28/10/2023

Gone Prakash Rao | తెలంగాణ‌లో మ‌రోసారి బీఆర్ఎస్‌దే అధికారం : గోనె ప్ర‌కాశ్ రావు
Gone Prakash Rao | క‌రీంన‌గ‌ర్ : తెలంగాణ‌లో మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మ‌న్ గోనె ప్ర‌కాశ్ రావు విశ్వాసం వ్య‌క్తం చేశారు. రామ‌గుండంలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి కోరుకంటి చంద‌ర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ప్ర‌కాశ్ రావు పిలుపునిచ్చారు. రామ‌గుండం నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటీఆర్ ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన క్ర‌మంలో ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ చంద‌ర్‌ను గెలిపించాల‌ని కోరుతున్నాన‌ని పేర్కొన్నారు...

Pic of the day 🚘తెలంగాణ భగీరథుడు
28/10/2023

Pic of the day 🚘తెలంగాణ భగీరథుడు

Address

Tower Circle
Karimnagar

Telephone

+919908292989

Website

Alerts

Be the first to know and let us send you an email when Srinivas Mallenki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Srinivas Mallenki:

Share