Karimnagar, Telangana

Karimnagar, Telangana విప్లవాల పురిటి గడ్డ Karimnagar was originally called Kareem Nagar, derived from Syed Kareemullah Shah Saheb Quadri.

It was one of the regional capitals during the rule of the Nizam. It has many historical monuments, including the Clock Tower, the Kaman Circle, and the Elgandal Fort, which is 12 km away from the city of Karimnagar.

19/07/2016

In India, a large number of people die due to road traffic accidents. However, only a small number of people that die due to these circumstances are able to ...

10/07/2016
09/07/2016

Wow, It has been beautifully made. You never feel that you are watching a movie. One is almost in the village for two hours. This movie grabs your mind and t...

08/07/2016

common Interview question and answers - Job Interview Skills 1.1. "Tell me a little about yourself." You should take this opportunity to show your communicat...

07/07/2016

Shop for great saving deals on Kitchen items, electronics, Fashion & Beauty, Books, entertainment, daily essentials and many more. Avail blockbuster, lightening deals and discounts at Amazon.in. Get cash back on eligible purchases.

02/07/2016
29/06/2016

B. Chandrakala is a member of Indian Administrative Services and currently serving as District Magistrate of Bulandshahr, UP, she is an IAS officer of 2008 b...

26/07/2015

కరీంనగర్ జిల్లా దక్షిణభారత చరిత్ర గతినే మలుపుతిప్పిందనీ బహుశా మీకు తెలిసుండదు. చాలామందికి తెలిసే అవకాశం లేదు. ఉత్తర తెలంగాణలో గోదావరి నదికి దక్షిణంగా వ్యాపించి ఉన్న మా కరీంనగర్ జిల్లాకు అనాదిగా ఉజ్వల చరిత్ర ఉన్నది.
మహోన్నతమైన సంస్కృతి, నాగరికతలకు నిలయంగా భాసిల్లింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన గోదావరినదికి ఇరువైపులా పూర్వచారివూతక, తొలిచారివూతక కాలాలకు సంబంధించిన అనేక మానవావశేషాలు వెలుగుచూశాయి. దేశంలోనే అరుదైనదిగా భావిస్తున్న డైనోసార్ శిలాజం కూడా ఇక్కడే(కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులోనే) దొరికింది. క్రీస్తుపూర్వం 1,50,000 నాటికే ఈ జిల్లాలోని నదీ పరివాహ ప్రాంతాల్లో ఆదిమ మానవుడు నివసించిన దాఖలాలున్నాయి. వందలాది పాతరాతి యుగపు పనిముట్లతో పాటు వాటి తయారీ కేంద్రాలు బయటపడ్డాయి. మధ్యరాతియుగంనకీ. పూ.10000-3000),కొత్తరాతి యుగంలో ఆదిమ మానవుడు నివసించిన రాక్‌షెల్టర్లను ఇక్కడ (కదంబాపూర్, తొగపూరాయి, రేగొండ, బూడిగపల్లి, మొలంగూర్ మొదలగు చోట్ల)గుర్తించారు. కదంబాపూర్ వద్ద రాతిగొడ్డళ్లు, బండబాడిశలు, ఉలులు, రాతిగుండ్లు, ధాన్యం దంచే, నూరేరాళ్లు అనేకం లభ్యమయ్యాయి. బూడిగపల్లిలో రాక్‌షెల్టర్లు, రాక్‌పేయింటింగ్స్‌నూ కనుగొన్నారు. బృహత్‌శిలాయుగపునకీ.పూ.1000 నుంచి క్రీ.శ 200) అనేక శిలా సమాధులు జిల్లాలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గుట్టల వద్ద మాత్రమే ఉన్నాయి. దేశంలో శిలాయుగానంతరమే(కంచు యుగానికి ముందే) ఇక్కడ ఇనుము వాడుకలోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదట ఇనుమును వాడింది మేమే! జగిత్యాల సమీపంలోని రంగపేట, కోనాపురం, మెట్‌పల్లి సమీపంలోని కోనసముద్రం, ఇబ్రహీంపట్నంలో, కరీంనగర్, పెద్దపల్లి, మంథని సమీపంలోని ఎల్గందల్, ముల్కనూరు, కల్లూరు, అనంతగిరి వివిధ ప్రాంతాల్లో ఇనుమును కరిగించి పనిముట్లు తయారు చేసినట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పటికి 2,500 ఏళ్ల కిందటే రోమన్, పర్షియన్ వర్తకులు ఇక్కడి ఇనుమును కొని, పశ్చిమాసియాలోని డెమాస్కస్‌కు ఎగుమతి చేసేవారని చారివూతక ఆధారాలతో సహా రుజువైంది. భారతదేశంలోకి ఆర్యుల రాక తర్వాత క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి ఏర్పడ్డ షోడష మహాజనపదాల్లో దక్షిణభారతదేశానికి సంబంధించిన ఒకే ఒక రాజ్యం అశ్మక. ఇది నేటి నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రాంతం.
దీని రాజధాని పోతలి(నేటి బోధన్) ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించిన మొట్టమొదటి ఆంధ్ర రాజులు(రాణా సమగోప, రాణా గోభద, రాణా నారన, రాణా కంపయ) మా కోటిలింగాల( మండలం) రాజధాని గా ఈ ప్రాంతాన్ని పాలించారని చారివూతక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీ.పూ. 500 నుంచి క్రీ.పూ.400 మధ్య ఆంధ్ర గోపులు, శబరులు, మహాతలవరులకు కోటిలింగాల రాజధానిగా ఉందని ఇక్కడి అనేక చారివూతక దిబ్బల్లో జరిగిన తవ్వకాలు వెల్లడిస్తున్నాయి. అంటే శాతవాహనుల నకీ.పూ. 230 నుంచి క్రీ.శ. 220 వరకు 450 ఏళ్లు)కంటే ముందే ఇక్కడ రాజ్య పరిపాలన సాగింది. శాతవాహనుడు కోటిలింగాల కేంద్రంగా శాతవాహన సామ్రా జ్యం ఏర్పాటు చేశాడు. కోటిలింగాలతో పాటు ధూళికట్ట, పెద్దబొంకూరు తవ్వకాల్లో కూడాఇదే విషయం తేలింది.
శాతవాహనుడి తర్వాత శాతకర్ణి, ఆ తర్వాత సిముఖుడు కోటిలింగాల రాజధానిగానే రాజ్య పాలన చేశారు. సిముకుడి కాలంలో (కోస్తా చరివూతకారులు చెబుతున్న శ్రీముఖుడు) కొన్ని కారణాల రీత్యా రాజధానిని ప్రతిష్ఠానపురం(పైఠాన్)నకు మార్చినా కోటిలింగాలను వదులుకోలేదు. అతని తర్వాత వచ్చిన శాతవాహన రాజులు, రాజధానిని తూర్పున ధాన్యకటకానికి మార్చారు.కోటిలింగాలలో తవ్వకాలకు (1979-84) ముందు ‘తెలివాహ’ నదిని కృష్ణానది(తైలం లాంటి నల్లని నది) అనీ, దాని తీరంలోని ఆంధ్రపురం అమరావతి అని చరివూతకారులు భావించారు. కోటిలింగాల తవ్వకాల తర్వాత ఈ అభివూపాయం తప్పని తేలింది. కృష్ణ అంటే నల్లనిది, తెలి అంటే తెల్లనిది అనీ, తెలివాహ అంటే తెల్లని ప్రవాహం, అదే గోదావరి అనీ, దాని ఒడ్డున ఉన్న ఆంధ్రపురమే కోటిలింగాల అని చరివూతకారులు తేల్చారు.
శాతవాహనుల తర్వాత కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, బహమనీసుల్తానులు, గోలకొండ కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్‌జాహీలు వరుసగా, స్థానికంగా పొలవాస రాజులు, నగునూరు, మంథని రాజులు కూడా పరిపాలించారు. ఆయా కాలాల్లో భాషా, సాహిత్య వికాసం అనివార్యంగా జరిగింది. ఇదే జిల్లాలో మునులగుట్టనుంచి కోటిలింగాలకు పోయే దారిలో ఉన్న శిలాఫలకాలపై క్రీ.పూ.2 వ శతాబ్ది నాటి లక్షణాలతో బ్రాహ్మీలిపిలో శాసనాలున్నాయి.పెద్దబొంకూర్ తవ్వకా ల్లో లభ్యమైన టెర్రకొట్ట ముద్రికపై క్రీ.పూ. 2వ శతాబ్ది నాటి బ్రాహ్మీలిపి లక్షణాలతో ‘విజయ పురహర కస రథస’ అని చెక్కి ఉంది.

10వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజధానిగా ‘సపాదలక్ష’ నేలిన రెండో అరికేసరి ఆస్థాన కవి, పంపడు(కన్నడ కవివూతయ ఆద్యుడు) వ్యాస మహాభారతాన్ని ‘విక్షికమార్జున విజ యం’ పేరుతో కన్నడలో రచించాడు. ఇది కన్నడ సాహిత్యంలో ఆదికావ్యం. అతని తమ్ముడు జినవల్లభుడు, జిల్లాలోని గంగాధర, కురిక్యాల గ్రామాల మధ్య ఉన్న బొమ్మలమ్మగుట్టపై వేయించిన శాసనంలో తొలి తెలుగు కందపద్యాలున్నాయి. అసలు కందం పుట్టిందే కరీంనగర్ జిల్లా లో! అదీ క్రీ.శ.946లో! త్రిలింగ దేశం అని ఆంధ్రవూపదేశ్‌ను పిలవడానికి కారణమైన శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరంలలో కాళేశ్వరం ఇక్కడిదే! ఇదే మన రాష్ట్రంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రం. దక్షిణ కాశీగా పిలుచుకు నే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రానికీ సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్నది. గోదావరి తీరమందున్న ధర్మపురి లక్ష్మీనర్సింహ క్షేత్రం, పుణ్యస్నానాలకు ప్రసిద్ధి. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నది.
కరీంనగర్ సమీపంలోని ఎల్గందల్‌కోట, శంకరపట్నం మండలంలోని మొలంగూర్ కోట, కమాన్‌పూర్ మండలంలోని రామగిరి కోట ప్రఖ్యాత గిరిదుర్గాలుగా ప్రసిద్ధి గాంచాయి. ఈ తరహా శత్రుదుర్భేద్యమై కోటలు, మహారాష్ట్రలో తప్ప మరెక్కడా లేవు. మా మాటే పాటలాగుంటది. మా పల్లెల్లో ఇంటికో పాటగాడు, ఆటగాడుంటడు. అందుకే మా జిల్లా జానపద కళాకారుల ఖిల్లాగా వినతికెక్కింది. ఇంకా ఒగ్గు కథలు, చిందు బాగోతాలు, యక్షగానాలు, కాకిపడగల భారతాలతో వీధివీధీ మారుమోగుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లా వెండి ఫిలిగ్రీ కళకు పెట్టింది పేరు. అద్భుత శిల్పకళకు రామడుగు, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన చేనేతన్నకు సిరిసిల్ల ప్రఖ్యాతిగాంచాయి. ఈ గడ్డపై అడుగుపెడితే జన్మే పావనమవుతుంది ...

Address

Karimnagar
505415

Alerts

Be the first to know and let us send you an email when Karimnagar, Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karimnagar, Telangana:

Share