29/10/2025
గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్
మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి.
ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అటెండర్ యాకూబ్ పాషా ను అరెస్ట్ చేసిన పోలీసులు సహా నిందితురాలైన హెడ్ మాస్టర్ కమలను ఎందుకు నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేయలేదు.
ప్రధానోపాధ్యాయురాలి నుండి ఫిర్యాదు ఎందుకు తీసుకున్నారు.
సహా నిందితురాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని కాపాడడానికా?
పాఠశాల హెడ్మాస్టర్ ని వెంటనే అరెస్టు చేయాలి..
భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ డిమాండ్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్ రూములో సీక్రెట్ కెమెరాలు పెట్టిన అటెండర్ యాకూబ్ పాషా విషయం వెలుగులోకి రావడం జరిగిందని భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు,పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా
బండి శ్రీనివాస్ మాట్లాడుతూ కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో
గత కొంతకాలంగా తమను లైంగికంగా వేధింపులకు గురి చేసిన విషయమై విద్యార్థినీలు పాఠశాల హెడ్మాస్టర్ కమల దృష్టికి తీసుకెళ్లినా కూడ ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఈ విషయము గురించి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పవద్దని ఒకవేళ చెబితే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడడంతో పాటు స్కూల్ పేరు నాశనం చేయవద్దని,ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు బయటి వారికి చెబితే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తానని బెదిరింపులకు పాల్పడడంతో పాటు అటెండర్ యాకూబ్ పాషాను ఎంకరేజ్ చేయడం జరిగిందని తెలిసినదని భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కొరకు భేటీ బచావో బేటి పడావో సంక్షేమ పథకాలతో వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి చొరవ తీసుకుంటున్న తరుణంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమైనదని, హేయమైన చర్య అని బండి శ్రీనివాస్ అన్నారు.
కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఒక మహిళ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉండి ఒక టీచర్ గా గౌరవప్రదమైన వృత్తిలో ఉండి విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన ఆమె దృష్టికి విద్యార్థులు తమను అటెండర్ యాకూబ్ పాషా లైంగికంగా వేధిస్తున్నాడని, బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం గురించి తెలిపితే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అటెండర్ యాకూబ్ పాషా ను కనీసం మందలించకపోవడంతో పాటు సపోర్ట్ చేయడంతో అతని ఆగడాలు ఎక్కువ అయ్యాయని, దీంతో హెడ్మాస్టర్ అండతో ఇంకా అతిగా వ్యవహరించడం జరిగిందని బండి శ్రీనివాస్ అన్నారు.
ఈ విషయము గురించి తల్లిదండ్రుల ద్వారా బయటకు వెలుగులోకి వచ్చిన వెంటనే మీడియాలో రావడంతో ఇందులో సహా నిందితురాలు అయిన పాఠశాల హెడ్మాస్టర్ కమల తన తప్పును తాను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా కొంతమంది సూచన మేరకు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ ఫిర్యాదు ఆధారంగా గంగాధర పోలీసులు నిందితుడైన అటెండర్ యాకూబ్ పాషా మీద పోక్సో చట్టం కింద వేసి నమోదు చేశారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అటెండర్ యాకూబ్ పాషాను అరెస్టు చేసిన పోలీసులు సహ నిందితురాలైనా పాఠశాల హెడ్మాస్టర్ ను కూడా ఈ కేసులో చేర్చి ఆమెను వెంటనే అరెస్టు చేయాల్సిన పోలీసులు ఎందుకు ఆమె నుండి పిటిషన్ తీసుకున్నారో తెలిపాలని,అందులో విద్యార్థినిలు బాధితురాలుగా ఎవరైనా ఉంటే వారి నుంచి పిటిషన్ తీసుకోకుండా కేవలం హెడ్ మాస్టర్ పిటీషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో తేల్చి చెప్పాలని, బాధితురాలైన విద్యార్థినిల నుండి పిటిషన్ తీసుకొని ఈ విషయమై సమగ్రమైన విచారణ చేసి అందులో నిందితురాలిగా హెడ్మాస్టర్ ను చేర్చాలని, వెంటనే అరెస్టు చేయాలని భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పోటీ చేసిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.