10/06/2026
*గ్రామ ప్రజలు తెలిపిన విషయాలపై గ్రామ ఉప సర్పంచ్ చర్చ*
గౌరవనీయులైన గ్రామ పెద్దలు, అధికారులు మరియు గ్రామ ప్రజలకు నమస్కారం. యువకులు మద్యపాన నిషేధం అంశం మరియు కోతుల నివారణ గురించి గ్రూపుల్లో చర్చలు జరిపి, ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే, ఇలాంటి ముఖ్యమైన విషయాలను గ్రామ సభకు హాజరై face-to-face గా తెలియజేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం గ్రామ యువత ఎక్కువగా వాట్సాప్ గ్రూపుల్లో మాత్రమే చర్చలు జరుపుతున్నారు; కానీ గ్రామ సభలో పాల్గొని తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తపరచాలని మనవి చేస్తున్నాను.
మద్యపాన నిషేధం అంశాన్ని సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. అలాగే డ్రైనేజీ మరియు బస్టాండ్ ఆవరణ సమస్యలను కూడా గ్రామసభకు వచ్చిన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిపై త్వరలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
గ్రామ సభలో పాల్గొని తమ విలువైన సూచనలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
తిక్కల నవీన్
ఉప సర్పంచ్,
బావుసాయిపేట గ్రామ పంచాయతీ