ITDP Kavali Constituency

ITDP Kavali Constituency Telugudesam Party Digital Wing - iTDP KAVALI CONSTITUENCY

టీడీపీ రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల నాయకత్వంలో టీడీపీలో ఎర్రన్నాయు...
21/08/2026

టీడీపీ రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల నాయకత్వంలో టీడీపీలో ఎర్రన్నాయుడు, యనమల, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, దేవేందర్‌గౌడ్‌ వంటి బీసీ నేతలు రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగారు. కూటమి నేతృత్వంలో ఎంపీటీసీ నాగరాజు కర్నూలు ఎంపీగా ఎదిగారు.





బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.16,500 కోట్ల నిధుల...
20/08/2026

బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.16,500 కోట్ల నిధులు మురిగిపోకుండా అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని... ఆ ఎన్నికల్లో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.13 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వార్త విని బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




స్పష్టమైన విధానాలు, పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు, అనుమతులు... చంద్రబాబు గారి నాయకత్వంలోని ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం...
20/08/2026

స్పష్టమైన విధానాలు, పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు, అనుమతులు... చంద్రబాబు గారి నాయకత్వంలోని ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలు ఇవి. అందుకే రాష్ట్రానికి తాజాపెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఏపీకి రెండవ స్థానం దక్కడం చంద్రబాబు గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనం!





ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలను నిలబెట్టుకుంటూ... రాష్ట్ర మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పి...
17/08/2026

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలను నిలబెట్టుకుంటూ... రాష్ట్ర మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ అమలులోకి తెచ్చిన స్త్రీశక్తి పథకం అన్ని ప్రాంత మహిళలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులుండే మహిళలకు ఎక్కడకు వెళ్లాలన్నా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలంటున్నారు మహిళలు.






13/08/2026

ఆగస్టు 15న కావలిలో 'తెలుగు తల్లి పార్క్' ప్రారంభానికి... సర్వం సిద్ధం...


రీ-సర్వే ద్వారా కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలు, అలాగే APSADA Act / CAA Act కింద నమోద...
12/08/2026

రీ-సర్వే ద్వారా కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలు, అలాగే APSADA Act / CAA Act కింద నమోదైన అన్ని ఆక్వా ఫారాలకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించే రాయితీని విస్తరించింది కూటమి ప్రభుత్వం. ఆక్వా రైతులకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తికి ప్రోత్సాహం – ఎగుమతులకు బలం ఇచ్చేందుకే ఈ నిర్ణయం.




ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ చేనేత కార్మికులకు అండగా ఉంటోన్న ప్రభుత్వం... రేపు 'నేతన్న సే...
07/08/2026

ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ చేనేత కార్మికులకు అండగా ఉంటోన్న ప్రభుత్వం... రేపు 'నేతన్న సేవలో' అనే మరో పథకాన్ని తెస్తోంది. ఈ పథకం కింద ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుగారు రేపు చీరాల నుండి నిధులు విడుదల చేస్తారు.




రెండేళ్లలో రూ.1,46,690 కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించింది కూటమి ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ విభాగాలలో 30,607 ఉద్యోగాలను...
07/08/2026

రెండేళ్లలో రూ.1,46,690 కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించింది కూటమి ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ విభాగాలలో 30,607 ఉద్యోగాలను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. అందులో మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను, కానిస్టేబుల్ నియామకాలతో 5,757 పోస్టులను భర్తీ చేసింది.




మొదటి ఏడాది (2025-26) రూ.10,091 కోట్లతో 67,27,164 మందికి తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం... రెండో ఏడాది 67,...
23/07/2026

మొదటి ఏడాది (2025-26) రూ.10,091 కోట్లతో 67,27,164 మందికి తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం... రెండో ఏడాది 67,47,190 మంది విద్యార్థులకు చెందిన 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేయనుంది.




కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసిన ‘కీ ఇండికేటర్స్‌ అండ్‌ అనలిటికల్‌ ఓవర్‌వ్యూ ఆఫ్‌ స్కీమ్స్‌-2024-25’ నివేద...
20/07/2026

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల విడుదల చేసిన ‘కీ ఇండికేటర్స్‌ అండ్‌ అనలిటికల్‌ ఓవర్‌వ్యూ ఆఫ్‌ స్కీమ్స్‌-2024-25’ నివేదికలో... గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా పనిచేస్తోందని కేంద్రం పేర్కొంది.


Address

KAVALI MLA OFFICE
Kavali
524201

Alerts

Be the first to know and let us send you an email when ITDP Kavali Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share