Janasena Party Ulavapalla

Janasena Party Ulavapalla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janasena Party Ulavapalla, Political Party, Kavali.

Offical Page of Janasena Party Ulavapalla ||
President: Venkata Teja Bathala || నేను చూడని ఓటమి లేదు, నన్ను తాకని అవమానం లేదు, నేను మోయని భారము లేదు || Jai JanaSena ||

02/07/2026

కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు బొమ్మిడి నాయకర్ గారు మరియు కావలి నియోజకవర్గ జనసైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు జనసేన క్రియాశీల సభ్యులను నాయకర్ గారికి పరిచయం చేస్తూ, నా పేరు ప్రస్తావించి "తేజా మా కుటుంబ సభ్యుడిలాంటివాడు" అని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

ఈరోజు **జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ** ఆధ్వర్యంలో **నెల్లూరు టౌన్ హాల్**‌లో జరిగిన నామినేషన్ కార్యక్రమ...
01/07/2026

ఈరోజు **జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ** ఆధ్వర్యంలో **నెల్లూరు టౌన్ హాల్**‌లో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో **ఉలవపాళ్ళ పంచాయతీ అధ్యక్ష పదవికి నేను స్వయంగా నా నామినేషన్ దరఖాస్తును సమర్పించాను.**

ఈ సందర్భంగా **నెల్లూరు జిల్లా పరిశీలకులు బొమ్మిడి నాయకర్ గారిని** కలిసి, మా ఉలవపాళ్ళ గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, చేపట్టిన ప్రజాసేవా కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతానికి చేసిన కృషి గురించి వివరించాను.

వాటిని ఆసక్తిగా విన్న నాయకర్ గారు మా గ్రామంలో పార్టీ కోసం చేసిన సేవలను అభినందిస్తూ, వ్యక్తిగతంగా తన కార్యాలయానికి వచ్చి రెండు నిమిషాల నిడివి గల AV (Audio Visual) ప్రజెంటేషన్ ద్వారా గ్రామంలో పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలను చూపించాలని ఆహ్వానించారు.

ఈ ప్రోత్సాహం నాకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేస్తాను.

**జై జనసేన! ✊❤️**

కావలి నియోజకవర్గానికి సమాచార కమిటీగా నియమితులైన వెంకట సుబ్బయ్య గారికి @⁨VenkataSubbaiah JSP⁩, సాయి అన్న⁩, శ్రీనాథ్ @⁨Sri...
24/06/2026

కావలి నియోజకవర్గానికి సమాచార కమిటీగా నియమితులైన వెంకట సుబ్బయ్య గారికి @⁨VenkataSubbaiah JSP⁩, సాయి అన్న⁩, శ్రీనాథ్ @⁨Srinadh PawanKalyan President Kavali⁩, రిషి ❤️ @⁨Rishi JanaSena⁩ వెంకయ్య గారికి @⁨Rural⁩ నా హృదయపూర్వక శుభాకాంక్షలు 👏👏👏

కావలిలో పార్టీని మొదటి నుంచి నిలబెట్టి, ఎన్నో కష్టాలు పడి పనిచేసిన మన జనసేన పార్టీ నాయకులకు ఈ గుర్తింపు రావడం ఎంతో గర్వకారణం. ముందుముందు కూడా పార్టీ అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

ఇట్లు,
వెంకట తేజ బత్తల | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

ఉలవపాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సింగపేట నుంచి ఉలవపాళ్ళ గ్రామంలో వడ్డిపాలెం వరకు కొత్త 3 ఫేజ్ ట్రాన్స్‌...
22/06/2026

ఉలవపాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సింగపేట నుంచి ఉలవపాళ్ళ గ్రామంలో వడ్డిపాలెం వరకు కొత్త 3 ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ లైన్లు వేయడం జరిగింది.

మొదటగా అనుకున్నట్లుగా హైవే మీదుగా అనుమతులు రాకపోవడంతో, అల్లూరు సబ్‌స్టేషన్ నుంచి సింగపేట మీదుగా లైన్ తీసుకురావడం జరిగింది. ఈరోజుతో ఆ లైన్ మన వడ్డిపాలెం వరకు చేరుకుంది.
ఇంకా వచ్చే 1 నెలలోపు ఉలవపాళ్ళ గ్రామంలో అవసరాన్ని బట్టి 63 KVA లేదా అవసరమైన ప్రాంతాల్లో 100 KVA ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి, 11KV లైన్ వేయడం జరుగుతుంది.
అలాగే 11KV లైన్‌ను ఒకే మెయిన్ సెంటర్‌లో కాకుండా, కొన్ని మ్యాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే 11KV లైన్‌ను 9.1 మీటర్ల ఎత్తు గల పోల్స్‌తో ఎత్తుగా తీసుకురావడంకూడా జరుగుతుంది.
దీంతో గ్రామంలో ఉన్న కరెంట్ సమస్యలు, దెబ్బతిన్న పోల్స్ సమస్యలు, విద్యుత్ కొరత వంటి ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది.
మా విజ్ఞప్తికి సహకరించిన దగదర్తి AE గారికి మరియు శ్రమించిన లైన్‌మెన్‌లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

ఈరోజు మన ఉలవపాళ్ళ గ్రామంలో పోలిశెట్టి శ్రీనివాసులు గారి ఇంటి వద్ద **SIR కార్యక్రమం** మరియు గ్రామంలోని పలు సమస్యలపై **కూట...
21/06/2026

ఈరోజు మన ఉలవపాళ్ళ గ్రామంలో పోలిశెట్టి శ్రీనివాసులు గారి ఇంటి వద్ద **SIR కార్యక్రమం** మరియు గ్రామంలోని పలు సమస్యలపై **కూటమి మండల మరియు గ్రామ నాయకులతో జనసేన పార్టీ తరఫున చర్చించడం జరిగింది.**

ఉలవపాళ్ల గ్రామ ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య కరెంట్ సమస్య. కొద్దిగా గాలి వచ్చినా, భారీ వర్షం పడినా...
06/06/2026

ఉలవపాళ్ల గ్రామ ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య కరెంట్ సమస్య. కొద్దిగా గాలి వచ్చినా, భారీ వర్షం పడినా గంటల తరబడి విద్యుత్ నిలిచిపోవడం మనం ఎన్నోసార్లు చూశాం. దీనికి ప్రధాన కారణం అడవి ప్రాంతం నుంచి గ్రామానికి విద్యుత్ లైన్ రావడమే.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం తరఫున AE గారికి వినతి ఇవ్వడం జరిగింది. లైన్‌మెన్‌లు మరియు సంబంధిత అధికారులతో చర్చించి, లైన్ షిఫ్టింగ్‌కు అవసరమైన అనుమతులు ఈరోజు తీసుకురావడం జరిగింది.

కొత్త విద్యుత్ లైన్ టిప్పా డౌన్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్ నుంచి ఉలవపాళ్ల పెట్రోల్ బంక్ మీదుగా గ్రామంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయబడుతుంది. ఈ పనిని వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయి.

ఈ పనికి కావాల్సిన అన్ని అనుమతులు, ఫాలోఅప్ చేసి ఈరోజు సాధించడం జరిగింది. పనిని ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.

ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.

ఇట్లు,
వెంకట తేజ బత్తల
అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

ఈరోజు అలహరి సుధాకర్ గారిని కావలి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ, ...
29/05/2026

ఈరోజు అలహరి సుధాకర్ గారిని కావలి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ, ఉలవపాళ్ల పంచాయతీకి అభివృద్ధి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. జై జనసేన ✊

ఇట్లు,
వెంకట తేజ బత్తల
అధ్యక్షులు | జనసేన పార్టీ – ఉలవపాళ్ల

Team NDA: 3 నెలల్లో అర్హత ఉన్న ప్రతి అవ్వ, తాతకు ఉలవపాళ్లలో పెన్షన్ ఇప్పించబోతున్నాం.పెన్షన్ కోసం జనసేన తేజను సంప్రదించం...
27/05/2026

Team NDA: 3 నెలల్లో అర్హత ఉన్న ప్రతి అవ్వ, తాతకు ఉలవపాళ్లలో పెన్షన్ ఇప్పించబోతున్నాం.

పెన్షన్ కోసం జనసేన తేజను సంప్రదించండి. వెల్ఫేర్ అసిస్టెంట్ సహాయంతో మీ పెన్షన్ అప్లై చేసి శాంక్షన్ చేయిస్తాడు మీ తేజ.

Address

Kavali
524201,02,03

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party Ulavapalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share